![Kangana Ranaut warns film mafia after alleging she is being spied - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/6/kangana-ranaut.jpg.webp?itok=Z_D2A3Gt)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనపై గూఢచర్యం జరుగుతోందని ఆరోపించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి తనను ఎవరో టార్గెట్ చేశారని చెబుతోంది. అంతే కాకుండా పరోక్షంగా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ను ఉద్దేశించి చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేశారు. నా ప్రతి కదలికను వారు గమనిస్తున్నారని పేర్కొంది. అయితే ఆమె ఈ ప్రకటన చేసిన ఒక్కరోజులోనే తనను ఫాలో చేస‍్తున్నవారు వెనక్కి తగ్గారని వివరించింది. ప్రస్తుతం తనపై నిఘా విరమించుకున్నారని తెలిపింది.
ఈ సందర్భంగా తనపై గూఢచర్యం చేస్తున్నారని ఆరోపించిన చాంగు మంగు 'ఫిల్మ్ మాఫియా'కు కంగనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? ఇంట్లోకి దూరి మరీ కొడతా అంటూ ఓ రేంజ్‌లో హెచ్చరించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 'మై పాగల్ హు, ఘర్ మే ఘుస్ కే మారుంగి' అంటూ హిందీలో రాసుకొచ్చింది. గూఢచర్యంపై ప్రకటన చేసిన ఒక రోజులోనే తన చుట్టూ ప్రస్తుతం ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగడం లేదని తన అనుచరులకు తెలిపింది.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాస్తూ.. 'నా గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ దయచేసి నా హెచ్చరిక. గత రాత్రి నుంచి నా చుట్టూ ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగలేదు. కెమెరాలతో ఎవరూ నన్ను అనుసరించలేదు. ఆ చాంగు మంగు గ్యాంగ్‌కు నేను ఒకటే చెబుతున్నా. నేను పిచ్చిదాన్ని అని మీరు అనుకుంటే పొరపాటు. ఇందులో ఎంత పెద్దవారైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఇంట్లోకి దూరి మరీ కొడతా.' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కంగనా రనౌత్.
కాగా.. కంగనా తదుపరి ఎమర్జెన్సీ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. రజనీకాంత్ తమిళ చిత్రానికి సీక్వెల్ 'చంద్రముఖి 2'లో కూడా తాను నటిస్తానని కంగనా ప్రకటించింది.ఆ తర్వాత 'తేజస్'లో కనిపించనుంది, ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషించనుంది. ఈ చిత్రం అధికారిక విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment