కిశోర్‌కుమార్ పాత్రలో! | ranbir kapoor in Kishore Kumar role | Sakshi
Sakshi News home page

కిశోర్‌కుమార్ పాత్రలో!

Published Wed, Sep 10 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

కిశోర్‌కుమార్ పాత్రలో!

కిశోర్‌కుమార్ పాత్రలో!

ఎలాంటి పాత్రనైనా సవాల్‌గా తీసుకుని చేయడం రణ్‌బీర్ కపూర్‌కి ఇష్టం. అందుకో ఉదాహరణ ‘బర్ఫీ’. ప్రస్తుతం అతను మరో సవాల్‌ని స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. ప్రసిద్ధ నటుడు, గాయకుడు, దర్శక, నిర్మాత కిశోర్‌కుమార్‌గా వెండితెరపై మెరవనున్నాడు రణ్‌బీర్. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌కి వెళ్లడానికి ఇంకొంచెం సమయం పడుతుంది.
 
 బసు ప్రస్తుతం కథ, స్క్రీన్‌ప్లే తయారీలో ఉన్నారు. ఇప్పటికే కిశోర్‌కుమార్ తనయుడు అమిత్‌కుమార్ దగ్గర అనుమతి తీసుకున్నారట. కథ గురించి అమిత్ దగ్గర చర్చలు జరిపారని సమాచారం. కిశోర్‌కుమార్‌కు సంబంధించిన పలు విశేషాలను అమిత్‌ని అడిగి తెలుసుకోవడంతో పాటు స్క్రీన్‌ప్లే తయారు చేయడానికి సహాయం చేయమని కోరారట. అందుకు అమిత్ సుముఖత వ్యక్తపరిచారని భోగట్టా. మరి.. కిశోర్‌కుమార్‌గా రణ్‌బీర్ ఎలా ఒదిగిపోతారో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement