
అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య
భార్య బర్త్‌డే పెట్టుకుని ఎవరైనా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉంటారా? ఉండరు కదా. స్మాల్ బ్రేక్ ఇచ్చయినా సరే భార్య ముందు వాలిపోతారు. అదే చేశారు అభిషేక్ బచ్చన్. భార్య ఐశ్వర్యారాయ్ బర్త్ డే (గురువారం) సెలబ్రేషన్స్ కోసం అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’ సీక్వెల్ షూట్‌కు బ్రేక్ ఇచ్చి గోవాలో వాలిపోయారు అభిషేక్. అక్కడ ఐశ్వర్యారాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
స్నేహితులకు అదిరిపోయే పార్టీ కూడా ఇచ్చారట అభిషేక్. ‘‘హ్యాపీ బర్త్ డే వైఫ్. ఐలవ్‌యూ’’ అని ఆయన ఐశ్వర్యకు విషెశ్ చెప్పారు. తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఐశ్వర్య. 1994లో మిస్ వరల్డ్‌గా నిలిచిన ఐశ్వర్యారాయ్ అప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారని నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. అన్నట్లు.. ఐశ్వర్య వయసు ఎంతో తెలుసా? 45లోకి అడుగుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment