అలియా భట్‌ ప్రొత్సాహంతోనే ఆ సన్నివేశాల్లో నటించా : రణ్‌బీర్‌ కపూర్‌ | Ranbir Kapoor Response On Intimate Scene In Animal Movie | Sakshi

యానిమల్‌.. భార్య సహకారంతోనే ఇంటిమేట్‌ సన్నివేశాల్లో నటించా: రణ్‌బీర్‌ కపూర్‌

Jan 21 2024 12:31 PM | Updated on Jan 21 2024 1:01 PM

Ranbir Kapoor Response On Intimate Scene In Animal Movie - Sakshi

ఈ మధ్య కాలంలో సినిమాల్లో రొమాంటిక్‌ సన్నివేశాలు కామన్‌ అయిపోయాయి. ముద్దు సీన్స్‌ లేని సినిమాలు చాలా అంటే చాలా రేర్‌గా వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కథ డిమాండ్‌ మేరకు అలాంటి సన్నివేశాలను పెడితే..మరికొన్ని సినిమాల్లో మసాల యాడ్‌ చేస్తేనే టికెట్లు తెగుతాయనే ఉద్దేశంతో శృంగార సన్నివేశాలను ఇరికిస్తున్నారు. ప్రేక్షకులు అయితే ఇంటిమేట్‌ సన్నివేశాలను లైట్‌ తీసుకొని, సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారు.

(చదవండి: ఆ హీరో సడన్‌గా దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తించాడు: భాగ్యశ్రీ)

ఇటీవల ఇంటిమేట్‌ సన్నివేశాలపై చర్చ జరిగిన ఏకైక సినిమా యానిమల్‌ మాత్రమే. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మోతాదుకు మించిన ఇంటిమేట్‌ సన్నివేశాలు ఉన్నప్పటికీ..అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. అలాంటి సన్నివేశాలే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి కూడా. అయితే ఇంటిమేట్‌, హింసాత్మక సన్నివేశాల్లో నటించినప్పుడు హీరో రణ్‌బీర్‌ కపూర్‌ చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట.  కెరీర్‌ పరంగా చెడ్డ పేరు వస్తుందని భయపడ్డాడట. కానీ భార్య అలియా భట్‌ మాత్రం చాలా ఎంకరేజ్‌ చేసిందట. ఆమె ప్రోత్సాహంతోనే ఇంటిమేట్‌ సన్నివేశాల్లో నటించానని రణ్‌బీర్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

(చదవండి: ‘తొలిప్రేమ’లో పవన్‌ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?)

‘ఒక నటుడిగా నాకుంటూ కొన్ని హద్దులు ఉన్నాయి. వాటిని దాటాలని ఎప్పుడూ అనుకోలేదు. దర్శకుడు సందీప్‌ వంగా యానిమల్‌ కథ చెబుతూ..  ఇంటిమేట్‌, హింసాత్మక సన్నివేశాలు ఇలా ఉంటాయని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. కొన్ని సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఇలా చేయాలా? వద్దా? అనే డైలమాలో పడేవాడిని. కానీ నా భార్య అలియా భట్‌ చాలా సపోర్ట్‌గా నిలిచింది.  ‘సినిమా కోసమే చేస్తున్నావు. ఇది కేవలం పాత్ర మాత్రమే’ అంటూ ధైర్యం చెప్పింది. సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ఆమెతో చర్చించేవాడిని. ఈ సినిమా విషయంలో తను నాకెంతో అండగా నిలిచింది’అని రణ్‌బీర్‌ చెప్పారు. 

యానిమల్‌ విషయానికొస్తే.. ‘అర్జున్‌ రెడ్డి’ఫేమ్‌ సందీప్‌ వంగా తెరకెక్కించిన మూడో చిత్రమిది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా, అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్‌ 1న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..రణ్‌బీర్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది. దీనికి కొనసాగింపుగా ‘యానిమల్‌ పార్క్‌’ రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement