బాలీవుడ్ భామ ఆలియా భట్ పరిచయం అక్కర్లేనిపేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే చిత్రంతో అభిమానులను పలకరించింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు మరో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌తో పాటు హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తన పెళ్లి జీవితంపై వచ్చిన రూమర్స్‌పై అలియా భట్ క్లారిటీ ఇచ్చింది.
ఆలియా మాట్లాడుతూ.. 'ఇప్పుడున్నదంతా సోషల్ మీడియా, ఇంటర్నెట్ కాలం. ప్రతి రోజు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. నేను సన్నగా మారడానికి.. అంతే కాకుండా తెల్లగా అయ్యేందుకు సర్జరీలు చేయించుకున్నట్లు ప్రచారం చేశారు. అలాగే మ్యారేజ్ లైఫ్‌పై రూమర్స్ వచ్చాయి. నేను గతంలో రణ్‌బీర్‌కు లిప్‌స్టిక్ నచ్చదని.. వేసుకున్న వెంటనే తీసేయాలంటాడని చెప్పాను. అయితే ఈ విషయాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను వేధిస్తున్నాడంటూ రాశారు. రణ్‌బీర్ మంచి వ్యక్తి. ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయడం బాధ కలిగిస్తుంది. కానీ అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. అందుకే వాటిని నేను పట్టించుకోను. ' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment