anurag basu
-
కిశోర్‌కుమార్ బయోపిక్‌లో..?
ప్రముఖ దివంగత గాయకుడు– నటుడు కిశోర్ కుమార్ బయోపిక్ కోసం హిందీ చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కిశోర్ కుమార్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై స్పష్టత రావడం లేదు. పైగా ఎప్పటికప్పుడు పేర్లు మారుతున్నాయి. తొలుత అక్షయ్ కుమార్ పేరు వినిపించింది. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ పేరు బీ టౌన్లో గట్టిగా వినిపిస్తోంది. కిశోర్ కుమార్ బయోపిక్కు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తారని, భూషణ్ కుమార్ నిర్మిస్తారని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ గురించి ఇటీవల ఆమిర్ ఖాన్ – అనురాగ్ బసుల మధ్య చర్చలు జరిగాయని, త్వరలోనే ఈ ్ర΄ాజెక్ట్ గురించి ఓ అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని భోగట్టా. మరోవైపు ‘చార్ దిన్ కీ జిందగీ, గజిని 2, ఉజ్వల్ నికమ్ బయోపిక్, ఓ సూపర్ హీరో ఫిల్మ్ (దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో) చిత్రాలు కూడా ఆమిర్ ఖాన్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి... ఆమిర్ ఖాన్ నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ఆమిర్ నటించిన ‘సితారే జమీన్ పర్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
రెండు వారాలే బతుకుతానని చెప్పారు: బర్ఫీ డైరెక్టర్
బర్ఫీ, లూడో, జగ్గా జసూస్ వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు అనురాగ్ బసు. 2004లో అతడు బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. అతడిని పరీక్షించిన వైద్యులు కేవలం రెండు వారాలు మాత్రమే బతుకుతాడని చెప్పారు. ఆ సమయంలో అతడి భార్య ఏడు నెలల గర్భిణి. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అనురాగ్. ఆయన ఇంకా ఏం మాట్లాడాడంటే.. 'ఓసారి నాకు నోటి నిండా పొక్కులు వచ్చాయి. కానీ నాకు షూటింగ్ ఉండటంతో నేరుగా సెట్స్‌కే వెళ్లాను. కానీ ముకేశ్ భట్ మాత్రం ఈ రోజు షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసి వెళ్లిపో అన్నాడు. సాధారణంగా అతడు ఎప్పుడూ అలా చెప్పడు. ఆ తర్వాత హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నాను. అప్పుడు మా పేరెంట్స్ ముఖం చూశాక ఏదో చెడు జరుగుతోందనిపించింది. క్యాన్సర్ అని బయటపడింది. మొదట్లో కొంచెం తలనొప్పితో పాటు నీరసంగా అనిపించేది. అయినా సరే ఇమ్రాన్ హష్మీతో కలిసి బీర్ తాగేందుకు హాస్పిటల్ గది నుంచి బయటకు తప్పించుకుని వచ్చేవాడిని. అయితే రానురానూ నా పరిస్థితి దిగజారిపోయింది. మందులు పనిచేయలేదు. నా పేరెంట్స్ నన్ను ఆ స్థితిలో చూసి తట్టుకోలేక కలవడమే మానేశారు. అంతర్గతంగా రక్తస్రావం అధికం కావడంతో చాలామంది నాకు రక్తదానం చేశారు. ఓసారి మహేశ్ భట్ వచ్చి నా తలపై చేయి వేసి నిమిరాడు. అప్పుడతడి చేతులు వణికాయి. అనుపమ్ ఖేర్ కూడా నన్ను కలవడానికి వచ్చాడు. అప్పుడు నాకు పరిస్థితి చేయిదాటుతోందని అర్థమైంది. నా ముఖం వాచింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. ఊపిరి కూడా సరిగా ఆడకపోవడంతో విలవిల్లాడిపోయాను. ఎటువంటి చికిత్స కూడా పని చేయలేదు. మొదట్లో నా పరిస్థితి గురించి నా భార్యకు చెప్పలేదు. కానీ టీవీ ఛానళ్ల ద్వారా తను విషయం తెలుసుకుంది. తర్వాత నా వెంటే ఉంది. టాటా మెమోరియల్ ఆస్పత్రికి షిఫ్ట్ చేసి నన్ను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. అప్పుడు నాకు ఒక బెడ్ కూడా దొరకలేదు. కానీ సునీల్ దత్ నాకోసం ఒక బెడ్ ఏర్పాటు చేశాడు. అప్పుడు నాకు బెడ్ మీదే వైద్యం అందించారు. కీమోథెరపీ చేశారు. ఇండస్ట్రీలో ఉన్నందుకే నాకు అంత త్వరగా బెడ్ దొరికి వైద్యం అందించగలిగారు. అదే వేరే వ్యక్తులైతే చాలా కష్టాలు పడేవారు. చాలామంది నన్ను కాపాడటం కోసం రక్తదానం చేస్తామని ముందుకు వచ్చారట. ఇప్పటికీ నా ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం ఎవరిదో నాకు తెలియదు అని చెప్పుకొచ్చాడు' అనురాగ్ బసు. చదవండి: నటి సుకృతి ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ భర్తకు నయన్ రూ.20 కోట్లు విలువ చేసే గిఫ్ట్, మరి విఘ్నేశ్ ఏమిచ్చాడో తెలుసా? -
కంగనా ఔట్.. దీపిక ఇన్
ఒకరు చేయాల్సిన సినిమా మరొకరి దగ్గరకు వెళ్లడం ఇండస్ట్రీలో చాలా కామన్. ఆ పాత్ర మీద ఎవరి పేరు రాసుంటే వాళ్లకు వెళ్తుంది. లేటెస్ట్గా బాలీవుడ్లో కంగనా చేయాల్సిన ఓ సినిమాను దీపికా పదుకోన్ చేయబోతున్నారని టాక్. దర్శకుడు అనురాగ్ బసు, కంగనా రనౌత్ ‘ఇమిలీ’ సినిమా చేయాలి. డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి కంగనా తప్పుకున్నారు. ఆమె స్థానంలో దీపికా అయితే బావుంటుందని అనురాగ్ బసు భావిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని తెలిసింది. ఈ చిత్రం నుంచి తప్పుకోవడం గురించి కంగనా మాట్లాడుతూ– ‘‘ఇమిలీ’ సినిమాలో నా మెంటర్‌తో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం దొరికింది అనుకున్నాను. కానీ కుదరడం లేదు. డేట్స్ ఇష్యూ గురించి అనురాగ్‌గారితో మాట్లాడాను. ఆయన నా పరిస్థితి అర్థం చేసుకున్నారు’’ అన్నారు. ‘ఇమిలీ’ చిత్రాన్ని 2018 నవంబర్‌లో స్టార్ట్ చేయాలి. కంగన ‘మణికర్ణిక’ సినిమాతో, నేను మరో ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యాం. ప్రస్తుతం ‘పంగా’ సినిమా చేస్తోంది. మళ్లీ త్వరలోనే మేం కలసి సినిమా చేస్తాం’’ అన్నారు అనురాగ్ బసు. -
కలిసి నటిస్తున్న మాజీ ప్రేమికులు
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేలు ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకు తిరిగిన సంగతి తెలిసిందే. హే జవానీ హై దివానీ, తమాషా సినిమాల్లో ఆకట్టుకున్న ఈ జోడి, ఆఫ్ స్క్రీన్ కూడా రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ వీరి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. రణబీర్‌తో బ్రేక్అప్ చెప్పేసిన దీపిక రణవీర్‌తో ఏడడుగులు నడిచింది. బ్రేక్ అప్ తరువాత ఈ జోడి వెండితెర మీద కూడా కనిపించలేదు. ఇన్నాళ్ల తరువాత దీపిక, రణబీర్‌లు కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారట. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో రణబీర్, దీపికలు నటించనున్నారు. అంతేకాదు లవ్ రంజన్ దర్శకత్వంలో రూపొందనున్న మరో సినిమాలో ఈ జంటను నటింప చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
జోడీ రిటర్న్ ్స
బాలీవుడ్ ఆన్‌స్క్రీన్ సూపర్‌హిట్ జోడీల్లో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకోన్ జంట ఒకటి. వీళ్లిద్దరూ కలిసి ‘హే జవానీ హై దివానీ, తమాషా’ సినిమాల్లో నటించారు. లేటెస్ట్గా మరోసారి స్క్రీన్‌పై కనిపించడానికి రెడీ అయ్యారని తెలిసింది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ సినిమా రూపొందనుందట. అందులో రణ్‌బీర్, దీపికాను లీడ్ పెయిర్‌గా ఎంపిక చేసుకున్నారట చిత్రబృందం. ఈ సినిమానే కాకుండా లవ్ రంజన్ దర్శకత్వంలో రూపొందే సినిమాలోనూ రణ్‌బీర్, దీపికా జోడీగా నటిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒక్కటి కన్ఫర్మ్ అయినా మళ్లీ ఈ జంటను స్క్రీన్‌పై చూడొచ్చు. రణ్‌బీర్ ప్రస్తుతం చేస్తున్న ఫ్యాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ 2019 క్రిస్మస్ సీజన్లో రిలీజ్ కావాలి. ప్రస్తుతం 2020 సమ్మర్లో రిలీజ్ కానుందని ప్రకటించారు. -
‘అందుకే ఆ సినిమా వదులుకున్నా’
ముంబై : బాలీవుడ్ ‘క్వీన్’, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తనకు తొలి అవకాశం ఇచ్చిన అనురాగ్ బసుకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇమాలి మూవీ నుంచి తప్పుకొంటున్నట్లు పేర్కొన్న కంగన.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రకాశ్ కోవెలమూడి- ‘మెంటల్ హై క్యా’, అశ్వినీ అయ్యర్- పంగా సినిమాలతో పాటుగా జయలలిత బయెపిక్‌లో నటిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్ సినిమాతో తనను వెండితెరకు పరిచయం చేసిన..అనురాగ్ మూవీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు కంగన వెల్లడించారు. ‘గతేడాది పంగా, ఇమాలీ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాను. అనురాగ్ బసు రూపొందించాల్సిన ఇమాలీ 2018లోనే సెట్స్‌పైకి రావాల్సింది. కానీ అప్పుడు నేను మణికర్ణిక రీషూట్ కారణంగా దర్శకత్వ బాధ్యతల్లో మునిగిపోయాను. భవిష్యత్తులో కూడా డైరెక్టర్‌గా రాణించాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకొన్నా. ఈ నిర్ణయం కారణంగా ఎంతో బాధపడ్డాను. అయితే నా పరిస్థితిని.. నా మెంటార్ అనురాగ్ బసు అర్థం చేసుకున్నారు. మేము భవిష్యత్తులో కచ్చితంగా కలిసి పనిచేస్తాం’ అని కంగన చెప్పుకొచ్చారు. అదే విధంగా తన దర్శకత్వంలో తెరకెక్కిన మణికర్ణిక అద్భుత విజయం సాధించడంతో మహిళా సాధికారతపై మరిన్ని సినిమాలు తీయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక మణికర్ణిక సినిమా కారణంగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్, కంగనాల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. -
గోవాలో సెలబ్రేషన్స్
భార్య బర్త్‌డే పెట్టుకుని ఎవరైనా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉంటారా? ఉండరు కదా. స్మాల్ బ్రేక్ ఇచ్చయినా సరే భార్య ముందు వాలిపోతారు. అదే చేశారు అభిషేక్ బచ్చన్. భార్య ఐశ్వర్యారాయ్ బర్త్ డే (గురువారం) సెలబ్రేషన్స్ కోసం అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’ సీక్వెల్ షూట్‌కు బ్రేక్ ఇచ్చి గోవాలో వాలిపోయారు అభిషేక్. అక్కడ ఐశ్వర్యారాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్నేహితులకు అదిరిపోయే పార్టీ కూడా ఇచ్చారట అభిషేక్. ‘‘హ్యాపీ బర్త్ డే వైఫ్. ఐలవ్యూ’’ అని ఆయన ఐశ్వర్యకు విషెశ్ చెప్పారు. తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఐశ్వర్య. 1994లో మిస్ వరల్డ్‌గా నిలిచిన ఐశ్వర్యారాయ్ అప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారని నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. అన్నట్లు.. ఐశ్వర్య వయసు ఎంతో తెలుసా? 45లోకి అడుగుపెట్టారు. -
మెట్రోలో ఎవరుంటారు?
‘బర్ఫీ, జగ్గా జాసుస్’ సినిమాల తర్వాత దర్శకుడు అనురాగ్ బసు రూపొందించబోయే నెక్ట్స్ సినిమా బాలీవుడ్లో ఓ హాట్ టాపిక్. దానికి కారణం అందులో నటించబోయే నటీనటులే. 2007లో అనురాగ్ రూపొందించిన ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’కి సీక్వెల్‌గా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారాయన. ఇందులో కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారట. అలాగే రాజ్ కుమార్ రావ్, నవాజుద్ధిన్ సిద్ధిఖీ కూడా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారట. ‘‘భారీ తారాగణం ఉన్నప్పుడు అందరి డేట్స్ సెట్ చేయడం శ్రమతో కూడుకున్న పని. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాం. అందరి క్యాలెండర్ సంవత్సరం పాటు ఖాళీ లేదు. ఫైనలైజ్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తాను’’ అన్నారు దర్శకుడు అనురాగ్ బసు. మరి సెకండ్ మెట్రోలో ఎవరెవరు భాగం అవుతారో వేచి చూడాలి. -
పెదవి విప్పితేనే తెలుస్తుంది?
శ్రీదేవి పెదాలకు ఏమైంది? అవును ఏమైంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ. సెలబ్రిటీల విషయంలో కాదేదీ చర్చకు అనర్హం. ఇటీవల దర్శకుడు అనురాగ్ బసు నిర్వహించిన సరస్వతి పూజకు శ్రీదేవితో పాటు పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. అక్కడ శ్రీదేవి పెదాలను చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారట. ఎందుకంటూ ఆమె పెదాలు ఉబ్బి, కనిపించాయట. దాంతో శ్రీదేవి పెదాలకు సర్జరీ చేయించుకున్నారా? అనే వార్తలు మొదలయ్యాయి. పెదాల షేప్ బాగా లేకపోవడంతో సర్జరీ వికటించిందని కూడా చెప్పుకుంటున్నారు. దీని గురించి శ్రీదేవి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందరూ ఊహిస్తున్నట్లు సర్జరీ జరిగి ఉంటుందా? లేక ఆరోగ్యం బాగాలేకపోవడంవల్ల శ్రీదేవి లిప్స్ అలా తయారయయ్యాయా? అనే వాదన కూడా వినిపిస్తోంది. ఆ సంగతలా ఉంచితే కమ్‌బ్యాక్ మూవీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ అప్పుడు కూడా శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. అప్పుడు ఆ విషయం పై శ్రీదేవి స్పందిస్తూ – ‘‘అందంగా కనిపించటానికి సర్జరీలు చేయించుకోలేదు. నేను సిస్టమాటిక్ లైఫ్ లీడ్ చేస్తాను. పవర్ యోగా, టెన్నిస్ ఆడుతుంటాను. కొన్నిసార్లు అపియరెన్స్‌లో తేడా కనిపిస్తుంది. అంత మాత్రాన సర్జరీలు చేయించుకున్నారంటే ఎలా’’ అన్నారు. ఇప్పుడూ కేవలం అపియరెన్స్‌లో తేడానా? లేక సర్జరీనా? అనే విషయం పై శ్రీదేవి క్లారిటీ ఇస్తేనే వ్యవహారం సద్దుమణుగుతుంది. -
పద్మావతి... ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటి?
సాక్షి, సినిమా : బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు పద్మావతి చిత్ర వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఛారిటీ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటని అన్నారు. ఎందుకంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తనలాంటి వాళ్లు తప్పుకుండా చూస్తారు కాబట్టేనంట. ‘‘నిజంగా ఇది నవ్వుతో పాటు చిరాకు తెప్పించే పరిణామం. ఒక దర్శకుడుపై దాడి చేయడం మొదటి సారి చూస్తున్నా. ఒక సినిమాను చూడకముందే..వాళ్లు అలా ప్రవర్తించడం ఏమిటి. అసలు వాళ్లకి నిజమైన పద్మావతి కథ తెలుసా ? అనేది నా అనుమానం. నిజంగా ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అనుకోని విధంగా వారు ఇష్టం వచ్చినట్లు ఉహించుకుంటున్నారు. ఆ విధమైన ఆలోచనతో ఎలా వివాదాలను సృష్టిస్తున్నారో’’ అని అనురాగ్ వివరించారు. కాగా, బాలీవుడ్ లో ఈ ఇయర్ బిగెస్ట్ రిలీజ్ గా భావించిన పద్మావతి రాజ్‌పుత్ కర్ణిసేన అభ్యంతరాలు, సెన్సార్ సమస్యలతో ఇంకా రిలీజ్ నోచుకోని విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నా.. స్పష్టత లేకుండా పోయింది. -
‘కంగనా ఓ అద్భుతం.. ఇలా ఊహించలేదు’
ముంబయి : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను చూసి తనకు చాలా గర్వంగా ఉందని ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు అన్నారు. తనతోకలిసి ఏడేళ్ల కిందట గ్యాంగ్‌స్టర్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన కంగనాను చూస్తే తనకు నిజంగా ఆశ్చర్యం వేస్తోందని అన్నారు. 'నేను నా చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ఆమె కళ్లల్లో ఓ మెరుపు చూశాను.. కానీ, నిజంగా ఆమె ఇంత పెద్ద నటి అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. ఆమె నిజంగా పెంటాస్టిక్, ప్రతి చిత్రానికి ఆమెలో పరిణతి పెరుగుతూ వస్తోంది. ఆమె పోషిస్తున్న ప్రతి పాత్రలో ఎంతో వైరుధ్యం చూపిస్తోంది. క్వీన్, తను వెడ్స్ మను వంటి చిత్రాలే కాదు.. రంగూన్, కట్టి బట్టి, సిమ్రాన్ చిత్రాలు కూడా అద్భుతం. రంగూన్, కట్టిబట్టి, సిమ్రాన్ చిత్రాలకు వచ్చిన క్రిటిక్స్‌ను నేను పట్టించుకోను. ప్రతి చిత్రంలో ఆమె నటన అద్భుతం' అంటూ ఆయన తెగ పొగిడేశారు. -
నా కొడుకు కెరీర్‌తో ఆ డైరెక్టర్స్ ఆడుకున్నారు!
అలనాటి బాలీవుడ్ కథనాయకుడు, సీనియర్ హీరో రిషి కపూర్ మరోసారి తన వ్యాఖ్యలతో కలకలం రేపాడు. తన కొడుకు రణ్‌బీర్ కపూర్ కెరీర్‌తో అనురాగ్ కశ్యప్, అనురాగ్ బసు ఆడుకున్నారని, రణ్‌బీర్ కెరీర్ దెబ్బతినడానికి వారే కారణమని దుమ్మెత్తిపోశాడు. నేహా ధూఫియా టాక్‌షో 'నో ఫిల్టర్ నేహా'లో ముచ్చటించిన ఆయన.. 'అనురాగ్' అన్న పదంపై ఒక నిమిషం పాటు మాట్లాడాలని కోరగా.. ఆ ఇద్దరు డైరెక్టర్లను టార్గెట్ చేశారు. రణ్‌బీర్ కపూర్‌తో అనురాగ్ కశ్యప్ తీసిన 'బొంబే వెల్వెట్' అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా అపకీర్తి ముటగట్టుకోగా.. రణ్‌బీర్ తొలిసారి సహనిర్మాతగా వ్యవహరించిన 'జగ్గాజాసూస్' సినిమాను అనురాగ్ బసు తెరకెక్కించాడు. 'అనురాగ్ కశ్యప్ 'బొంబే వెల్వెట్' తీశాడు. అంతకుముందు అతను తీసిన 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్' మంచి సినిమా. కానీ అతను తీసిన 'బొంబే వెల్వెట్'లో తలేమిటో తోకేమిటో నాకు అర్థం కాలేదు. ఇక బసు బర్ఫీ అనే అద్భుతమైన సినిమా తీశాడు. ఈ సినిమాలో నా కొడుకును తీసుకున్నందుకు ఆనందమే. ఈ సినిమాతో నా కొడుకుకు గొప్ప గుర్తింపు వచ్చింది. కానీ, ఆ తర్వాత అతను 'గజ్జా జాసూసో'.. 'జగ్గాజాసూసో' ఓ సినిమా తీశాడు. ఇది కూడా పూర్తి గందరగోళంగా తీశాడు. ఈ ఇద్దరు దర్శకులు మరీ అతిగా తమ సినిమాలను ఊహించుకున్నారు' అని రిషీ అసహనం వెళ్లగక్కాడు. భారీ బడ్జెట్ సినిమాలు తీయాలన్న కోరికతో ఈ ఇద్దరు దర్శకులు తన కొడుకు కెరీర్‌ను దెబ్బతీశారని, భారీ బడ్జెట్ సినిమాలంటే వీరికి కోతుల చేతుల్లో బొమ్మలాగా మారిపోయిందని విమర్శించాడు. గతంలోనూ 'జగ్గా జాసూస్' సినిమా తీసిన అనురాగ్ బసుపై రిషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
కొడుకు సినిమా ప్లాప్: డైరెక్టర్‌పై నటుడి ఫైర్
తన కొడుకు రణ్‌బీర్ కపూర్ తాజా సినిమా 'జగ్గాజాసూస్' అట్టర్‌ప్లాప్ కావడంతో దర్శకుడు అనురాగ్ బసుపై రిషీకపూర్ ఫైర్ అయ్యారు. అనురాగ్ బసుకు బాధ్యతారాహిత్యం ఎక్కువ అని, అతను సినిమాను అనుకున్న సమయానికల్లా విడుదల చేయలేకపోయాడని విరుచుకుపడ్డారు. సంగీత దర్శకుడు ప్రీతంపై కూడా ఆయన మండిపడ్డారు. ఆయన సరిగ్గా మ్యూజిక్ అందించలేదని విమర్శించారు. రణ్‌బీర్ కపూర్-కత్రినాకైఫ్ జోడీగా బసు దర్శకత్వంలో తెరకెక్కిన 'జగ్గాజాసూస్' పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోని సంగతి తెలిసిందే. రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తొలివారాంతానికి రూ. 45 కోట్లు వసూలు చేసింది. రెండోవారాంతానికి ఈ సినిమా వసూళ్లు గణనీయంగా 85శాతం తగ్గిపోయి.. థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు రిషీకపూర్ 'మిడ్-డే' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బసును చెడామడా వాయించేశారు. 'పోయిన బుధవారం వరకు కూడా సినిమాను మిక్సింగ్ చేస్తూ అనురాగ్ బసు గడిపాడు. మీరు అలాంటిది ఊహించగలారా? ప్రీతం కూడా (విడుదలకు) ఒకవారం ముందే సంగీతం అందించినట్టు ఉంది. కనీసం సినిమాపై ముందే అభిప్రాయం కూడా తీసుకోకుంటే ఏం చెప్తాం. ఇప్పటి దర్శకులు అందరితో ఇదేరకంగా వ్యవహరిస్తున్నారు. విడుదలకు ముందే సినిమాను చూపించి అభిప్రాయం తీసుకోవడం లేదు. తామేదో అణుబాంబును తయారుచేస్తున్నట్టు భావిస్తున్నారు. నేను (జగ్గాజాసూస్) సినిమాను ప్రేమించను, ద్వేషించను. కానీ సినిమాలో 20నిమిషాలు ఎడిట్ చేస్తే బాగుండేది. బస్సును ఎక్తాకపూర్ గెంటేయడం సరైనదే. (2010లో) కైట్ సినిమా సమయంలో రాకేష్ రోషన్‌తో కూడా అతను ఇలాగే వ్యవహరించాడు. అతను బాధ్యతారాహిత్యమైన దర్శకుడు. సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేయడు. గత రెండేళ్లలో మూడుసార్లు ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయినా వాయిదా వేస్తూ వచ్చారు' అని రిషీ మండిపడ్డారు. అంతర్జాతీయంగా కొన్నిదేశాల్లో సినిమా విడుదల కాకపోవడానికి కూడా దర్శకుడు బసు చేసిన ఆలస్యమే కారణమని మండిపడ్డారు. -
డైరెక్టర్‌కి ముద్దిచ్చిన స్టార్ హీరో!
-
హీరోకి దర్శకుడు మళ్లీ ముద్దొచ్చాడు!
ముంబయి: సినిమా ప్రమోషన్లలో కొన్నిసార్లు వివాదాలు చోటుచేసుకుంటాయి. మరికొన్ని సార్లు ప్రమోషన్లో కొందరి చర్యలు హాట్ టాపిక్‌గా మారతాయి. తాజాగా అలాంటిదే ఓ మూవీ ప్రమోషన్లో జరిగింది. వేదిక మీద ఉన్న హీరో ఒక్కసారిగా దర్శకుడి వద్దకు వచ్చి ఆయనను గట్టిగా పట్టుకుని లిప్ కిప్ ఇచ్చేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతయింది. ఆ బాలీవుడ్ హీరో మరెవరో కాదు.. రణబీర్ కపూర్.. కాగా డైరెక్టర్ అనురాగ్ బసు. చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్న ప్రేమికులు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌లు నటిస్తున్న లేటెస్ట్ మూవీ జగ్గా జాసూస్. ఈ మూవీ జూలై 14న విడుదల కానున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ మూవీ ప్రమోషన్ లో హీరోహీరోయిన్లు రణబీర్, క్రతినాలతో పాటు దర్శకుడు అనురాగ్ బసు పాల్గొన్నారు. మరికాసేపట్లో ఈవెంట్ ముగుస్తుందనగా అనురాగ్ వద్దకు రణబీర్ వచ్చాడు. ఏదో విషయం చెప్పడానికి వచ్చాడనుకుని బసు.. హీరోకు మరింత దగ్గరగా జరిగాడు. ఇక అంతే.. క్షణాల్లో డైరెక్టర్ బసును గట్టిగా పట్టుకుని రణబీర్ లిప్ కిస్ ఇచ్చేశాడు. ఈ చర్యతో కత్రినాతో పాటు అక్కడున్న వారు షాకయ్యారు. మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేశాడని ఈ కిస్ హాట్ టాపిక్ గా మారింది. రణబీర్ ఇలా చేయడం మాత్రం కొత్తేం కాదు. గతంలో అనురాగ్ దర్శకత్వంలో నటించిన బర్ఫీ మూవీ ప్రమోషన్‌లోనూ ఇలాగే ఆయనను రణబీర్ ముద్దుపెట్టుకున్న విషయం తెలిసిందే. -
రణబీర్.. కత్రినా... ఈసారైనా నమ్మొచ్చా!
పాపం...! దర్శకుడు అనురాగ్ బసు నెత్తి మీద బ్యాడ్‌లక్ బ్రేక్ డ్యాన్స్ బీభత్సంగా చేస్తోందేమో. మరి, బ్యాడ్ లక్ కాకపోతే ఏంటి? ఇలియానా హిందీలో హీరోయిన్గా పరిచయమైన హిట్ ఫిల్మ్ ‘బర్ఫీ’ తీసిన ఆయన, తర్వాత రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా ‘జగ్గా జాసూస్’ చేశారు. ఏ ముహూర్తాన మొదలైందో గానీ... పబ్లిక్ ముందుకు రావడానికి ఈ సినిమా పిచ్చి పిచ్చిగా పల్టీలు కొడుతోంది. ముందు 2015లో విడుదల చేస్తామన్నారు. తర్వాత 2016లో వస్తున్నామన్నారు. ప్చ్... కుదరలేదు.ఈలోపు ఇల్లీ బేబీ ఆరు సినిమాలు చేశారు. అందులో రెండు రిలీజ్‌కి రెడీ అవుతోంటే... నాలుగు ఎప్పుడో థియేటర్లలోకి వచ్చేశాయి. కానీ, అనురాగ్ బసు చేసిన ఒకే ఒక్క సినిమా మాత్రం తెరకు రావడానికి నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ‘జగ్గా జాసూస్’ను కరెక్ట్‌గా కత్రినా కైఫ్ బర్త్‌డేకి రెండు రోజుల ముందు... జూలై 14న విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈసారైనా నమ్మొచ్చో! లేదో! వాల్ట్ డిస్నీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్లో గ్రాఫిక్స్ భలే ఉన్నాయని మంచి పేరొచ్చింది. -
దర్శకుడికి కటింగ్ చేసిన హీరోయిన్!
-
దర్శకుడికి కటింగ్ చేసిన హీరోయిన్!
హీరోయిన్లను సినీ తెరపై అందంగా చూపించేందుకు సెట్స్‌లో చాలామందే కష్టపడుతుంటారు. మేకప్ మ్యాన్లు, హెయిర్ స్టైలిష్టులు.. ఇలా పలువురు తెరపై భామలు అందంగా కనిపించేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇంతమంది సెట్స్‌లో ఉన్నా.. దర్శకుడి కోసం కత్రినా కైఫ్ స్వయంగా హెయిర్ స్టైలిష్ట్ అవతారం ఎత్తింది. ట్రిమ్మర్ తీసుకొని డైరెక్టర్‌కు కటింగ్ కూడా చేసింది. 'జగ్గా జాసుస్' షూటింగ్ సెట్స్‌లో ఈ ఘటన జరిగింది. దర్శకుడు అనురాగ్ బసుకు ఆమె స్వయంగా ట్రిమ్మర్ మిషిన్‌తో కటింగ్ చేసింది. కత్రిన ఇలా తనపై ప్రయోగం చేస్తుండగా.. తాను ఏడుస్తూ.. భరిస్తున్న వీడియోను ఆయన ట్విట్టర్లో పెట్టారు. మాజీ ప్రేమికులైన కత్రినా కైఫ్, రణ్‌బీర్ కపూర్ జంటగా 'జగ్గా జాసుస్' సినిమాను అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అనురాగ్ బసు ఇంట్లో జరిగిన గణపతి పూజలోనూ కత్రిన పాల్గొన్నది. కానీ ఆమె మాజీ ప్రియుడు రణ్‌బీర్ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. -
కిశోర్‌కుమార్ పాత్రలో!
ఎలాంటి పాత్రనైనా సవాల్‌గా తీసుకుని చేయడం రణ్‌బీర్ కపూర్‌కి ఇష్టం. అందుకో ఉదాహరణ ‘బర్ఫీ’. ప్రస్తుతం అతను మరో సవాల్‌ని స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. ప్రసిద్ధ నటుడు, గాయకుడు, దర్శక, నిర్మాత కిశోర్‌కుమార్‌గా వెండితెరపై మెరవనున్నాడు రణ్‌బీర్. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌కి వెళ్లడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. బసు ప్రస్తుతం కథ, స్క్రీన్‌ప్లే తయారీలో ఉన్నారు. ఇప్పటికే కిశోర్‌కుమార్ తనయుడు అమిత్‌కుమార్ దగ్గర అనుమతి తీసుకున్నారట. కథ గురించి అమిత్ దగ్గర చర్చలు జరిపారని సమాచారం. కిశోర్‌కుమార్‌కు సంబంధించిన పలు విశేషాలను అమిత్‌ని అడిగి తెలుసుకోవడంతో పాటు స్క్రీన్‌ప్లే తయారు చేయడానికి సహాయం చేయమని కోరారట. అందుకు అమిత్ సుముఖత వ్యక్తపరిచారని భోగట్టా. మరి.. కిశోర్‌కుమార్‌గా రణ్‌బీర్ ఎలా ఒదిగిపోతారో చూడాలి. -
ప్రతీసారి రణ్ బీర్ కోసం వెయిట్ చేయలేను!
న్యూఢిల్లీ:బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తో స్నేహం ఉన్నప్పటికీ అతనితో సినిమా చేయడం కోసం ప్రతీసారి నిరీక్షించలేనని దర్శకుడు అనురాగ్ బసూ స్పష్టం చేశాడు. తమ స్నేహం మాట ప్రక్కన పెడితే రణ్ బీర్ స్టార్ హోదా సంపాదించాక ఇక అతనితో సినిమాలు చేయలేమోనని తెలిపాడు. 2012 లో వీరిద్దరి కాంబినేషన్ లో విడుదలైన 'బర్ఫీ' చిత్రం అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అనంతరం రణ్ బీర్-అనురాగ్ ల నేతృత్వంలో 'జగ్గా జాసూస్' నవంబర్ నుంచి ఆరంభం కానుంది. అయితే ఈ చిత్రం పూర్తయిన తరువాత రణ్ బీర్ తో డేట్స్ కోసం తాను నిరీక్షించలేనని అనురాగ్ తెలిపాడు. 'మేమిద్దరం స్నేహితులం. ఇప్పటికే ఒక చిత్రాన్ని తెరకెక్కించి, మరో చిత్రానికి రంగం సిద్ధం చేశాం. ఇద్దరం కూడా బాగా కనెక్ట్ అయ్యాం. నా తరువాత ప్రాజెక్ట్ ఇంకా సిద్ధం కాలేదు. రణ్ బీర్ కూడా బిజీగా ఉంటాడు. అతని కాల్ షీట్స్ కోసం ప్రతీసారి వెయిట్ చేయలేను.ఇక రణ్ బీర్ నాతో సినిమాలను చేయలేకపోవచ్చు' అని అనురాగ్ బసూ తెలిపాడు. -
అది నా ఫేస్ బుక్ అకౌంట్ కాదు!
ముంబై: బాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు అనురాగ్ బసు తనపై ఫేస్ బుక్ లో వచ్చిన వార్తలను ఖండించాడు. అనురాగ్ ఫేస్ బుక్ అకౌంట్ లో రణబీర్ కపూర్‌తో మరోసారి సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఈ మధ్య గుప్పుమన్నాయి. అయితే ఇందులో నిజం లేదని బసు ట్విట్టర్లో ప్రకటించాడు. ఆ ఫేస్ బుక్ ఎకౌంట్ నాది కాదు. నా పేరుతో ఉన్న ఫేక్ ఎకౌంట్. రణబీర్‌తో మరో సినిమాకు ఎలాంటి సంతకం చేయలేదు. మా మధ్య అలాంటి చర్చే జరగలేదని స్పష్టం చేశాడు. 'బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు మరోసారి రణబీర్ కపూర్ తో సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది' అని అనురాగ్ బసు పేరుతో ఉన్న ఫేస్ ఎకౌంట్ ద్వారా వార్త వెలువడింది. దీంతో అందరూ నిజమే అనుకున్నారు. ఈ ఉదంతం కూడా బాలీవుడ్ లో చర్చకు దారి తీసింది. ఈ విషయంపై బసు వెంటనే స్పందించాడు. ఈ వార్తల్లో నిజం లేదని తెలిపాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్లో రణబీర్ కపూర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జబ్బా జసూస్' పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాలో రణబీర్ సరసన కత్రినా కైఫ్ నటిస్తోంది. -
ముస్లిం సోదరులకు రానా, సినీ పరిశ్రమ శుభాకాంక్షలు
గాజాలో మరణించిన చిన్నారుల కోసం రంజాన్ పవిత్ర దినం రోజున ప్రార్థన నిర్వహించాలని బాలీవుడ్ ప్రముఖుడు అనురాగ్ బసు సూచించారు. ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం రోజున బాలీవుడ్, టాలీవుడ్, పలు రాజకీయ ప్రముఖులు శుభాంకాంక్షలు తెలిపారు. కులం, ప్రాంతం, భాషలకతీతంగా భారతీయ సినిమా, రాజకీయ ప్రముఖులు ముస్లిం సోదరులకు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో తమ సందేశాలను పోస్ట్ చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో దగ్గుబాటి రానా, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, నయనతార, శరత్ కుమార్, జయం రవి తదితరులున్నారు. Eid Mubarak to everyone !! Lets pray for the people of GAZA & kids who lost their lives. pic.twitter.com/s4ucmX3SWW— anurag basu (@basuanurag) July 29, 2014 Eid Mubarak. Spread love and rise above hate it's one of my favourite days of the year— Varun Dhawan (@Varun_dvn) July 29, 2014 Eid Mubarak everyone. Wishing you all love, peace and prosperity always.— Akshay Kumar (@akshaykumar) July 29, 2014 Eid mubarak!! From the #kickteam love peace and happiness 😆 http://t.co/HmZSSy6xus— Jacqueline Fernandez (@Asli_Jacqueline) July 29, 2014 #eidmubarak to all my muslim friends— kajal agarwal (@KajalAgarwal) July 29, 2014 Eid Mubarak to one and all .— sHAhID kapooR (@shahidkapoor) July 29, 2014 The festival of Peace, Joy, Brotherhood. Eid Mubarak. May God bless all!— Suresh Raina (@ImRaina) July 29, 2014 U fasted,u prayed, U been good 4 a whole 30 days. So ur merciful ALLAH gave u a sign, Out came the moon 2 say come celebrate.. Eid mubarak!!— Rana Daggubati (@RanaDaggubati) July 29, 2014 Family time with my mom in law and kids. #EidMubarak http://t.co/Yfu7dxadXf— Farah Khan (@FarahKhanAli) July 29, 2014 Eid Mubarak! Day off frm shoot in pondy. Home sweet home. #biriyani 😁— Jayam Ravi (@actor_jayamravi) July 29, 2014 Eid mubarak to all my tweetos:) just going to gorge on the yummy Sheer korma sent home:) :)— SHILPA SHETTY (@TheShilpaShetty) July 29, 2014 Maybe it's a blasphemous thought but Eid is synonymous to Biryani for me. #EidMubarak— Ankur Tewari (@ankurtewari) July 29, 2014 Eid mubarak to all of you from me, Aalia and Omar. . Wishing u all love, joy and peace.:) have a wonderful day and wonderful year ahead.— Pooja Bedi (@poojabeditweets) July 29, 2014 Happy Birthday and Eid Mubarak to my friend and favourite Sanju @duttsanjay . Miss u and sending u loads of love and wishes. God bless— Farah Khan (@FarahKhanAli) July 29, 2014 Eid Mubarak to all my Muslim brothers & friends :) pic.twitter.com/c85lZU6df5— Gopi Mohan (@Gopimohan) July 29, 2014 Eid Mubarak all you wonderful people. Peace, prosperity and love to all of you. And yummy biryani and sevaiyan to me.— kunal kapoor (@kapoorkkunal) July 29, 2014 Eid Mubarak to all my friends.. Love,Peace and Happiness always..— satish kaushik (@satishkaushik2) July 29, 2014 Eid Mubarak! Blessings and love! Wish everyone peace and love! Forgiveness is the virtue of the strong!— Tanishaa Mukerji (@TanishaaMukerji) July 29, 2014 I wish all Sri Lankan Muslims a very happy Eid ul-Fitr. Your contributions to our unity and harmony is greatly valued. Eid Mubarak. -MR— Mahinda Rajapaksa (@PresRajapaksa) July 29, 2014 Eid Mubarak my friends!! Jashn jashn!!— Shreya Ghoshal (@shreyaghoshal) July 29, 2014 Eid Mubarak everyone...love n respect— Sidharth Malhotra (@S1dharthM) July 29, 2014 Eid Mubarak to all my brothers and sisters, may this day shower the divine blessings and guide us to peace prosperity and harmony— R Sarath Kumar (@realsarathkumar) July 29, 2014 Eid Mubarak to all of you. Happiness, peace and prosperity.— Abhishek Bachchan (@juniorbachchan) July 29, 2014 Eid Mubarak to everyone pic.twitter.com/ynrYmFsc03— Dr Raman Singh (@drramansingh) July 29, 2014 EID MUBARAK TO ALL 😬god bless u with peace ,happiness n togetherness lots of love to each one of u 😘 big hug😬😊😊 pic.twitter.com/f4ijazeGzJ— RAAI LAXMI (@iamlakshmirai) July 29, 2014 On the auspicious occasion of Eid, may you be blessed with peace, prosperity and happiness. Eid Mubarak everyone!— Vasundhara Raje (@VasundharaBJP) July 29, 2014 Eid Mubarak beautiful people. People give love effortlessly on Eid n also receive without hesitation. Let's learn to make everyday Eid.— Hrithik Roshan (@iHrithik) July 29, 2014 Eid Mubarak friends 🌙! May you be filled with Happiness, Peace and Blessings for all.🙏— Nayanthara✨ (@NayantharaU) July 29, 2014