Ranbir Kapoor and Alia Bhatt Marriage in April Mid 2022 - Sakshi
Sakshi News home page

Alia Bhatt-Rambir Kapoor: విక్ట్రీనా బాటలోనే అలియా-రణ్‌బీర్‌?, అక్కడే పెళ్లి వేడుకలు!

Published Sun, Apr 3 2022 4:57 PM | Last Updated on Sun, Apr 3 2022 9:40 PM

Ranbir Kapoor And Alia Bhatt Marriage Date Fix As Kapoor Family Sentiment - Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ల పెళ్లి ఎప్పుడెప్పుడాని ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2020 డిసెంబర్‌లో జరగాల్సి వీరి వివాహం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎంతో కాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంజ పెళ్లికి ఇరు కటుంబాలు సైతం గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చాయి. దీంతో ఇంకేందుకు వీరు ఆలస్యం చేస్తున్నారని ఓ వర్గం ఫ్యాన్స్‌ అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా అలియా-రణ్‌బీర్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌ అయ్యిందని వార్తలు వినిపిస్తుండగా.. ఇప్పటికే వారి పెళ్లి అయిపోయిందంటూ ఫేక్‌ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

చదవండి: నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన..

దీంతో వీరి పెళ్లిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ రణ్‌బీర్‌-అలియా పెళ్లి డేట్‌ ఫిక్స్‌ అయ్యిందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌ మాదిరిగా వీరు కూడా పెళ్లి విషయంలో గొప్యత పాటిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏప్రిల్‌లో వీరిద్దరూ పెళ్లి పీటల ఎక్కడం ఖాయమనే వార్తలు బీ-టన్‌లో బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరి పెళ్లి ఓ సెంటిమెంట్‌ ప్లేస్‌లో జరుగుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే దీనికి ముహుర్తం కూడా ఫిక్స్‌ అయ్యిందట. అలియా-రణ్‌బీర్‌లు డెస్టినేషన్ వెడ్డింగ్‌ కాకుండా తమ ఫ్యామిలీ సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఇస్తూ పెళ్లి వేడుకను జరపుకొనున్నారట. ఇక కపూర్ వంశానికి చెందిన పురాతన వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో రణ్‌బీర్‌- ఆలియా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా కపూర్ కుటుంబ సభ్యులు ముంబైలోని ఆర్కే హౌస్‌‌ను సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. అంతేకాదు రణ్‌బీర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్‌ల పెళ్లి కూడా అక్కడే జరిగిందట.

చదవండి: డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: నటి హేమ

ఈ క్రమంలోనే రణ్‌బీర్ పెళ్లి కూడా అక్కడే జరిపించాలని కపూర్ ఫ్యామిలీ అనుకుంటుందట. అందుకే ఎలాంటి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేసుకొకుండా కుటుంబ సభ్యుల సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఈ లవ్‌ బర్డ్స్‌ తమ వివాహన్ని ఆర్కే హౌజ్‌లో కొద్దిమంది సన్నిహితులు, బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా రణ్‌బీర్‌-అలియా తొలిసారి జంటగా నటించిన బ్రహ్మస్త్ర తొలి పార్ట్‌ షూటింగ్‌ రీసెంట్‌గా పూర్తయ్యింది. దీంతో ఈ లవ్‌బర్డ్స్‌పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలనుకుంటున్నారని బీ-టౌన్‌లో చర్చించుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement