బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్, రణ్‌బీర్‌కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. బ్రహ్మాస్త్ర చిత్రంలో జంటగా కనిపించిన వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్ 14న పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ స్టార్ కపుల్‌కు రాహా అనే కూతురు జన్మించింది. అయితే ఇప్పటివరకు తమ గారాల పట్టి మొహాన్ని అభిమానులకు పరిచయం లేదు.
తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఈ జంట ఎట్టకేలకు తమ కూతురి మొహాన్ని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. తమ ఇంటి వద్దకు విచ్చేసిన మీడియా ప్రతినిధులకను పలకరిస్తూ కుమార్తెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాహా చాలా క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ అచ్చం రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ లానే ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.
కాగా.. రణ్‌బీర్ కపూర్ ఇటీవలే యానిమల్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మరోవైపు అలియాభట్ రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
Rishi kapoor + Raj kapoor + Ranbir kapoor genes won for me😭♥️ https://t.co/0mX7C4xwAL
— Susmita✨ (@SSusmita0319) December 25, 2023
Raha baby dito assemble of rishi kapoor 💏
God bless her#RanbirKapoor pic.twitter.com/Q0gY0AQ14S— r (@rajkbest) December 25, 2023
Raha is so beautiful , so elegant just looking like a Wow❤️🔥
Glimpse of Rishi Kapoor😍#AliaBhatt#RanbirKapoor#rahakapoorpic.twitter.com/ZxXiEKARwe— India's Elon Musk (@EshhanMusk) December 25, 2023
Comments
Please login to add a commentAdd a comment