యానిమల్ మూవీతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో ఫేమస్ అయింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీ తర్వాత త్రిప్తి డిమ్రికి ఆఫర్లు వెతక్కుంటూ వచ్చాయి. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలతో అలరించింది ముద్దుగుమ్మ.
అయితే ఇటీవల త్రిప్తి డిమ్రీ రొమాంటిక్ హిట్ సిరీస్ ఆషికి-3లో ఆఫర్ కూడా దక్కించుకుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. కానీ ఊహించని విధంగా ఆమె ఈ ప్రాజెక్ట్ తప్పుకుంది. దీంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వదంతులు మొదలయ్యాయి. ఆమెకున్న బోల్డ్ ఇమేజ్ వల్లే నిర్మాతలు త్రిప్తి ఎంపికపై నిర్ణయాన్ని మార్చుకున్నారని ఊహగానాలొచ్చాయి.
తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిప్తి డిమ్రీ తప్పుకోవడంపై ఈ మూవీ డైరెక్టర్ అనురాగ్ బసు స్పందించారు. ఆమె ఎందుకు తప్పుకుందో తననే అడగాలని అన్నారు. నా సినిమాలో చేయకపోయినా ఎప్పటికీ తను నా బెస్ట్ ఫ్రెండ్ అని.. నటిగా ఆమె అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం తేదీలే సమస్య అయి ఉండవచ్చని అన్నారు. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నామని.. త్రిప్తి ప్రస్తుతం దర్శకుడు విశాల్ భరద్వాజ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మా సినిమాకు టైటిల్ పేరేంటో నాకు తెలియదు.. మేము హీరోయిన్‌ను ఇంకా ఖరారు చేయలేదని.. వారం రోజుల్లో ప్రకటిస్తామని అనురాగ్ బసు పేర్కొన్నారు. కాగా.. అనురాగ్ బసు బాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్, బర్ఫీ, లైఫ్ ఇన్ ఎ మెట్రో చిత్రాలకు ఫేమస్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment