
సాక్షి, సినిమా : బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు పద్మావతి చిత్ర వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఛారిటీ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటని అన్నారు. ఎందుకంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తనలాంటి వాళ్లు తప్పుకుండా చూస్తారు కాబట్టేనంట.
‘‘నిజంగా ఇది నవ్వుతో పాటు చిరాకు తెప్పించే పరిణామం. ఒక దర్శకుడుపై దాడి చేయడం మొదటి సారి చూస్తున్నా. ఒక సినిమాను చూడకముందే..వాళ్లు అలా ప్రవర్తించడం ఏమిటి. అసలు వాళ్లకి నిజమైన పద్మావతి కథ తెలుసా ? అనేది నా అనుమానం. నిజంగా ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అనుకోని విధంగా వారు ఇష్టం వచ్చినట్లు ఉహించుకుంటున్నారు. ఆ విధమైన ఆలోచనతో ఎలా వివాదాలను సృష్టిస్తున్నారో’’ అని అనురాగ్ వివరించారు.
కాగా, బాలీవుడ్ లో ఈ ఇయర్ బిగెస్ట్ రిలీజ్ గా భావించిన పద్మావతి రాజ్‌పుత్ కర్ణిసేన అభ్యంతరాలు, సెన్సార్ సమస్యలతో ఇంకా రిలీజ్ నోచుకోని విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నా.. స్పష్టత లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment