
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ నాగిని సీరియల్‌తో సౌత్‌లో ఫేమస్ అయింది. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ది భూత్నీ అనే హారర్ మూవీలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మౌనీ రాయ్.. ఎక్కడికెళ్లినా తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మపై ఎప్పుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. గ్లామర్ కోసం చాలాసార్లు సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని.. దాన్ని కవర్ చేసేందుకు తన హెయిర్‌స్టైల్‌ను మార్చుకుందని నెటిజన్స్ విమర్శించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ భామ స్పందించింది. ఇలాంటి వారిని చూసినప్పుడు తనకు జాలేస్తుందని చెప్పుకొచ్చింది.
మౌనీ రాయ్ మాట్లాడుతూ.. 'నేను అలాంటి వ్యాఖ్యలను చదివినప్పుడు.. కొన్నిసార్లు ఏఐ వీడియోలను చూసినప్పుడు చాలా భయంకరంగా అనిపిస్తుంది. మీరు ఇతరులను అలా చూడటం ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ముఖాన్ని ఇతరుల శరీర ఆకృతిపకి జత చేసి వక్రీకరించడం చూస్తే అది చాలా అసహ్యంగా అనిపించింది. ఈ రకమైన వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు? దీంతో ఏమి సాధించాలనుకుంటున్నారు? వారి లక్ష్యం ఏమిటి? ఎందుకంటే మీరు చేస్తున్న దానితో ఎవరికీ ఉపయోగం లేదు. అలా చేస్తున్న వ్యక్తుల మంచిని ఎవరూ కోరుకోరు' అని తెలిపింది.
"మొదట సోషల్ మీడయాలోకి వచ్చినప్పుడు నా పట్ల చాలామందిలో ద్వేషం కలిగింది. అలాంటి వారి ప్రొఫైల్స్‌ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ సమయంలో నాకు చాలా జాలిగా అనిపిస్తుంది. అలాంటి వారితి సరైన బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి వ్యక్తులు లైక్‌ల కోసం ఏమైనా చేస్తారు. ఇతరుల గురించి చెత్తగా రాస్తూ ప్రచారం చేస్తారు. కానీ నా అభిమానుల నుంచి లభించే ప్రేమను ఎప్పటికీ తిరస్కరించలేను' అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.