బర్ఫీ, లూడో, జగ్గా జసూస్ వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు అనురాగ్ బసు. 2004లో అతడు బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. అతడిని పరీక్షించిన వైద్యులు కేవలం రెండు వారాలు మాత్రమే బతుకుతాడని చెప్పారు. ఆ సమయంలో అతడి భార్య ఏడు నెలల గర్భిణి. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అనురాగ్.
ఆయన ఇంకా ఏం మాట్లాడాడంటే.. 'ఓసారి నాకు నోటి నిండా పొక్కులు వచ్చాయి. కానీ నాకు షూటింగ్ ఉండటంతో నేరుగా సెట్స్‌కే వెళ్లాను. కానీ ముకేశ్ భట్ మాత్రం ఈ రోజు షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసి వెళ్లిపో అన్నాడు. సాధారణంగా అతడు ఎప్పుడూ అలా చెప్పడు. ఆ తర్వాత హాస్పిటల్‌లో చెకప్ చేయించుకున్నాను. అప్పుడు మా పేరెంట్స్ ముఖం చూశాక ఏదో చెడు జరుగుతోందనిపించింది. క్యాన్సర్ అని బయటపడింది. మొదట్లో కొంచెం తలనొప్పితో పాటు నీరసంగా అనిపించేది. అయినా సరే ఇమ్రాన్ హష్మీతో కలిసి బీర్ తాగేందుకు హాస్పిటల్ గది నుంచి బయటకు తప్పించుకుని వచ్చేవాడిని.
అయితే రానురానూ నా పరిస్థితి దిగజారిపోయింది. మందులు పనిచేయలేదు. నా పేరెంట్స్ నన్ను ఆ స్థితిలో చూసి తట్టుకోలేక కలవడమే మానేశారు. అంతర్గతంగా రక్తస్రావం అధికం కావడంతో చాలామంది నాకు రక్తదానం చేశారు. ఓసారి మహేశ్ భట్ వచ్చి నా తలపై చేయి వేసి నిమిరాడు. అప్పుడతడి చేతులు వణికాయి. అనుపమ్ ఖేర్ కూడా నన్ను కలవడానికి వచ్చాడు. అప్పుడు నాకు పరిస్థితి చేయిదాటుతోందని అర్థమైంది. నా ముఖం వాచింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. ఊపిరి కూడా సరిగా ఆడకపోవడంతో విలవిల్లాడిపోయాను. ఎటువంటి చికిత్స కూడా పని చేయలేదు.
మొదట్లో నా పరిస్థితి గురించి నా భార్యకు చెప్పలేదు. కానీ టీవీ ఛానళ్ల ద్వారా తను విషయం తెలుసుకుంది. తర్వాత నా వెంటే ఉంది. టాటా మెమోరియల్ ఆస్పత్రికి షిఫ్ట్ చేసి నన్ను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. అప్పుడు నాకు ఒక బెడ్ కూడా దొరకలేదు. కానీ సునీల్ దత్ నాకోసం ఒక బెడ్ ఏర్పాటు చేశాడు. అప్పుడు నాకు బెడ్ మీదే వైద్యం అందించారు. కీమోథెరపీ చేశారు. ఇండస్ట్రీలో ఉన్నందుకే నాకు అంత త్వరగా బెడ్ దొరికి వైద్యం అందించగలిగారు. అదే వేరే వ్యక్తులైతే చాలా కష్టాలు పడేవారు. చాలామంది నన్ను కాపాడటం కోసం రక్తదానం చేస్తామని ముందుకు వచ్చారట. ఇప్పటికీ నా ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం ఎవరిదో నాకు తెలియదు అని చెప్పుకొచ్చాడు' అనురాగ్ బసు.
చదవండి: నటి సుకృతి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్
భర్తకు నయన్ రూ.20 కోట్లు విలువ చేసే గిఫ్ట్, మరి విఘ్నేశ్ ఏమిచ్చాడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment