రణబీర్‌.. కత్రినా... ఈసారైనా నమ్మొచ్చా! | Jagga Jossuas is reported to be released on July 14 | Sakshi
Sakshi News home page

రణబీర్‌.. కత్రినా... ఈసారైనా నమ్మొచ్చా!

Published Mon, May 29 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

రణబీర్‌.. కత్రినా... ఈసారైనా నమ్మొచ్చా!

రణబీర్‌.. కత్రినా... ఈసారైనా నమ్మొచ్చా!

పాపం...! దర్శకుడు అనురాగ్‌ బసు నెత్తి మీద బ్యాడ్‌లక్‌ బ్రేక్‌ డ్యాన్స్‌ బీభత్సంగా చేస్తోందేమో. మరి, బ్యాడ్‌ లక్‌ కాకపోతే ఏంటి? ఇలియానా హిందీలో హీరోయిన్‌గా పరిచయమైన హిట్‌ ఫిల్మ్‌ ‘బర్ఫీ’ తీసిన ఆయన, తర్వాత రణబీర్‌ కపూర్, కత్రినా కైఫ్‌ జంటగా ‘జగ్గా జాసూస్‌’ చేశారు. ఏ ముహూర్తాన మొదలైందో గానీ... పబ్లిక్‌ ముందుకు రావడానికి ఈ సినిమా పిచ్చి పిచ్చిగా పల్టీలు కొడుతోంది.

ముందు 2015లో విడుదల చేస్తామన్నారు. తర్వాత 2016లో వస్తున్నామన్నారు. ప్చ్‌... కుదరలేదు.ఈలోపు ఇల్లీ బేబీ ఆరు సినిమాలు చేశారు. అందులో రెండు రిలీజ్‌కి రెడీ అవుతోంటే... నాలుగు ఎప్పుడో థియేటర్లలోకి వచ్చేశాయి. కానీ, అనురాగ్‌ బసు చేసిన ఒకే ఒక్క సినిమా మాత్రం తెరకు రావడానికి నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ‘జగ్గా జాసూస్‌’ను కరెక్ట్‌గా కత్రినా కైఫ్‌ బర్త్‌డేకి రెండు రోజుల ముందు... జూలై 14న విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈసారైనా నమ్మొచ్చో! లేదో!  వాల్ట్‌ డిస్నీ సంస్థ డిస్ట్రిబ్యూషన్‌ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్‌లో గ్రాఫిక్స్‌ భలే ఉన్నాయని మంచి పేరొచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement