padmavati movie
-
ఏకమవుతున్న రాజ్‌పుత్‌లు.. పూర్తిగా బ్యాన్!
జైపూర్ : పద్మావతి చిత్ర వివాదం సమసిపోయిందనుకుంటున్న సమయంలో మరోసారి శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన కన్నెర్ర చేసింది. సెన్సార్ బోర్డు ప్యానెల్ కమిటీ సూచనలు.. అందుకు మేకర్లు కూడా దాదాపు అంగీకరించారనే వార్తల నేపథ్యంలో ఆందోళనకారులు అప్రమత్తమయ్యారు. చిత్రాన్ని పూర్తిగా నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయంపై దేశంలోని రాజ్‌పుత్ తెగకు చెందిన వారంతా జనవరి 27న చిత్తోర్‌ఘడ్‌లో సమావేశం కాబోతున్నట్లు చెప్పారు. ఆ భేటీలో చిత్ర విడుదలను అడ్డుకునేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘రాణి పద్మావతి త్యాగం వెలకట్టలేనిది.. అలాంటి వ్యక్తిని అభాసుపాలు చేసేలా చిత్రీకరిస్తే చూస్తూ ఊరుకుంటామా?. సినిమా విషయంలో భన్సాలీకే స్పష్టత కొరవడినట్లుంది. ఓసారి చరిత్ర అంటాడు.. మరోసారి కల్పితం అంటాడు. సెన్సార్ బోర్డు నిర్ణయం కూడా సముచితంగా లేదు. ఆరు నూరైనా చిత్రాన్ని అడ్డుకుని తీరతాం. ఈ విషయంలో చట్టాలు కూడా మమల్ని అడ్డుకోలేవు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం’’ అని ఆయన హెచ్చరించారు. చరిత్రను భ్రష్టు పట్టిస్తుంటే నేతలు చూస్తూ ఊరుకోవటం సరికాదని.. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామని లోకేంద్ర స్పష్టం చేశారు. కాగా, డిసెంబర్ 30న సెన్సార్ బోర్డు పద్మావతి చిత్రం గురించి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి విదితమే. టైటిల్‌ను పద్మావత్‌గా మార్చటంతోపాటు పలు సూచనలు పాటిస్తే యూ బై ఏ సర్టిఫికెట్ తో చిత్ర విడుదలకు లైన్ క్లియర్ చేస్తామని సెన్సార్ బోర్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా అంగీకరించారని.. ఫిబ్రవరి 9న చిత్రం విడుదల కాబోతుందని ఓ వార్త కూడా చక్కర్లు కొడుతోంది. -
పద్మావతి... ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటి?
సాక్షి, సినిమా : బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు పద్మావతి చిత్ర వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఛారిటీ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటని అన్నారు. ఎందుకంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తనలాంటి వాళ్లు తప్పుకుండా చూస్తారు కాబట్టేనంట. ‘‘నిజంగా ఇది నవ్వుతో పాటు చిరాకు తెప్పించే పరిణామం. ఒక దర్శకుడుపై దాడి చేయడం మొదటి సారి చూస్తున్నా. ఒక సినిమాను చూడకముందే..వాళ్లు అలా ప్రవర్తించడం ఏమిటి. అసలు వాళ్లకి నిజమైన పద్మావతి కథ తెలుసా ? అనేది నా అనుమానం. నిజంగా ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అనుకోని విధంగా వారు ఇష్టం వచ్చినట్లు ఉహించుకుంటున్నారు. ఆ విధమైన ఆలోచనతో ఎలా వివాదాలను సృష్టిస్తున్నారో’’ అని అనురాగ్ వివరించారు. కాగా, బాలీవుడ్ లో ఈ ఇయర్ బిగెస్ట్ రిలీజ్ గా భావించిన పద్మావతి రాజ్‌పుత్ కర్ణిసేన అభ్యంతరాలు, సెన్సార్ సమస్యలతో ఇంకా రిలీజ్ నోచుకోని విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నా.. స్పష్టత లేకుండా పోయింది. -
పద్మావతి
దేవుడిని మనలో ఒకడిగా చేసుకుని ఆయనా మనలాంటి ఇబ్బందులు పడుతుంటే ఆనందించటం మనకి అలవాటు. దేవుడు మనకి సఖుడు, నెచ్చెలి, భర్త– ఇలా ఎన్నో విధాలుగా మనం సినిమాల్లో పురాణాలను మన స్థాయికి లాక్కొచ్చాం. ఇటీవల ‘పద్మావతి’ చిత్రం మీద చెలరేగిన వివాదం విచిత్రమైనది, విభిన్నమైనది, విలక్షణమైనది, వికారమైనది. పాపం, దర్శక నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీగారు 1540లో–అంటే దాదాపు 500 సంవత్సరాల కిందట సూఫీ కవి మాలిక్ మహ్మద్ జయసీ అనే ఆయన రాసిన ఒక పద్యాన్ని ఆధారం చేసుకుని క«థని అల్లుకున్నానని ఇల్లెక్కి కేకలు వేస్తున్నాడు. అయితే పాత్రలు చరిత్రకు సంబంధించినవి. కథనం– కల్పితం. మన సినీమాల్లో ఇలాంటి కల్పితాలు కోకొల్లలు. మాయాబజారు, గయోపాఖ్యానం, కృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం, నారద నారది– ఇలాగ. అయితే ‘పద్మావతి’ పాత్ర గౌరవాన్ని మంటగలిపితే రాజపుత్రుల గౌరవ మర్యాదలు మంట గలుస్తాయని కర్ణీసేన అనే ఒక ప్రైవేటు రాజపుత్ర సేన కత్తిగట్టింది. అల్లావుద్దిన్ ఖిల్జీ అనే ఢిల్లీ చక్రవర్తి – మహర్వాల్ రతన్ సింగ్ అనే రాజుగారి భార్య గొప్ప అందగత్తె అని విని ఆమెను చూడాలని పట్టుబట్టాడు. పరాయి పురు షుని ముందు నిలవడం రాజపుత్ర స్త్రీలకు నిషిద్ధం. కాని బలవంతుడయిన ఖిల్జీ కోరికకు ఎదురు చెప్పలేక రతన్ సింగ్ ఒక మార్గాంతరాన్ని ఆశ్రయించారు. అంతఃపు రంలో ఆమె ముఖాన్ని ఒక అద్దంలో ఖిల్జీ చూసేటట్టు చేశారని కథ. చిత్తూరు దుర్గంలో ఈ కథకు బాసటగా ఏర్పాటు చేసిన అద్దాలను 50 ఏళ్ల కిందట ఉద్యమకా రులు బద్దలుకొట్టారు. ఇప్పుడు–అంటే జనవరి 2017లో ‘పద్మావతి’ సెట్టుని కర్ణీ సేన ధ్వంసం చేసి, దర్శకుడు భన్సాలీని చావగొట్టింది. ఆ పాత్రలో నటించిన దీపిక పదుకునే ముక్కునే కోసేస్తా మని హెచ్చరిక చేసింది. ఒకాయన సంజయ్‌లీలా భన్సాలీ తలని తెస్తే 10 కోట్లు ఇస్తానని ప్రకటించారు. రాజ పుత్రుల పరువు మర్యాదలు మంటగలవడం ఇష్టంలేని ఒకాయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన శవాన్ని ఈ సేన నెత్తిన పెట్టుకుని ఊరేగించింది. తీరా సుప్రీంకోర్టుకి ఈ చిత్రాన్ని బహిష్కరించ మని అర్జీ పెట్టగా–చిత్రం మంచి చెడ్డల్ని సెన్సారు వారు నిర్ణయిస్తారని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ లోగా చిత్రాన్ని లండన్‌లో ప్రదర్శనకి లండన్ సెన్సారు వారికి దరఖాస్తు చెయ్యగా ‘మాదేశంలో య«థాతథంగా ప్రద ర్శించడానికి ఎట్టి అభ్యంతరము లేద’ని ఇంగ్లండ్ సెన్సారు వారు సర్టిఫికెట్ ఇచ్చారు. కొన్ని బీజేపీ ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలలో ఈ చిత్ర ప్రదర్శనను బహిష్కరించాయి. ఇంతకీ అసలు విషయం– ఈ కర్ణీ సేన కానీ, ఈ ప్రభుత్వ నాయకులు కానీ ఈ చిత్రాన్ని చూడలేదు. ప్రభుత్వాల భయమల్లా తమ రాష్ట్రంలో ఈ చిత్రం కారణంగా అల్లర్లు జరగకూడదని. సబబైన న్యాయానికి నిలబడవల్సిన ప్రభుత్వాలు చేయవలసిన పని ఇది కాదు కదా. ఇందులో చిత్ర నిర్మాణ స్వాతంత్య్రం, ‘బాజీరావు మస్తానీ’ వంటి ముందు చిత్రాలలో భన్సాలీ వేసిన కుప్పి గంతులు గురించి పత్రికలలో పుంఖానుపుంఖా లుగా కథనాలు వస్తున్నాయి. ఎల్కే అద్వానీ, రాజ్ జబ్బర్, అనురాగ్ ఠాకూర్లతో ఏర్పడిన 30 మంది సభ్యుల పార్లమెంటరీ బృందంతో ‘‘అయ్యా, నా ఉద్దేశం ఎవరి మనస్సునీ నొప్పించడం కాదు’’ అని భన్సాలీ గారు మొరపెట్టుకున్నారట. ఏమైనా కర్ణీ సేన ముక్కులు కోసి, పీకలు కోసే పనికి పూనుకుంది కానీ మనం అలాంటి పనులు చెయ్యం. మనం మన సినీమాల్లో బ్రాహ్మణులు వేదం వర సల్లో అడ్డమైన మాటలు మాట్లాడుతూ, పేడ తింటుంటే కడుపారా నవ్వుకున్నాం కానీ ఏమైనా అభ్యంతరం చెప్పగలిగామా? యముడూ, చిత్రగుప్తుడూ నడిరోడ్డు మీద ఐస్ క్రీం తింటూ మనల్ని కడుపారా నవ్విస్తూ ఉంటే చీమ కుట్టినట్టయినా బాధపడ్డామా? దేవుడిని మనలో ఒకడిగా చేసుకుని ఆయనా మనలాంటి ఇబ్బందులో, ఇక్కట్లో పడుతూంటే ఆనం దించడం మనకి అలవాటు. దేవుడు మనకి సఖుడు, సేవకుడు, నెచ్చెలి, ప్రియుడు, భర్త– ఎన్నో విధాలుగా మనం పురాణాలను మన స్థాయికి లాక్కొచ్చాం. ఏసు ప్రభువుని, అల్లానీ ఎప్పుడైనా చిత్రాల్లో, నాటకాల్లో చూశామా? చూపడం జరిగిందా? ఏమైనా చిత్రాన్ని చూడకుండా తిరగబడటం, ఎదురు తిరగడం ఈ దేశంలో కొత్త కాదు. ప్రకాష్ ఝా ‘అరక్షణ్’ (2011) వెనుకబడినవారి ఆత్మగౌరవాన్ని, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందనుకొని– చిత్రాన్ని చూడకుండానే ఎదురు తిరిగారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రా, పంజాబ్ ప్రభుత్వాలు బహిష్కరించాయి. తీరా వారిని చిత్రం సమర్థించిందని చిత్రాన్ని చూశాక అర్థమయింది. కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ (2013)లో ముస్లింలను ‘దౌర్జన్యకారులు’గా చిత్రంలో చూపుతున్నా రని భావించి తమిళనాడులో ముస్లింలు వ్యతిరేకించారు. ఎవరూ చిత్రాన్ని చూడలేదు. తీరా ముస్లిం మతస్థుడు దౌర్జన్యకారులను వ్యతిరేకించడం కథ అని చూశాక తెలిసింది. ఏతావాతా, చిత్రాన్ని చూడకుండా వీధిన పడే సంప్రదాయాన్ని కర్ణీ సేన నిలబెడుతున్నదని మనం గర్వపడవచ్చు. - గొల్లపూడి మారుతీరావు -
పద్మావతి వివాదంపై స్పందించిన మిస్ వరల్డ్
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి చిత్ర వివాదంపై మిస్ వరల్డ్-2017 మానుషి ఛిల్లర్ స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె చిత్ర యూనిట్‌కు తన మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అభ్యంతరాలు లేవనెత్తుతూ కొందరు చిత్ర విడుదలను అడ్డుకుంటున్నారు. దీపిక పదుకొనే కేవలం యాక్టరేనన్న విషయం నిరసనకారులు గుర్తుంచుకోవాలి. నజరానాలు ప్రకటించటం సరికాదు. ఆమెకు నా మద్దతు ప్రకటిస్తున్నా అని ఆమె చెప్పారు. కాగా, ప్రధానిని కలిసిన మరుసటి రోజే మానుషి తన అభిప్రాయం చెప్పటం గమనించదగ్గ విషయం. -
కల్పితం అన్నప్పుడు ఆ పేర్లే ఎందుకు వాడావ్?
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి చిక్కులు తప్పేలా కనిపించటం లేదు. పార్లమెంట్ పానెల్ ముందు సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి, దర్శకుడు భన్సాలీ హాజరై తమ వాదనలు వినిపించారు. చిత్రం కల్పితమని భన్సాలీ చెబుతున్నప్పటికీ.. చరిత్రకారులు చిత్రాన్ని చూసి క్లియరెన్స్ ఇస్తేనే తాము ముందుకు వెళ్తామని ప్రసూన్ జోషి స్పష్టం చేస్తున్నారు. దర్శకుడిగా సతీ ఆచారం చూపించటం.. సీబీఎఫ్సీ కంటే ముందే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకే సినిమా చూపించటం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని పానెల్ సభ్యులు అడిగిన ప్రశ్నకు భన్సాలీ తటపటాయించినట్లు తెలుస్తోంది. ఇక పానెల్ ఎదుట భన్సాలీ, సెన్సార్ సభ్యులు, కమిటీ సభ్యుల మధ్య సంభాషణలు ఇలా ఉన్నాయి... చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని నిరూపించేందుకు తన దగ్గర వేరేదారి లేదని భన్సాలీ సమాధానం ఇవ్వగా.. అలాంటప్పుడు తమ ముందు ఎందుకు హాజరయ్యారంటూ పానెల్ సభ్యులు ఆయనకు చురకలంటిచారు. చిత్ర విడుదలలో జాప్యం మూలంగా తాను నష్టపోతున్నానని భన్సాలీ వివరణ ఇస్తుండగా.. ఎమోషనల్ అంశంతో వ్యాపారం చేయాలని చూస్తున్నారా? అంటూ సభ్యులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇంతలో జోక్యం చేసుకున్న సీబీఎఫ్సీ సభ్యులు... సినిమా పూర్తి కల్పితం అని చెబుతున్నప్పుడు.. అసలు పేర్లను ఉపయోగించాల్సిన అవసరం ఏంటని భన్సాలీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కూడా ఆ విషయాన్ని తెలియజేయలేదని వాదించారు. అయితే అలాంటప్పుడు ట్రైలర్‌కు అనుమతి ఎలా ఇచ్చారని పానెల్ కమిటీ సభ్యుడు, సీనియర్‌నేత ఎల్ కే అద్వానీ సెన్సార్బోర్డును తిరిగి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చిత్ర విషయంలో తమకన్నా.. సెన్సార్‌బోర్డు కలగజేసుకోవటమే ఉత్తమమన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం. చివరకు రెండు గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో కమిటీ నివేదికను త్వరలో కేంద్రానికి అందజేస్తామని ప్రకటించింది. ‘‘సినిమా అనేది వినోదాలకు అందించేందిగా ఉండాలే తప్ప.. వివాదాలకు కేంద్ర బిందువు కాకూడదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేది అసలు సినిమా ఎలా అవుతుంది?. ఇది చాలా సున్నితమైన అంశం అని ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
బీజేపీకి ఆయన గుడ్‌బై చెప్పేశారు!
చండీగఢ్: ‘పద్మావతి’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హరియాణ బీజేపీ నేత సూరజ్‌పాల్ అమూ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ హరియాణా మీడియా చీఫ్ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ‘పద్మావతి’ సినిమా వివాదం నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ తలలు నరికితే రూ. పదికోట్లు ఇస్తానని సూరజ్‌పాల్ వివాదాస్పద ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం కన్నెర్ర జేసింది. షోకాజ్ నోటీసు జారీచేసి వివరణ కోరింది. బీజేపీ అధినాయకత్వం, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తీరుతో అసంతృప్తితోనే ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పినట్టు తెలుస్తోంది. సీఎం ఖట్టర్లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని, కార్యకర్తలకు ఖట్టర్ కనీసం గౌరవం ఇవ్వడం లేదని సూరజ్‌పాల్ విమర్శించారు. -
పద్మావతి: స్పందించిన ఉపరాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు పద్మావతి చిత్ర వివాదం కొనసాగుతున్న వేళ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. న్యూఢిల్లీలో శనివారం ఓ సాహితి వేడుకలకు హాజరైన ఆయన.. చిత్రం పేరును ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం ఆయన ప్రసంగం ఇలా ఉంది... నుషులను చంపుతామని.. వారిపై రివార్డులను ప్రకటించటం ప్రజాస్వామిక వ్యవస్థ అంగీకరించబోదు. సినిమాలు-కళలు అనేవి దేశానికి అవసరమన్న ఆయన.. వాటి విషయంలో బెదిరింపులను చట్టాలు ఊపేక్షించబోవు.‘‘మనోభావాలు దెబ్బతీశారంటూ కొందరు నిరసనలు ప్రదర్శిస్తున్నారు. వాళ్ల దగ్గర అంత డబ్బు ఉందో లేదో తెలీదుగానీ.. కోటికి తక్కువ కాకుండా రివార్డు ప్రకటిస్తున్నారు. కోటి రూపాయలు అంటే అంత తేలికగా వాళ్లు భావిస్తున్నారా? అని వెంకయ్యనాయుడు చురకలంటించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందని.. కానీ, అది హింసాత్మక ధోరణితో ఉండకూడదని ఆయన సూచించారు. ఈ క్రమంలో ఆయన హారామ్ హవా, కిస్సా కుర్సీ కా, ఆనంది చిత్రాల పేర్లను ఆయన ప్రస్తావించారు. రాణి పద్మావతి గాథ -
కోట మరణం... కొత్త కోణం!
జైపూర్ : నహర్‌గఢ్ ప్రహారీ గోడకు వేలాడుతున్న వ్యక్తి దేహం నిన్న కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే చేతన్ కుమార్ సైనీ(40) మరణానికి సంబంధించి కీలక ఆధారాలు ఇప్పుడు పోలీసుల కంట పడ్డాయి. ఇది మతపరమైన హత్య అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాం పక్కనే తొలుత అక్కడి కోట గోడ రాత ఆధారంగా అది పద్మావతి చిత్ర యూనిట్ బెదిరింపు రాతలు అని అంతా అనుకున్నారు. కానీ, దర్యాప్తులో అక్కడ ఉన్న మరికొన్ని రాళ్లను నిశితంగా పరిశీలించిన పోలీసులు అవి చిత్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారికే హెచ్చరికలు అని తేల్చారు. ‘‘చేతన్ చంపబడ్డాడు. మేం అల్లా మనుషులం. నిరసనలు చేసే వారి దిష్టిబొమ్మలను కాదు.. వారినే వేలాడదీస్తాం’’.. ఇలాంటి రాతలు ఉన్న రాళ్లు పోలీసుల కంటపడ్డాయి. దీంతో ఇప్పుడు దీని వెనుక మత ఘర్షణలు ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రాళ్లపై కఫీర్, మరికొన్ని రాతల్లో అల్లా పదం కనిపించటంతో అవి మరింత బలపడుతున్నాయి. తమను బెదిరించడానికే ఆ రాతలు రాశారని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన ఆరోపించిన విషయం తెలిసిందే. పద్మావతి సినిమాతో సైనీ మరణానికి ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరుడు చెప్పగా.. ఇది మతపరమైన హత్య అని ఇప్పుడే ఓ నిర్ధారణకు రావటం అంత మంచిది కాదని యోచిస్తున్న పోలీసులు మిస్టరీని ఛేదించే పనిలో తలమునకలై ఉన్నారు. -
పద్మావతి వివాదం.. కోటకు ఊరేసుకుని సూసైడ్?
జైపూర్ : పద్మావతి చిత్రం వివాదం మరో మలుపు తిరిగింది. చిత్ర విడుదలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నహర్‌గఢ్ కోటకు వేలాడుతున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం ఉదయం స్వాధీనపరుచుకున్నారు. అయితే కోట గోడలపై, దగ్గరల్లోని రాళ్ల మీద చిత్ర బృందాన్ని హెచ్చరించిన రాతలు కనిపించాయి. దీంతో ఈ మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టు మార్టం నివేదిక తర్వాతే స్పందిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే రాజ్‌పుత్ కర్ణి సేన నుంచి చిత్ర విడుదలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న సమయంలో ఈ ఘటన మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ చిత్ర విడుదలను నిషేధించాయి. చర్చలకు గ్రీన్ సిగ్నల్? మరోవైపు 'పద్మావతి' చిత్ర వివాదం నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రముఖ సినీ నటి, టాక్ షో వ్యాఖ్యాత సిమి గేరేవాల్ నిర్వహించిన మధ్యవర్తిత్వం సత్ఫలితం ఇచ్చినట్లు తెలుస్తోంది. జైపూర్‌లో మహారాణి పద్మినీ దేవితో సిమి సమావేశమై అభ్యంతరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. సినిమా పట్ల వ్యతిరేకత లేదని, సినిమాలోని 'ఘామర్' పాటలో 'పద్మావతి' పాత్రధారి డాన్స్ చేయడం పట్ల మాత్రమే విముఖంగా చూపుతున్నట్లు మహారాణి చెప్పినట్లు సమాచారం. దీనిపై దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో చర్చించేందుకు తాను ఏర్పాట్లు చేస్తానని సిమి ప్రతిపాదించగా, రాణి పద్మినీ దేవి అంగీకరించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. -
రిలీజ్‌కు అనుమతి.. కానీ, విడుదల చెయ్యరంట!
లండన్ : పద్మావతి చిత్ర విషయంలో ఆసక్తికరమైన అప్ డేట్. బ్రిటన్‌లో ఈ చిత్ర విడుదలకు అనుమతి లభించింది. డిసెంబర్ 1న ఈ చిత్రం యూకేలో విడుదల అవుతున్నట్లు బ్రిటీష్ బోర్డు ఆఫ్ ఫిల్మ్స్ క్లాసిఫికేషన్(బీబీఎఫ్‌సీ) ప్రకటించింది. తాజాగా నిన్న(నవంబర్ 22న) సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సింగిల్ కట్ లేకుండా విడుదల కాబోతుండటం విశేషం. ఈ మేరకు బీబీఎఫ్‌సీ తన అఫీషియల్ వెబ్ సైట్ లో పేర్కొంది. చిత్ర నిడివి 164 నిమిషాలుగా పేర్కొంటూ 12A సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. ఓవైపు భారత్‌లో రాజ్‌పుత్ కర్ణి సేన నిరసనలు, సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయటంలో తాత్సారం నడుమ పద్మావతి చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. 190 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించగా.. దీపిక పదుకొనే, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. విడుదల చెయ్యట్లేదు.. నిర్మాతలు అయితే చిత్రాన్ని యూకేలో విడుదల చేసేందుకు మేకర్లు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. భారత్‌లో కూడా విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాకే ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘పద్మావతి’కి షాకిచ్చిన గుజరాత్
అహ్మదాబాద్: ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాణి పద్మావతి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రదర్శనను ఇప్పటికే మధ్యప్రదేశ్ నిషేధించగా.. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో సినిమా విడుదలను నిషేధిస్తున్నట్టు గుజరాత్ సీఎం విజయ్ రుపానీ తెలిపారు. ’గుజరాత్లో పద్మావతి సినిమా విడుదల కావడానికి ప్రభుత్వం అనుమతించబోదు. ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఈ సినిమా వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్త అవకాశముంది. ఈ సినిమా వల్ల ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. పలు వర్గాలు ఈ సినిమా విడుదలను వ్యతిరేకిస్తున్నాయి’ అని రూపానీ విలేకరులతో అన్నారు. పద్మావతి’ సినిమా వివాదం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతున్న రాజ్‌పుత్‌లు.. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్‌లను చంపేస్తామని, వారి తలలు నరికితే.. నజరానాలు ఇస్తామని బెదిరింపులకు దిగుతున్న సంగతి తెలిసిందే. -
ప్రముఖ సినీ రచయితపై కేసు
జైపూర్: ‘పద్మావతి’ ప్రకంపనలు ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు. ఈ సినిమాకు మద్దతు ప్రకటించిన సీనియర్ రచయిత జావేద్ అక్తర్‌పై జైపూర్‌లో కేసు నమోదయింది. రాజ్‌పూత్‌లను అవమానించారనే ఆరోపణలతో సింధి క్యాంప్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత 200 ఏళ్ల చరిత్రలో రాజ్‌పూత్‌లు ఎప్పుడూ బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదని వ్యాఖ్యానించడంతో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మావతి సినిమా వివాదంపై జావేద్ అక్తర్ స్పందిస్తూ... ‘రాజ్‌పూత్‌లు, రాజ్‌వాడాలు ఎప్పుడు కూడా బ్రిటీష్ పాలకులపై పోరాటం చేయలేదు. కానీ ఇప్పుడు ఒక సినిమా, సినిమా రూపకర్తపై వీధి పోరాటాలు చేస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ రాణాలు, రాజులు, మహరాజులు 200 ఏళ్లు బ్రిటీషు కోర్టుల్లో పనిచేశారు. రాజ్‌పూత్‌ల గౌరవం, ప్రతిష్ట అప్పుడేమయింద’ని ప్రశ్నించారు. పద్మావతి సినిమాను నిషేధించాలని ఆందోళనలు చేస్తున్నవారిపై కూడా ఆయన విమర్శలు చేశారు. బ్రిటీషర్లను రాజ్‌పూత్‌లు ఎదిరించలేదన్న జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై ఆ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయనను రాజస్థాన్‌లో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. -
పద్మావతి ఎఫెక్ట్ : పదుకొనే ఇంటికి భారీ బందోబస్తు
సాక్షి, బెంగళూరు : పద్మావతి సినిమాలో నటించిన నటీనటులు ప్రాణహాని బెదిరింపులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయా కుటుంబాలకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్ర పోషించిన దీపిక పదుకొనేకు పలు సంఘాల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో బెంగుళూరులోని దీపికా పదుకొణె కుటుంబానికి కర్ణాటక పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. పద్మావతి సినిమాలో నటించినందుకు దీపికా తల నరికి తెచ్చిన వారికి రూ.10 కోట్లు ఇస్తానంటూ హర్యాణాకు చెందిన బీజేపీ నేత సూరజ్పాల్తో పాటు పలు సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు జేసీ నగర సమీపంలోని నందిదుర్గలో నివసిస్తున్న దీపికా కుటుంబానికి భద్రత అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హోం మంత్రి రామలింగారెడ్డి ఆదేశాల మేరకు, దీపిక తల్లిదండ్రులు, సోదరి నివసిస్తున్న ఉడ్స్ వేల్ అపార్ట్మెంట్ వద్ద పోలీసుల భద్రత ఏర్పాటైంది. ఒక ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను మోహరించారు. బెంగళూరులో మల్లేశ్వరంలోని 18వ క్రాస్‌లో ఉంటున్న దీపికా పదుకొణె నాయనమ్మ ఇంటి వద్ద కూడా పోలీసులను మొహరించారు. దేశంలో ప్రస్తుతం విదాస్పదంగా మారిన సినిమా పద్మావతి. ఇప్పటికే ఈ సినిమాను పలు ఉత్తరాది రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించగా, మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే బాటలో నడవనున్నాయి. -
‘పద్మావతి’ సినిమాకు కేంద్రమంత్రి సింపుల్ పరిష్కారం!
సాక్షి, న్యూఢిల్లీ: ‘పద్మావతి’ సినిమా వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ వర్గీయులు తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ స్పందించారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వాళ్లు మొదట సినిమాను చూడాలని, సినిమాలో ఏదైనా అభ్యంతరకరమైనది ఉంటే దానిని తొలగించాలని డిమాండ్ చేయాలని సూచించారు. ’కొన్ని చారిత్రక వాస్తవాలు మన ప్రస్తుత ఆలోచనలకు అనుగుణంగా ఉండకపోవచ్చు అన్నది నా అభిప్రాయం. ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లు మొదట సినిమాను చూడాలి. సినిమాలో ఏమైనా అభ్యంతరకరమైనవి ఉంటే వాటిని తొలగించాలని డిమాండ్ చేయాలి’ అని ఆయన పీటీఐతో పేర్కొన్నారు. మరో కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. సినిమాలు సర్టిఫై చేయాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ)దని, మొదట సెన్సార్ బోర్డు తన పనిని పూర్తిచేయనివ్వాలని సూచించారు. కాగా, ఇప్పటికే పద్మావతి సినిమాను నిషేధించిన మధ్యప్రదేశ్ సర్కారు.. తాజాగా రాణి పద్మావతి స్మారక కట్టడాన్ని నిర్మించాలని నిర్ణయించింది. -
‘సినిమాను అడ్డుకుని అన్ని థియేటర్లు తగలబెట్టాలి’
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాపై వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇదివరకే ఈ సినిమాను పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీని తీసిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకొనేల తలలు తెచ్చి ఇచ్చే వారికి రూ. 10 కోట్లు వీకెండ్ ఆఫర్ అంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత సూరజ్ పాల్ అము.. మరోసారి ఏకంగా ఫిల్మ్ ఇండస్ట్రీని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని యువత, సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు తలుచుకుంటే ప్రతి సినిమాను అడ్డుకుని థియేటర్లను తగలబెట్టగలరు. ప్రతి సినిమా అడ్డుకోవడానికి వారిలో ఆ సామర్థ్యం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా సినిమాలను సమూలంగా నాశనం చేయాలంటూ’ బీజేపీ నేత సూరజ్ పాల్ చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి సినిమాలను మరొకరు తీయవద్దని, లేదంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళన నిర్వహిస్తుండటంతో డిసెంబర్ 1న రావాల్సి ఉన్న ఈ సినిమా విడుదల తాత్కాలికంగా నిలిచిపోయింది. పద్మావతి విడుదలకు ముందే రాజ్‌పుత్ వర్గీయులతో పాటు కర్ణిసేన బృందానికి సినిమా ప్రివ్యూ చూపించి, వివాదాలకు కేంద్ర బిందువైన సీన్లను తొలగించాలని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి పలువురు కేంద్ర మంత్రులతో పాటు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు. కాగా, మూవీని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ’పద్మావతి’ విడుదలపై తాము జోక్యం చేసుకోలేమని, అది పూర్తిగా సెన్సార్ బోర్డు పరిధిలోని అంశమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
భారతీయుడిని అయినందుకు చిరాగ్గా ఉంది!
ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ’పద్మావతి’ సినిమా వివాదం దేశాన్ని కుదుపుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలను పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిషేధించగా.. తాజాగా మహారాష్ట్ర సర్కారు కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇక ’పద్మావతి’ సినిమా వివాదం నేపథ్యంలో భన్సాలీ, దీపిక తలలు నరికితే.. నజరానా ఇస్తామంటూ ప్రకటనలు వెలువడటంపై ప్రముఖ నటుడు రోహిత్ రాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న అసహనం, అనాగరిక సంస్కృతికి ’తలల నరికివేత’ ప్రకటనలు అద్దం పడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల నడుమ ఒక భారతీయుడిగా భారత్‌లో నివసిస్తున్నందుకు తనకు బాధగా, చిరాగ్గా.. ఆవేదనగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ సినిమా వివాదంపై మరోసారి స్పందిస్తూ.. భన్సాలీ స్వయంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్నారని అన్నారు. భన్సాలీ, దీపిక చంపుతామని బెదిరించిన వారిలాగే భన్సాలీ కూడా నేరస్తుడేనని, ఆయన ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. భన్సాలీగానీ, ఇంకా వేరేవారు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించబోమని పేర్కొన్నారు. -
పద్మావతిపై ఎందుకీ కన్నెర్ర?
ఇంతటి ఆగ్రహానికి గురికాదగ్గది ఏదీ ఆ సినిమాలో లేదని దాన్ని చూసిన మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. సినిమా చూడకుండానే, సెన్సార్ కాకముందే ప్రదర్శిస్తున్న ఈ అర్థరహిత అసహనం ఎటు దారి తీస్తుంది? రెండు దశాబ్దాల క్రితం, స్వలింగ సంపర్కసంబంధం గురించి తీసిన ఫైర్ సినిమా చిక్కుల్లో పడింది. అది, మన దేశంలో తీసిన అలాంటి మొట్ట మొదటి సినిమా. మితవాదవర్గానికి చెందిన వారు ఆ సినిమాను ప్రదర్శిం చడానికి వీల్లేదంటూ నిరస నకు దిగారు. ఆ సినిమా నిర్మాతపైన, నటీనటులపైన కోపంతో ఆ యూనిట్ తదుపరి చిత్రం వాటర్ సెట్లను ధ్వంసం చేశారు. అది ‘భారత సంస్కృతికి వ్యతిరేకమై న’దంటూ రాజకీయవేత్తలు ఆ గూండాయిజాన్ని వెనకే సుకొచ్చారు. ఇప్పుడు, సెన్సార్ సర్టిఫికెటైనా లభించని పద్మావతి సినిమాపై కూడా అలాంటి ఆగ్రహాన్నే తిరిగి ప్రదర్శిస్తున్నారు. సినిమాలోని పద్మావతి ప్రచారంలో ఉన్న జానపదగాథల్లోని వ్యక్తే తప్ప, విశ్వసనీయమైన చరిత్రలోని వ్యక్తికాదనీ, ఒకరిని మరొకరుగా పొరబడ రాదనీ గుర్తించడానికి సైతం నిరాకరించేటంత తీవ్ర ఉద్రేకంతో వ్యక్తమౌతున్న ఈ సామూహిక అనుచిత ప్రవర్తనకు నేడు మనం అలవాటుపడిపోయాం. ఈ దురభిమానులు సినిమాను చూడనైనా చూడ కుండానే తమ తప్పుడు అభిప్రాయాలను వ్యక్తం చేస్తు న్నారు. బహిరంగంగానూ, టీవీల్లోనూ ఆ నటీనటుల ముక్కులను కోస్తామని బెదిరిస్తున్నారు, నిర్మాత, ప్రధాన నటి తలలకు రూ. 10 కోట్ల బహుమతి ప్రకటించారు. రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం తెలివి తక్కువగా అవసరమైన కత్తిరింపులు చేయకుండా ఆ సినిమా విడుదలను అనుమతించరాదని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను కోరింది. కథను చెప్పడంలో సిని మాకు ఉండే కళాత్మకమైన స్వేచ్ఛకూ, వ్యక్తిగత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకూ కూడా వ్యతిరేకమైన అసహనం నేడు సుస్పష్టంగా కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై తీసిన ఎన్ ఇన్సిగ్నిఫికేంట్ మ్యాన్ అనే డాక్యుమెంట రీకి సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దానిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, కోర్టు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఉన్న హక్కును ఎత్తి పట్టింది. అయినా అది పద్మావతి వ్యతిరేక బృందాల ఉద్రేకాన్ని చల్లార్చలేకపోయింది. ఈ అసహనం 15 రోజుల్లోనే పెను దుమారంగా మారింది. గోవాలో జరగనున్న భారత అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన న్యూడ్ (మరాఠీ), ఎస్. దుర్గ (మలయాళం) సినిమాల ప్రదర్శనను సమా చార, ప్రసార మంత్రిత్వశాఖ నిలిపివేస్తున్నట్టు ప్రక టించింది. ఎందుకో కనీసం ఒక్క వాక్యం వివరణనైనా ఇవ్వలేదు. ఈ రెండూ సెన్సార్ సర్టిఫికేట్లతో విడుదల య్యాయి కూడా. చూడబోతే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు సెన్సార్ సర్టిఫికెట్లన్నా, తామే ఏర్పాటు చేసిన జ్యూరీ ఎంపిక అన్నా లెక్క లేన ట్టుంది. దీనికి నిరసనగా జ్యూరీ సభ్యులు వరుసగా చేస్తున్న రాజీనామాల పరంపరగానీ, తామే ఏర్పాటు చేసిన సంస్థలు, ప్యానెళ్లను విలువలేకుండా చేస్తూ ఇష్టా నుసారం చేసిన ఈ నిర్ణయాల పట్ల నిరసనగానీ ఆ మంత్రిత్వశాఖ అంతరాత్మను ఏమాత్రం ఇబ్బంది పెట్టినట్టు లేదనుకుంటా. తగు కత్తిరింపులు లేనిదే పద్మావతి విడుదలకు అనుమతిని ఇవ్వరాదంటూ స్మృతి ఇరానీకి వసుంధరా రాజే రాసిన లేఖలో ఇది స్పష్టంగానే కని పించింది. ఎలాంటి వివరణా లేకుండానే న్యూడ్, ఎస్. దుర్గ సినిమాలను తొలగించడం కచ్చితంగా నిరంకుశ వైఖరే. అవి రెండూ అంతర్జాతీయంగా ప్రశంసలను, గుర్తింపును పొందినవి. అవి అశ్లీలతను లేదా మహిళల పట్ల అసభ్యతను చూపినవి కావు. ఎస్. దుర్గ చిత్ర నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పద్మావతి సినిమాను తీసిన వారుగాక మరెవరూ ఇంతవరకూ ఆ సినిమాను చూసిందే లేదు. కొందరు ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకు దాన్ని ప్రద ర్శించి చూపారు. అలా చూసినవారంతా ఆ చిత్రంపై ఇలా మాటల దాడులను, నిరసన ప్రదర్శలను సాగిం చాల్సినది, తలలకు, ముక్కులకు వెలలు కట్టాల్సినది సినిమాలో ఏమీ లేదని అంటున్నారు. ఆందోళనకారు లకు విచక్షణారహితంగా సమయాన్ని, స్థలాన్ని కేటా యిస్తూ మీడియా అగ్నికి ఆజ్యం పోస్తోంది. అందు వల్లనే కావచ్చు నిర్మాతలు మీడియాకు సినిమాలో ఏమి ఉందో తెలియాలని అనుకున్నట్టుంది. సెన్సార్ బోర్డు ఈ అంశాన్ని అనుమానాస్పద దృష్టితో చూస్తోంది. అది అన్ని వేపులనుంచీ చుట్టి ముట్టివేతకు గురై ఉంది, రాజస్తాన్, యూపీ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా సినిమా చూడని నిరసన కారుల పక్షం వహించాయి, కారణం ఏదైనా కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోంది, నిర్మాతలు ఏది ఏమైనా త్వరగా విడుదల చేయాలని చూస్తున్నారు. ముందు ఏమి జరగనుందో ఎవరికీ తెలియదు. సినిమాను ‘‘అనుమతించడానికి’’ ముందు బ్లాక్ మెయిల్ చేసి, నిరసన తర్వాత అనుమతించటం జరు గుతుందా? అది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? కర్ణీ సేన ఒక సినిమాకు ప్రచారం లభించేట్టు చేయడం కోసం సంకేతాత్మక నిరసన తెలిపి, నెలరోజులపాటూ రక్షణను కల్పించడానికి అంగీకరించడాన్ని ఇండియా టుడే ఒక స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టింది. దాన్ని మీడియా విస్మరించింది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
‘పద్మావతి’ వాయిదా వెనక సీక్రెట్
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పదమైన సంజయ్ లీలా బన్సాలీ బాలీవుడ్ చిత్రం ‘పద్మావతి’ విడుదలను కొన్ని హిందూ శక్తుల బెదిరింపులకు భయపడి నిరవధికంగా వాయిదా వేయడం పట్ల సోషల్ మీడియాలో ముఖ్యంగా, ట్విట్టర్లో మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త మంది దీన్ని హిందూ శక్తుల విజయంగా వ్యాఖ్యానిస్తుండగా, ఎక్కువ మంది ఇది ప్రజాస్వామ్యానికి ఓటమని, ముఖ్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమని వ్యాఖ్యానిస్తున్నారు. భారత యావత్ చలనచిత్ర పరిశ్రమ సంఘటితంగా నిలబడి ఉంటే నేడు ‘పద్మావతి’కి ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇందుకు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వారంతా సిగ్గుతో తలదించుకోవాల్సిందేనని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. గోవాలో ప్రారంభమవుతున్న అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించే భారతీయ సినిమాల జాబితా నుంచి ఎస్. దుర్గా, న్యూడ్ చిత్రాలను కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు తొలగించడం పట్ల వివాదం రాజకున్న తరుణంలోనే పద్మావతి వివాదం తారాస్థాయికి చేరుకుంది. పద్మావతి సినిమా షూటింగ్ జరుగుతుండగానే అంటే, గత జనవరి నెలలో సినిమాకు వ్యతిరేకంగా కొన్ని హిందూ శక్తులు ఆందోళనలు నిర్వహించాయి. సినిమా షూటింగ్ సెట్లను దగ్ధం చేయడం దగ్గరి నుంచి పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీని తల నరికిన వాడికి పది కోట్లు హిస్తామని, పద్మావతిగా సినిమాలో నటించిన దీపికా పదుకొణె ముక్కు కోసిన వ్యక్తికి కోటి రూపాయలు, ఆమెను నిలువున తగులబెట్టిన వ్యక్తికి మరో కోటి రూపాయలు ఇస్తామని బెదిరిస్తూ వచ్చాయి. ఓ బీజేపీ ఎమ్మెల్యేనే ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. ఇలాంటి బెదిరింపులను సినీ పరిశ్రమ సంఘటితంగా ఎదుర్కోక పోవడం వల్లనే నేడు పద్మావతి సినిమా విడుదలను నిలిపివేయాల్సి వచ్చిందని, ఇది నిజంగా గూండాల విజయమని ఎక్కువ మంది ట్వీట్లు చేస్తున్నారు. ఇంతటి బెదిరింపులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం ఏమిటని, ముఖ్యంగా సినిమా పరిశ్రమ పట్ల ఆసక్తి చూపించే స్మతి ఇరానీ లాంటి వారు కూడా బాలీవుడ్ నటి పదుకొణేను అంతగా బెదిరిస్తున్నా ఎందుకు మాట్లాడడం లేదని ట్వీటర్లు ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓ రాజకీయ పార్టీ లబ్ధి పొందడం కోసమే కొన్ని హిందూ శక్తులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని, ఎన్నికల అనంతరం ఆందోళన సద్దుమణుగుతోందని ఆ పార్టీ ప్రభుత్వమే భరోసా ఇవ్వడంతోనే పద్మావతి విడుదలను వాయిదా వేసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ జిందా హై’ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదల కావాల్సి ఉందని, ఆ సమయంలో పద్మావతి విడుదలయితే తమకు ఇబ్బంది అవుతుందని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మావతి స్థానంలో అంటే, డిసెంబర్ ఒకటవ తేదీన ‘టైగర్ జిందా హై’ చిత్రాన్ని విడుదలకు చర్యలు తీసుకోవాలని వారు ఆ సినిమా నిర్మాతలను కోరుతున్నట్లు తెల్సింది. Simply unprecedented.. the inability of our industry to stand together as one has got us here. A film, an artistic work used to the hilt for political gains, for free publicity. All industry ‘leaders’ should hang their heads in shame! #PadmavatiPostPoned — Amul Vikas Mohan (@amul_mohan) 19 November 2017 The real question is: what is the Padmavati row distracting us from? — Tanmay Bhat (@thetanmay) 19 November 2017 Big news from Bollywood with #Padmavati release being postponed; not happening on Dec1. Unfortunate to see all the political issues surrounding the film! The makers have been left with no other go! — Kaushik LM (@LMKMovieManiac) 19 November 2017 -
పద్మావతి ఎఫెక్ట్.. సల్మాన్‌కీ కష్టాలు తప్పవా?
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి సెన్సార్ సర్టిఫికేషన్ వివాదం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సెన్సార్ నిబంధనల కారణంగా చిత్రం ఖచ్ఛితంగా పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు పాత నిబంధనలను తిరగదోడిన సీబీఎఫ్సీపై బాలీవుడ్ నిర్మాతలు మండిపడుతున్నారు. చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ కావాలంటే మేకర్లు 68 రోజుల ముందుగానే సెన్సార్ బోర్డు వద్ద దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఉంది. అయితే కొన్నేళ్లుగా ఆ రూల్‌ను బోర్డు పక్కనపడేసింది. ఇప్పుడు పద్మావతి చిత్రం వివాదాల్లో నానుతున్న నేపథ్యంలో అనూహ్యంగా మళ్లీ ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీనికితోడు మేకర్లు అందించిన డాక్యుమెంట్లు అసంపూర్తిగా ఉన్నాయంటూ సర్టిఫికెట్ జారీచేయకుండా వెనక్కి తిప్పి పంపించి వేసింది. ఇప్పుడు ఆ ప్రభావం సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం టైగర్ జిందా హై చిత్ర విడుదలపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సల్మాన్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కొద్దికాలంగా బాలీవుడ్ సినిమాలు కేవలం 22 రోజుల ముందుగానే సర్టిఫికెట్ కోసం సెన్సార్‌కు వెళ్తున్నాయి. కానీ, పాత నిబంధన మళ్లీ తెరపైకి రావటంతో ఇంత తక్కువ టైంలో టైగర్ జిందా హై చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రావటం అనుమానంగా కనిపిస్తోంది. దీంతో సెన్సార్ తీరుపై బాలీవుడ్ నిర్మాతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో 68 రోజుల పద్ధతిని పాటించి విడుదలైన చిత్రాల జాబితాను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో సర్టిఫికెట్ జారీ విషయంలో పెనువివాదాలే చోటు చేసుకున్నాయి. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించిన మెసేంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి ఒక్క రోజు ముందుగానే సర్టిఫికెట్ ఇవ్వటం.. అది కాస్త తీవ్ర విమర్శలకు దారితీయటంతో అప్పుడు చైర్‌పర్సన్‌గా ఉన్న లీలా శామ్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. -
పద్మావతిలో దావూద్ డబ్బులు!
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి చిత్రంపై మరోసారి రాజ్‌పుత్ కర్ణి సేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ దావుద్ ఇబ్రహీం భాగస్వామిగా ఉన్నాడంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో గత రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన దీపికపై కూడా మండిపడ్డారు. ఈ చిత్రంలో ముంబై మారణహోమం ప్రధాన సూత్రధారి దావూద్ హస్తం కూడా ఉంది. అతను దుబాయ్ నుంచి డబ్బులు పంపిస్తే.. వాటితో భన్సాలీ పద్మావతిని తీశాడు. కరాచీ నుంచి నాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి అని కల్వి తెలిపారు. ఇక చిత్రం విడుదలైన తీరుతుందంటూ దీపిక పడుకొనే తనకు సవాల్ విసరటంపై ఆయన ధ్వజమెత్తారు. చిత్రాన్ని పద్రర్శించకుండా ఆటలాడుతున్నారని.. ఇంతలో సెన్సార్ గొడవ... చిత్ర విడుదల వాయిదా అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపారని ఆయన అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో సినిమా థియేటర్లకు రాబోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. దీపికను తగలబెడితే కోటి పద్మావతి చిత్రంపై మరో నజరానాను ప్రకటించారు. ఈ చిత్ర హీరోయిన్ దీపికను సజీవంగా తగలబెట్టినవారికి కోటి రూపాయల నజరానా ఇస్తామని అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం యువ నేత భువనేశ్వర్ సింగ్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. పద్మావతి మహారాణి చేసిన త్యాగం గురించి అర్థం చేసుకునేంత తెలివి దీపికకు లేదు. అందుకే అలాంటి వాళ్లు బతకటానికి వీల్లేదు అంటూ భువనేశ్వర్ తెలిపారు. ఇంతకు ముందు హర్యానా బీజేపీ చీఫ్ మీడియా కో ఆర్డినేటర్ సూరజ్ పాల్ అము.. భన్సాలీ, దీపిక తలలపై 10 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. -
భన్సాలీ తలకు పది కోట్లు.. దీపిక విస్మయం!
సాక్షి, ముంబై: చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాపై వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళన నిర్వహిస్తుండటంతో డిసెంబర్ 1న రావాల్సి ఉన్న ఈ సినిమా విడుదల ఆగిపోయింది. మరోవైపు ‘పద్మావతి’ సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా భన్సాలీ తలకు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ వెలగట్టింది. భన్సాలీ తలను నరికి తెచ్చిస్తే రూ. 10 కోట్లు ఇస్తామంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్య చేసింది. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ ఆందోళనలపై మరోసారి స్పందించింది. ‘పద్మావతి’ సినిమాను వివాదాస్పదం చేయడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. సినిమాలో ఎక్కడా అభ్యంతరకర సన్నివేశాల్లేవని ఆమె స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందని, కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. -
పద్మావతి వివాదం.. ఊహించని ట్వీట్
సాక్షి, ముంబై : పద్మావతి చిత్రంపై వివాదం కొనసాగుతుండగా.. బాలీవుడ్ నుంచి మద్దతు కరువు కావటం చర్చనీయాంశంగా మారింది. దీపిక ఒంటరి పోరాటం.. భన్సాలీ వాదన ఓవైపు... రాజ్‌పుత్ కర్ణి సేన హెచ్చరికలు మరోవైపు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పద్మావతిపై ఊహించని ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హాలీవుడ్ నటి రూబీ రోస్ పద్మావతి చిత్ర వివాదంపై స్పందించింది. దీపిక హాలీవుడ్ చిత్రం ట్రిపుల్ ఎక్స్: రిటర్న్స్ ఆఫ్ క్జాండర్ కేజ్‌లో రూబీ రోస్ కూడా నటించారు. ‘‘నా స్నేహితురాలి విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యా. ఆమె పోరాటానికి హాట్సాఫ్. నాకు తెలిసిన ధైర్యవంతమైన మహిళలలో దీపిక ఒకరు’’ అని రూబీ ట్వీట్ చేసింది. దీపిక పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని రూబీ తెలియజేశారు. ఈ లెక్కన పద్మావతి చిత్ర వివాదం ఖండాంతరాలు దాటిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీపికను డబ్బుల కోసం ఆడే బజారు మహిళ.. శూర్ఫణకగా అభివర్ణిస్తున్నా రాజ్‌పుత్ కర్ణి సేన.. ముక్కు, పీక కోస్తామంటూ హెచ్చరిస్తున్నా... దీపిక మాత్రం హెచ్చరికలపై అస్సలు వెనక్కితగ్గకుండా తన అభిప్రాయం చెబుతున్నారు. మరోవైపు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవటంపై ప్రస్తుతం మరో వివాదం మొదలయ్యింది. I am in shock at reading what my dear friend is going through but in absolute awe of her strength and courage. Deepika you are one of the strongest women I know. https://t.co/wrEaO9WZA0 — Ruby Rose (@RubyRose) November 18, 2017 -
కష్టాల్లో ‘పద్మావతి’!
మన చలనచిత్రాలనూ, డాక్యుమెంటరీలనూ చూసి అవి ఆమోదయోగ్యమో కాదో తేల్చడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఉంది. అది గీసే సవాలక్ష ‘లక్ష్మణరేఖల’పైనా, కత్తిరింపులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్న తరు ణంలో ఆ పనుల్ని అంతకంటే మూర్ఖంగా, మొరటుగా చేయడానికి దేశంలో ఎక్కడి కక్కడ మూకలు పుట్టుకొస్తున్నాయి. సినిమాల్లో కథలెలా ఉండాలో, సంభాషణలెలా సాగాలో, పాటల్లో ఏం పదాలుండాలో ఇవి నిర్ణయిస్తున్నాయి. వాటిని అమలు చేస్తారా చస్తారా అని బెదిరింపులకు దిగుతున్నాయి. ‘పద్మావతి’ చిత్రం ఇప్పుడు అలాంటి మూకల బారిన పడింది. సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు ప్రఖ్యా తులున్న సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించిన ‘పద్మావతి’కి షూటింగ్ మొదలైనప్పటి నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేసిన సెట్లోకి చొరబడి ఆ సెట్‌నూ, విలువైన పరికరాలనూ ధ్వంసం చేయడంతోపాటు భన్సాలీపై దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత షూటింగ్‌ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు మార్చు కుంటే అక్కడ సైతం సెట్‌కు నిప్పు పెట్టారు. షూటింగ్ ప్రారంభించడానికి చాలా ముందే నిరుడు నవంబర్లోనే భన్సాలీ తన సినిమా ఇతివృత్తం గురించి వచ్చిన కథనాల తర్వాత ఏర్పడ్డ అపోహలను తొలగించడానికి ప్రయత్నించారు. పద్మావతి పాత్రను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రకూ, ఆ పాత్రకూ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలూ ఉండబోవని ఆయన వివరించాడు. చిత్రం పేరు సైతం ముందనుకున్నట్టు ‘రాణి పద్మిని’ అనికాక ‘పద్మా వతి’ అని మార్చాడు. కానీ నిరసనలకు దిగేవారికి ఇదంతా పట్టలేదు. వారి బాణీలో బెదిరింపులు, హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే ముక్కు కోస్తామని ఒకరు... భన్సాలీ, దీపికల తలలు తెచ్చిస్తే రూ. 5 కోట్ల బహు మతి ఇస్తామని మరొకరు రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారు. కావాలంటే క్షత్రి యుల శౌర్యపరాక్రమాలు చూపుతూ సినిమాలు తీసుకోమని సలహాలిస్తున్నారు. వచ్చే నెల 1న చిత్రం విడుదల చేయాలని సన్నాహాలు చేసుకుంటుంటే దాన్ని అడ్డు కోవడానికి ఈ బృందాలు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇంత వివాదానికి కారణమైన చిత్రం ఇతివృత్తానికి ఆధారం చరిత్రలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ఆధారం చేసుకుని పుట్టుకొచ్చిన కాల్పనిక గాథేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. 1250లో బెంగాల్‌లోని బీర్భూం జిల్లాలో పుట్టి 1316లో మరణించిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ రాజస్థాన్‌లోని చిత్తోర్ రాజ్యంపై దండెత్తడం, దాని పాలకుడు రాణా రతన్‌సింగ్ ఓటమిపాలవడం, రాజ్యం ఖిల్జీ వశం కావడం చరిత్ర. కాలగర్భంలో కలిసిపోయిన ఆ చరిత్రకు జవ జీవాలు పోసిందీ... దాని చుట్టూ కమనీయమైన కాల్పనికతను అల్లి మహత్తర కావ్యంగా తీర్చిదిద్దిందీ మాలిక్ మహమ్మద్ జయాసి అనే ఒక ముస్లిం సూఫీ కవి. 1540లో... అంటే యుద్ధం జరిగిన 224 ఏళ్లకు ఆయన ఈ కావ్య రచనకు ఉప క్రమించాడు. మొదటిసారిగా అందులో రాణా రతన్‌సింగ్ భార్య పద్మావతి ప్రస్తా వన వచ్చింది. అంతకుముందు లిఖిత, అలిఖిత చరిత్రలో ఎక్కడా పద్మావతికి సంబంధించిన ఆధారాలు లేవు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి అమీర్‌ఖుస్రో చిత్తోర్ కోట ముట్టడి గురించిన రాసిన పత్రాల్లో ఎక్కడా పద్మావతి గురించిన ప్రస్తావన లేదు. రాజస్థాన్ నుంచి బెంగాల్ వరకూ దాదాపు అయిదువందల సంవత్సరాల వ్యవధిలో మాలిక్ కావ్యానికి ఉర్దూ, పర్షియన్ భాషల్లో అనేక అనువాదాలొచ్చాయి. అనువదించే కవుల సృజనాత్మక శక్తి మేరకు ఆ కావ్యంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదేమీ కొత్తగాదు. రామాయణ గాథ ఎన్ని దేశాల్లో ఎన్నెన్ని విధా లుగా ఉన్నదో... అందులోని పాత్రలు, వాటి మధ్య సంబంధాలు ఎలా మార్పు చెందాయో వివరిస్తూ సుప్రసిద్ధ కవి ఆరుద్ర ‘రాముడికి సీత ఏమవుతుంది?’ పేరుతో చాన్నాళ్లక్రితం పుస్తకం రాశారు. ఇప్పుడు ‘పద్మావతి’ సినిమాపై నిప్పులు చెరుగుతున్న సంఘ్ పరివార్ పెద్దలు, రాజ్పుట్ కులానికి చెందిన కర్ణి సేన సభ్యులు పద్మావతి సృష్టికర్త ఒక ముస్లిం సూఫీ కవి అన్న సంగతిని మరుస్తున్నారు. రాజస్థాన్ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రులు చేసిన ప్రకటనల సంగతలా ఉంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ సైతం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. తమ రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినే అవకాశం ఉన్నందున చిత్రం విడుదలను వాయిదా వేయాలని యోగి కేంద్రాన్ని కోరు తున్నారు. గడ్కరి అయితే సినిమాలు నిర్మించేవారు స్వేచ్ఛ నిరపేక్షమైనదేమీ కాదని, దానికి కూడా హద్దులుంటాయని తెలుసుకోవాలని హితవు చెబుతున్నారు. అకారణంగా నోరు పారేసుకోవడానికి, బెదిరింపులకు దిగడానికి ఎలాంటి హద్దులూ ఉండవు కాబోలు! ‘పద్మావతి’పై ఇంత పెద్దయెత్తున వివాదం చెల రేగుతున్న వేళ సుప్రీంకోర్టు వేరే కేసులో చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిర్మించిన ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మాన్’ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీ విడుదల కాకుండా స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తూ ఏ రకమైన సృజనాత్మక వ్యక్తీకరణలకైనా అడ్డుతగిలే ప్రయత్నం చేయరాదని సుప్రీంకోర్టు కింది కోర్టులకు సూచించింది. భావప్రకటనా స్వేచ్ఛ అత్యంత పవిత్రమైనదని, ఆ హక్కులో ఆషామాషీ జోక్యం తగదని పిటిష నర్కు స్పష్టం చేసింది. చట్టపరిధిలో ఏ కళాకారుడైనా తనకు నచ్చిన రూపంలో తన భావాలను వ్యక్తపరచవచ్చునని తెలిపింది. సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులు ఇంత స్పష్టంగా చెప్పడం ఇది మొదటిసారేమీ కాదు. అయినా వీధుల్లో ఛోటా నేతల వీరంగం ఆగడం లేదు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న నాయకులకు జ్ఞానోద యమూ కలగటం లేదు. ఇప్పుడు ‘పద్మావతి’ విషయంలో కేంద్రం స్పందన ఎలా ఉంటుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. విజ్ఞతతో వ్యవహరించి ఈ అనవసర వివాదానికి ముగింపు పలకాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పాలకులు గ్రహించాలి. -
దీపిక ఏమైనా తోపు అనుకుంటుందా?
పట్న(బిహర్) : పద్మావతి చిత్ర వివాదం పూటపూటకి వేడిని మరింతగా రాజేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్‌పై దీపిక పడుకొనేపై రాజ్‌పుత్ కర్ణి సేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మండిపడ్డారు. పట్నలో మీడియాతో మాట్లాడిన ఆయన దీపిక తాజాగా చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ‘‘రాణి పద్మావతిని అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రేయసిగా చూపించటాన్ని ఎవరు భరిస్తారు? చిత్రం ఎట్టి పరిస్థితుల్లో విడుదలై తీరుతుందని దీపిక చెబుతోంది. ఆమె మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయే తప్ప.. ఆలోచనా ధోరణితో లేవు. ఆమె ఏం ఈ దేశానికి అధినేత కాదు. ఆదేశాలు చేయటానికి ఏమైనా తోపు అనుకుంటుందా?. రాజ్‌పుత్ కర్ణి సేన అధినేతగా చెబుతున్నా ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో విడుదల కాబోదు’’ అని లోకేంద్ర పేర్కొన్నారు. రాణి పద్మావతి తమకు తల్లి లాంటిదని... అలాంటి మహనీయురాలి పేరును చెడగొట్టేందుకు దర్శకుడు భన్సాలీ ప్రయత్నిస్తున్నాడని లోకేంద్ర తెలిపారు. ఆ ఘోరాన్ని తాము భరించలేమని ఆయన అంటున్నారు. ఒక్క రాజ్‌పుత్ మాత్రమే కాదు.. ఈ సినిమాను అడ్డుకునేందుకు యావత్ భారత సమాజం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చిత్ర విడుదలను అడ్డుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా లోకేంద్ర సింగ్ ప్రస్తావించారు. కాగా, సినిమా విషయంలో జోక్యం చేసుకోవటానికి రాజ్‌పుత్ కర్ణి సేన ఎవరని? అందుకు సెన్సార్ బోర్డు ఉందని దీపిక వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహం చెందిన సేన సభ్యుడొకరు ఆమె ముక్కును కోసేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. -
'పద్మావతి' సినిమాను నిషేధించండి!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాను వివాదాలు విడిచిపెట్టడం లేదు. రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల కాకుండా నిషేధించాలంటూ ఏకంగా బీజేపీ ఎంపీ ఒకరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. చరిత్రను వక్రీకరించి.. రాజ్‌పుత్‌లో మనోభావాలు దెబ్బతీసేవిధంగా తెరకెక్కిన 'పద్మావతి' సినిమాను నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్ గోయెల్ కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మరోవైపు జోరుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కర్ణిసేన ఆధ్వర్యంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన సభలో దాదాపు లక్ష మంది రాజ్‌పుత్ వర్గీయులు హాజరయ్యారు. పద్మావతిని నిలిపివేయాలంటూ వేలాది మంది సూరత్ లోనూ ఆందోళనలు నిర్వహించారు. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు. ‘చారిత్రక అంశాల్లోని వాస్తవాల ఆధారంగానే భన్సాలీ చిత్రం తీస్తే..తొలుత ఇచ్చిన మాట ప్రకారం మాకు సినిమాను చూపించడానికి ఎందుకు జంకుతున్నారు? ఈ సినిమాలో రాణి పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ప్రేమ గీతం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పద్మావతి విడుదలైతే.. రాజపుత్రులు ఏం చేయగలరో చూపిస్తాం’ అని కర్ణిసేనకు చెందిన వీరేంద్రసిన్హ్ భాటి హెచ్చరించారు. ఈ చిత్రంపై నిషేధం విధించకుంటే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర పర్యావసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు: భన్సాలీ ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. 'ఎంతో నిజాయితీతో, బాధ్యతతో, అకుంఠిత దీక్షతో ఈ సినిమాను తెరకెక్కించాను. రాణి పద్మావతి కథ నాలో ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. ఆమె వీరోచిత పోరాటం, త్యాగానికి ఘననివాళిగా ఈ చిత్రాన్ని రూపొందించాను. కొన్ని వందతుల వల్ల ఈ సినిమాపై వివాదం తలెత్తింది’ అని భన్సాలీ పేర్కొన్నారు. ’రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య డ్రీమ్‌సీక్వెన్స్ సినిమాలో ఉన్నట్టు వచ్చిన వదంతులను నేను ఇప్పటికే ఖండించాను. వారిద్దరి మధ్య అలాంటి సన్నివేశాలు ఉండవని రాతపూర్వకంగా హామీ ఇచ్చాను. ఈ వీడియో ద్వారా నేను మరోసారి స్పష్టం చేస్తున్నా.. ఎవరి మనోభావాలు దెబ్బతీసేవిధంగా రాణి పద్మావతి, ఖిల్జీ మధ్య సన్నివేశాలు ఉండబోవు’ అని భన్సాలీ తెలిపారు. -
గుజరాత్లో ‘పద్మావతి’ మంటలు
అహ్మదాబాద్ : సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘పద్మావతి’ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ ఆదివారం గుజరాత్‌లోని రాజ్‌పుత్‌లు భారీ ఆందోళనలు నిర్వహించారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కర్ణిసేన ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి దాదాపు లక్ష మంది రాజ్‌పుత్ వర్గీయులు హాజరయ్యారు. పద్మావతిని నిలిపివేయాలంటూ వేలాది మంది సూరత్ లో ఆందోళనలు నిర్వహించారు. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లా వుద్దీన్ ఖిల్జీల మధ్య ఓ ప్రేమ గీతాన్ని చిత్రీ కరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై కర్ణిసేనకు చెందిన వీరేంద్రసిన్హ్ భాటి మీడియాతో మాట్లాడుతూ.. ‘చారిత్రక అంశాల్లోని వాస్తవాల ఆధారంగానే భన్సాలీ చిత్రం తీస్తే..తొలుత ఇచ్చిన మాట ప్రకారం మాకు సినిమాను చూపించడానికి ఎందుకు జంకుతున్నారు? ఈ సినిమాలో రాణి పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ప్రేమ గీతం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పద్మావతి విడుదలైతే.. రాజపుత్రులు ఏం చేయగలరో చూపిస్తాం’ అని హెచ్చరించారు. ఈ చిత్రంపై నిషేధం విధించకుంటే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర పర్యావసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుం దని స్పష్టం చేశారు. ముంబైలోని భనాల్సీ కార్యాలయం ముందు 25 మంది రాజపుత్ర వర్గీయులు ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వారిని విడిచిపెట్టారు. చిత్రీకరణ ప్రారంభమైనప్పటి నుంచి పద్మావతి చిత్రానికి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత భన్సాలీపై దాడికి దిగిన దుండగులు..తర్వాత కొల్హాపూర్‌లో వేసిన కోట్లాది రూపాయల విలువైన సినిమా సెట్‌ను సైతం తగలబెట్టారు. -
పద్మావతి వివాదంపై స్పందించిన ఉమా భారతి
-
పద్మావతి వివాదం.. చూస్తూ ఊరుకోను!
జైపూర్ : పద్మావతి చిత్ర వివాదంపై కేంద్ర మంత్రి ఉమా భారతి స్పందించారు. అభ్యంతరాలు లేవనెత్తున్న వారికి ఈ చిత్రాన్ని ప్రదర్శించి చూపాలని పద్మావతి చిత్ర మేకర్లను ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆమె తన ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఈ విషయంపై నేను మౌనంగా చూస్తూ ఉండలేను. తమ మనోభావాలు దెబ్బతినేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు వాదిస్తున్నారు. చరిత్రకారులు, చిత్ర నిర్మాతలు, నిరసనకారులు, సెన్సార్ బోర్డు వీరందరితో కలిపి ఓ కమిటీని నియమిస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా’’ అని అర్థం వచ్చేలా ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే యత్నం జరగకూడదని ఉమా భారతి అభిప్రాయపడ్డారు. रानी पद्मावती के विषय पर मैं तटस्थ नही रह सकती। मेरा निवेदन है कि पद्मावती को राजपूत समाज से न जोड़कर भारतीय नारी के अस्मिता से जोड़ा जाए।/1 — Uma Bharti (@umasribharti) November 3, 2017 क्यो न रिलीज़ से पहले इतिहासकार, फ़िल्मकार और आपत्ति करने वाला समुदाय के प्रतिनिधि और सेंसर बोर्ड मिलकर कमिटी बनाये और वो इसपर फैसला करे/2 — Uma Bharti (@umasribharti) November 3, 2017 చిత్తోర్‌ఘడ్ మహరాణి పద్మిని కథాంశంతో సంజయ్ లాలా భన్సాలీ పద్మావతిని తెరకెక్కించిన విషయం తెలిసిందే. చరిత్రను వక్రీకరించి అల్లావుద్దీన్ ఖిల్జీ-పద్మిని పాత్రల మధ్య కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించాడంటూ శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. ఈ జనవరిలో దర్శకుడు భన్సాలీతోపాటు చిత్ర యూనిట్‌పై దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ముందు తమకు ప్రదర్శించాలంటూ డిమాండ్ చేస్తోంది. సినిమాకు మేం వ్యతిరేకం కాదు. కానీ, భన్సాలీ బృందం మేధావులకు, చరిత్రకారుల సమక్షంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని కోరుతున్నాం అని రాజ్‌పుత్ కర్ణి అధికార ప్రతినిధి విశ్వబంధు రాథోడ్ చెబుతున్నారు. ఈ మేరకు పలు సంఘాల మద్దతుతో శనివారం చిత్తోర్‌ఘడ్ బంద్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు బీజేపీ కూడా చిత్రంపై అభ్యంతరం లేవనెత్తుతోంది. క్షత్రియ మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయో లేదో తెలియాలంటే ముందుగా ప్రదర్శించాలని, లేకపోతే ఆ ప్రభావం గుజరాత్ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుందంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ బీజేపీ చర్యలను ఖండిస్తూనే చిత్రాన్ని ప్రదర్శించి తీరాలని కోరటం విశేషం. అయితే అహ్మదాబాద్ యువత మాత్రం సినిమా రిలీజ్‌ను అడ్డుకోవటం కళను అవమానించినట్లే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలను రాజకీయాలకు వాడుకోవటం సరికాదని వారు పార్టీలకు సూచిస్తున్నారు. -
ఆ ట్రైలర్‌ను ఎంతమంది చూశారంటే...
సాక్షి,ముంబయి:బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ టైటిల్ రోల్ పోషించిన సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పద్మావతి అధికారిక ట్రైలర్ అక్టోబర్ 9న విడుదలైనప్పటినుంచీ ఇప్పటివరకూ 5 కోట్ల మందికి పైగా వీక్షించారు. వివాదాలతో పాటు ఎన్నో ప్రత్యేకతలతో రూపొందిన పద్మావతి విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు నమోదు చేస్తోంది. తాజాగా చిత్ర ట్రైలర్‌కు వచ్చిన అద్భుత స్పందనను మూవీ మేకర్లు ట్విట్టర్లో పంచుకున్నారు. ట్రైలర్‌ను విశేషంగా ఆదరించడంతో పాటు కీలక మైలురాయిని అధిగమించేలా చేసినందుకు ఫ్యాన్స్‌తో పాటు మూవీ ప్రేమికులకు యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. యూట్యూట్, ఫేస్బుక్లో రిలీజ్ చేసిన ట్రైలర్ 5 కోట్ల వీక్షకుల మార్క్‌ను అధిగమించింది. భన్సాలీ సినిమాలంటేనే వివాదాలు, ప్రత్యేకతలతో పతాకశీర్షికలకెక్కడంలో ముందుంటాయి. పద్మావతి దీనికి మినహాయింపు కాలేదు. సినిమా ప్రారంభం నుంచే వివాదాలు వెంటాడాయి. రాణి పద్మిని పాత్ర తీరుపై రాజ్పుట్ సంఘాలు మొదటినుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సినిమాను తమకు చూపించకుండా విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఇప్పటికే హెచ్చరించాయి. చరిత్రను వక్రీకరించేలా ఎలాంటి సన్నివేశాలున్నా భారీ మూల్యం తప్పదని స్పష్టం చేశాయి. ఇన్ని వివాదాల మధ్య పద్మావతి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అప్పుడు పద్మావతి ఏం చేసింది?
ఒక మహారాజు. తను ప్రేమించే ఒక మహారాణి. ఆ మహారాజే.. ఆ మహారాణి రాజ్యం, రాజసం. ఆ రాజ్యాన్ని, ఆ రాజసాన్ని ఓ బలవంతుడు తన ఖడ్గానికి ఆహుతి చేశాడు! అప్పుడు పద్మావతి ఏం చేసింది? ‘నా కంకణం.. ఖడ్గ సమానం’ అంది!! అరుంధతి, మగధీర, రుద్రమదేవి, బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి‘కోట కథల’ భారీ సినిమాలను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ నుంచి వచ్చిన జోధా అక్బర్, బాజీరావ్ మస్తానీ వంటి చరిత్రాత్మక చిత్రాలు కూడా కనువిందు చేశాయి. ఈ వరుసలోనిదే డిసెంబర్ 1న రానున్న ‘పద్మావతి’. 9 అక్టోబర్ 2017 రాత్రి 7.54 నిముషాలు. రాజమౌళి స్టన్ అయ్యాడు! ‘పద్మావతి’ ట్రైలర్ అతడి మతి పోగొట్టింది. 7 గం. 55 ని.లకు.. ‘ఇన్సేన్లీ బ్యూటిఫుల్’అని ట్వీట్ చేశాడు. ప్రతి ఫ్రేమ్‌ని చింపేశాడట భన్సాలీ.రాజమౌళి మళ్లీ చూశాడు ‘పద్మావతి’ ట్రైలర్‌ని! రాత్రి 8 గం. 1 ని.కి మరోసారి ట్వీట్ చేశాడు. రణ్వీర్ భయపెట్టేశాట్ట రాజమౌళిని!2015లో ‘బాహుబలి’ని చూసి దేశం ఇలాగే స్టన్ అయింది. ఇప్పుడు పద్మావతి ట్రైలర్‌ను చూశాక భన్సాలీ.. బాహుబలిలా కనిపించినట్లున్నాడు రాజమౌళికి!ఆ రోజు ట్రైలర్‌ని సరిగ్గా 13.03కి విడుదల చేశాడు భన్సాలీ. క్రీ.శ.1303 నాటి పద్మావతి కథకు దగ్గరగా ఉండడం కోసం. భయాన్ని కత్తి మొన మీద ఆడిం చేవాడు రాజపుత్రుడు. ఇసుకతో నావను చేసుకుని సముద్రానికే సవాల్ విసిరేవాడు రాజపుత్రుడు. తల తెగిపడినా మొండెంతో ఖడ్గ చాలనం చేసేవాడు రాజపుత్రుడు.రాజపుత్ర మహిళేం తక్కువ! ఆమె గాజులు ఖడ్గమంత పదునైనవి. ట్రైలర్‌లోని ఈ మాటలు రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయి. దీపికా పడుకోన్.. రాణీ పద్మావతి. షాహిద్ కపూర్.. రావల్ రతన్ సింగ్. రణ్వీర్ సింగ్.. అల్లా ఉద్దీన్ ఖిల్జీ. కథ నడిపింది సంజయ్ లీలా భన్సాలీ. భన్సాలీ ఈ సినిమాకు మొదట అనుకున్న పేరు ‘రాణీ పద్మావతి’. ఈ సినిమాను మొదట రిలీజ్ చేయాలనుకున్న డేట్ నవంబర్ 17. రెండూ మారిపోయాయి! రాణీ పద్మావతి వట్టి పద్మావతి అయింది. నవంబర్ 17.. డిసెంబర్ 1 అయింది. కారణం కాంట్రావర్శీలు. షూటింగ్‌కి మూడుసార్లు బ్రేక్ పడింది. ఈ ఏడాది జనవరిలో ఒకసారి. మార్చిలో రెండుసార్లు. రాజస్థాన్‌లోని జైగఢ్ ఖిల్లాలో షూటింగ్‌కి భన్సాలీ సెట్స్ అన్నీ వేసుకున్నాక అక్కడి రాజపుత్రకర్ణి సేనలు వచ్చి సెట్స్‌ని ధ్వంసం చేశాయి. భన్సాలీ చరిత్రను భ్రష్టు పట్టిస్తున్నారని వారి ఆరోపణ. ‘ఖిల్జీకి, పద్మావతికి మధ్య ప్రేమ కుదిరిస్తే నీ తిక్క కుదిరిస్తాం’ అని భన్సాలీని బెదిరించారు. శాంపిల్‌గా రెండు దెబ్బలు కూడా వేశారు. భన్సాలీ చెంపలు కందిపోయాయి. ‘లేదు, నేను ఖిల్జీ, పద్మావతిల మధ్య ప్రేమను చూపించడం లేదు’ అని కన్విన్స్ చెయ్యబోయారు భన్సాలీ. ‘నీ చావు నువ్వెలాగైనా చావు. చరిత్రను మాత్రం చంపకు’ అని వెళ్లిపోయారు. సెట్స్ చిత్తోర్‌గఢ్ ఫోర్ట్‌కి మారాయి. రాణీ పద్మినీ ప్యాలెస్ అందులోనే ఉంది. రాజపుత్రకర్ణి సేనలు అక్కడిక్కూడా వచ్చాయి. ప్యాలెస్‌లోని అద్దాలు భళ్లుమన్నాయి. అయితే అవి భన్సాలీ బిగించిన అద్దాలు కాదు. నలభై ఏళ్ల క్రితమే పురావస్తు వాళ్లు బిగించినవి. భన్సాలీ చెంపను పగలగొట్టే వీల్లేక అద్దాలను పగల గొట్టారు. భన్సాలీకి సెక్యూరిటీ ఉంది మరి.మూడో ఎటాక్ కొల్హాపూర్‌లో. ఎవరో వచ్చారు. వాళ్లు రాజపుత్రకర్ణి సేనలు కాదు. వచ్చి, ప్రొడక్షన్ సెట్స్‌ని, కాస్ట్యూమ్స్‌నీ, ఆభరణాలను తగలబెట్టి పరారయ్యారు! పద్మావతి కథ రాజస్థాన్‌ది. కొల్హాపూర్ ఉండేది మహారాష్ట్రలో. అక్కడివాళ్లకేంటి సంబంధం? సంబంధం కాదు. హైందవ చరిత్రతో ఉన్న అనుబంధం. పద్మావతితో ఉన్న బాంధవ్యం. ‘ఆ అమ్మాయి మనమ్మాయి’ అనే ఫీలింగ్. ఈ ఫీలింగ్‌ని భన్సాలీ హర్ట్ చేస్తున్నారా?! ఆయన చెప్పడం అయితే ‘కాదు’ అనే. ఏమో చెప్పలేం. దాడులేవీ జరక్కుండా ఉంటే ఖిల్జీకి పద్మావతికీ మధ్య ప్రేమ మొలకెత్తినట్లు చూపేవారేనేమో! ‘సృజనకారుడికి స్వేచ్ఛ ఉంటుంది’ అని మొదట ఆయన ఒకమాట అన్నారు. అయితే చరిత్రను వక్రీకరించేంత స్వేచ్ఛను ఆయనకు రాజపుత్రకర్ణి సేనలు ఇవ్వలేదు. భన్సాలీ కథేంటి? కథ ఏదైనా కావచ్చు. భన్సాలీ తీస్తే అందులో ప్రేమ ఉంటుంది. ఫిక్షన్ ఉంటుంది. చరిత్ర ఉంటుంది. ఈ మూడింటితో అల్లేస్తాడు. 1942 : ఎ లవ్ స్టోరీ, దేవదాసు, సావరియా, గోలియోం కీ రాస్లీలా రామ్–లీలా, బాజీరావ్ మస్తానీ.. ఇవన్నీ అల్లికలే. పద్మావతి ఇంకో అల్లిక. మొదట ఐశ్వర్యారాయ్నీ, సల్మాన్‌ఖాన్‌ని అనుకున్నాడు. పద్మావతిగా ఐశ్వర్య, ఆమె భర్త రావల్ రతన్‌సింగ్‌గా సల్మాన్. ‘అతనుంటే నేను చేయను’ అని ఐశ్వర్య, ‘ఆమె ఉంటే నేను చేయను’ అని సల్మాన్! మిగిలింది దీపికా పడుకోన్, రణ్వీర్ సింగ్. గోలియోం కీ రాస్లీల రామ్–లీల, బాజీరావ్ మస్తానీల హిట్ జంట. దీపికను పద్మావతిగా, రణ్వీర్ను ఖిల్జీగా సెలక్ట్ చేసుకున్నాడు భన్సాలీ. ప్రియాంకా చోప్రాను కూడా చిన్న రోల్ చేసిపెట్టమని అడిగాడు. ముందు ఎస్ అంది. తర్వాత నో చెప్పింది. (ఇప్పుడు పద్మావతిలో ఉన్న అదితి రావ్ హైద్రీ పాత్రనే బహుశా అతడు ప్రియాంకకు ఆఫర్ చేసి ఉండాలి). రణ్‌వీర్‌కు ముందు భన్సాలీ షారుక్‌ని కూడా అనుకున్నాడు. ‘ఉమెన్ సెంట్రిక్’ కదా.. అని షారుక్ నవ్వి ఊరుకున్నారు.సినిమా పేరైతే ‘రాణీ పద్మావతి’ అన్నాడు కానీ, కథేంటో బయటపెట్టలేదు భన్సాలీ. ఇంకా అల్లుతూనే ఉన్నానన్నాడు. ఆగే ఓపిక మీడియాకు ఎక్కడిదీ! తనే అల్లేసింది. తీస్తున్నది భన్సాలీ కాబట్టి.. దండయాత్రకు వచ్చిన ఖిల్జీ చక్రవర్తి మీద పద్మావతికి ప్రేమ చిగురించే అవకాశాలున్నాయి అని రాసేసింది. పోనీ అప్పుడైనా ‘అది కాదు’ అన్నాడా భన్సాలీ! లేదు. ఆ తర్వాత అన్నాడు.. ‘లేదు.. లేదు.. వారిద్దరి మధ్యా ప్రేమ ఉండదు’ అని.. సేనలొచ్చి సెట్స్‌ని తగలబెట్టాక!!మరేంటి భన్సాలీ స్టోరీ? సెట్సే ఆయన స్టోరీ, డైలాగ్సే ఆయన స్టోరీ. మ్యూజిక్కే ఆయన స్టోరీ. దీపిక కళ్లు, రణ్వీర్ మీసాలు, షాహిద్ బక్కపలుచని చువ్వలాంటి దేహం.. ఇవీ ఆయన స్టోరీ. పద్మావతి ఆత్మగౌరవం అసలైన స్టోరీ. ‘రాణీ పద్మావతి’ అనే టైటిల్లోంచి సేఫ్‌సైడ్ ‘రాణి’ని కూడా తొలగించారు భన్సాలీ. రాణీ పద్మావతి చరిత్ర కథ. పద్మావతి భన్సాలీ కథ. నో కాంట్రావర్సీ. అసలు కథేంటి? రాణీ పద్మావతి అందాలరాశి. రావల్ రతన్ సింగ్ భార్య. రతన్‌సింగ్ రాజపుత్రుడు. 1302–03 లో మేవార్ చక్రవర్తి. అదే సమయంలో ఢిల్లీ చక్రవర్తి అల్లా ఉద్దీన్ ఖిల్జీ. రాణీ పద్మావతి అందం గురించి విని ఉంటాడు ఖిల్జీ. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. దండయాత్ర చేసి రతన్‌సింగ్‌ని చంపేస్తాడు. ఇది తెలిసి రాణి పద్మావతి, మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.ఈ స్టోరీని చరిత్రకారులెవ్వరూ సమర్థించరు. ఇదొక ఫిక్షన్. మన బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ లాగే మాలిక్ మహ్మద్ జయసీ అనే కవి ఒకాయన ఉండేవాడు. 1540లో ఆయన దేవనాగరి భాషలో కొంచెం రియాల్టీని మిక్స్ చేసి ‘పద్మావతి’ అనే కావ్యఖండాన్ని సృష్టించాడు. మహ్మద్ జయసీ తనకు రెండొందల ఏళ్ల ముందునాటి సంగతిని ఇలా ఊహించి రాస్తే, ఇప్పుడు భన్సాలీ తనకు ఐదొందల ఏళ్ల ముందునాటి మహ్మద్ జయసీ కావ్యాన్ని సినిమాగా తీశాడు. జయసీ కావ్యంలో రాణీ పద్మావతి తన స్వాభిమానాన్ని కాపాడుకోడానికి ఖిల్జీకి దక్కకుండా ఆత్మాహుతి చేసుకుంటే.. ఇక్కడ భన్సాలీ సినిమాలో పద్మావతిని ఖిల్జీతో ప్రేమలో పడేయాలని మొదట అనుకున్నారట! ఆ అనుకోవడం ఎంతవరకు నిజమో కానీ, పద్మావతి కల్పిత పాత్ర అయినప్పుడు.. ఎలా తీస్తే ఏముందని యూనివర్శిటీ ప్రొఫెసర్లు కొందరు వాదించారు. ఏళ్లుగా ఉన్న నమ్మకం.. అది కల్పితంలోంచి పుట్టినదే అయినా.. వాస్తవంగా స్థిరపడిపోయినప్పుడు వాదనలు పని చేయవు. అందుకే పద్మావతి గురించి మనం విన్నదాన్నే ఇప్పుడు భన్సాలీ మనకు చూపించబోతున్నారు. స్టిల్ వాటర్స్ రన్ డీప్ సినిమాలో షాహిద్‌ను రణ్వీర్ డామినేట్ చేశాడని సోషల్ మీడియాలో ట్రాల్స్ని బట్టి తెలుస్తోంది. పైగా షాహిద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ట్రైలర్ ఫొటో కూడా రణ్వీర్ ఇమేజ్‌ని పెంచేలా ఉంది. నడుముపై భాగంలో బట్టల్లేకుండా ఖడ్గాన్ని జ్వాలల్లో పదును తేలుస్తున్న స్టిల్ అది! ‘స్టిల్ వాటర్స్ రన్ డీప్. హి విల్ రైజ్ ఆన్ ది ఫస్ట్ ఆఫ్ డిసెంబర్. వెయిట్ ఫర్ ఇట్’ అని ఆ స్టిల్కు గుంభనమైన ఒక వ్యాఖ్యను జోడించాడు షాహిద్. ఆ మాటల్లోని గూఢార్థం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. నిశ్చలంగా ఉన్న నీటి అడుగున లోతు ఎక్కువగా ఉంటుందని సాధారణ అర్థం. పైకి మామూలుగా ఉన్నాను, రిలీజ్ అయ్యాక నేనేంటో చూపిస్తాను అని షాహిద్ చెప్పదలచుకున్నాడా? పద్మావతి ఫస్ట్ లుక్ పద్మావతి ఆర్ట్‌వర్క్ తప్ప పద్మావతి సినిమా వర్క్ మనకు ఇప్పటి వరకు లేదు. దీపికా పడుకోన్ పోస్టర్ రిలీజ్ అయ్యాక ఆ కొరత తీరింది. ఏ రాణి అయినా అందంగానే ఉంటుంది. ఈ రాణి మాత్రం స్టన్నింగ్ బ్యూటీ! ఆ డ్రెస్సు, జ్యుయలరీ, చేతులు ముకుళించిన ఆ సౌశీల్యం, చేతులు దించిన ఆ గాంభీర్యం.. పద్మావతికి భన్సాలీ ప్రాణ ప్రతిష్ట చేశారు. అయితే నుదుటి దగ్గర, బొట్టు కింద.. ఆమె రెండు కనుబొమలూ కలిసిపోయిన లుక్ (యూనీబ్రో) కొందరికి నచ్చలేదు. చాలామందికి నచ్చింది. ‘చూస్తూ ఉండండి. మన అమ్మాయిలు వెంటనే ఈ లుక్కును ఫాలో అయిపోతారు’ అని ట్వీట్లు కూడా మొదలయ్యాయి. ఆఫర్ ఇస్తే.. ఈ ముగ్గురూ ‘నో థ్యాంక్స్’ అనేశారు! -
బాహుబలి 2 రికార్డును.. బ్రేక్ చేసింది
సాక్షి,ముంబయి: సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన వెండితెర దృశ్య కావ్యం పద్మావతి అరుదైన ఫీట్ సాధించింది. ఇటీవల విడుదలైన పద్మావతి చిత్ర ట్రయలర్ బయటకు వచ్చిన 24 గంటల్లోనే ఒక కోటి 50 లక్షల మందికి పైగా వీక్షకులు వీక్షించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన బాహుబలి 2 ట్రయలర్ కోటి 11 లక్షల మంది వీక్షించారు. భారత చలనచిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి 2 ట్రయలర్ వీక్షకుల రికార్డును కేవలం 24 గంటల్లో బ్రేక్ చేసిన పద్మావతి ఇక విడుదలైన తర్వాత మరెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందోననే అంచనాలు నెలకొన్నాయి. చారిత్రక చిత్రంగా విపరీతమైన హైప్ క్రియేట్ అయిన పద్మావతి ట్రయలర్‌కు వీక్షకుల నుంచి అపూర్వ స్పందన వస్తుండటంతో చిత్ర మేకర్లు సంతోషంగా ఉన్నారు. ట్రయలర్‌ను చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు, విమర్శకులు దర్శకుడు సంజయ్ భన్సాలీపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. పద్మావతిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పడుకోన్ తన అందాలతో ఆకట్టుకోనుండగా, మహర్వాల్ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్నారు. -
చిత్తూరు రాజును పరిచయం చేశారు
సాక్షి, సినిమా : బాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం పద్మావతిని తెరకెక్కిస్తున్నాడు. వారం క్రితం దీపికా పదుకునే ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో పాత్రను పరిచయం చేసింది. చిత్తూరు మహారాజు మహారావల్ రతన్ సింగ్ పాత్రలో, చిత్రంలో దీపిక భర్తగా నటిస్తున్న షాహిద్ కపూర్ పోస్టర్లను వదిలారు. భారీ గడ్డంతో రాజు అవతారంలో ఛాక్లెట్ బోయ్ షాహిద్ లుక్కు సూపర్బ్‌గా ఉంది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశంలో కత్తిని ఒర నుంచి బయటకు తీయకుండా.. సీరియస్‌గా చూస్తున్న పోస్టర్ బాగుంది. మహారావల్ పాత్ర కోసం తాను చాలా శ్రమించాల్సి వచ్చిందని ఓ సందర్భంలో షాహిద్ చెప్పటం తెలిసిందే. డిసెంబర్ 1న ‘పద్మావతి’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. -
‘కామసూత్ర’ తరహాలో తీసుంటే పోయేది!
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో సంజయ్ లీలా బన్సాలీ తీస్తున్న ‘పద్మావతి’ సినిమా షూటింగ్ సందర్భంగా రాజ్‌పుత్ కర్ణి సేన దాడి చేయడం తెల్సిందే. అయితే సినిమా షూటింగ్‌ల సందర్భంగా రాజస్థాన్‌లో గొడవలు చేయడం అతిసాధారణం. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోనే సినిమాలు తీసేందుకు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ సినిమా సంస్థలు కూడా పోటీ పడుతుంటాయి. చారిత్రక, సాంస్కతి వారసత్వ సంపదతో సుందర ప్రదేశంగా రాజస్థాన్ రాష్ట్రం వాసికెక్కడమే అందుకు కారణం. కమర్షియల్ సినిమాలతోపాటు మ్యూజిక్ వీడియో అల్బంలను కూడా ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా తీస్తారు. ఇక చారిత్రక సినిమాలకైతే పెట్టింది పేరు. రాజస్థానాల్లో షూటింగ్‌లు నిర్వహించాలంటే రెండు స్థాయిల్లో అనుమతులు తప్పనిసరి. ఒకటి అధికారుల స్థాయిలో, అది సులభంగానే లభిస్తుంది. రెండోది స్థానిక పెద్దల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు వారికి స్క్రిప్టు ఏమిటో వివరించాలి. అది వారి మనోభావాలకు విరుద్ధంగా ఉండకూడదు. అప్పుడే వారికి షూటింగ్ కోసం అనుమతిస్తారు. తాము ఊహించినట్లుగా సినిమాలేకపోతే సినిమా విడుదల అనంతరం కూడా స్థానికులు గొడవలు చేస్తారు. ఐశ్వర్యరాయ్, హతిక్ రోషన్ నటించిన ‘జోదా అక్బర్’ సినిమా షూటింగ్ సందర్భంగానే కాకుండా సినిమా విడుదల అనంతరం కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. సినిమా పోస్లర్లు చించివేయడం, సినిమా హాళ్లలో ప్రదర్శనలను నిలిపివేయడం చేశారు. రాజస్థాన్ ప్రజల మనస్తత్వం గురించి తెల్సిన మీరా నాయర్, 1996లో ‘కామసూత్ర–ఏ టేల్ ఆఫ్ లవ్ స్టోరీ’ని సినిమా టైటిల్ చెప్పకుండా స్థానిక పెద్దలను భ్రమలో ఉంచి సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ‘ప్రాజెక్ట్ 5’ పేరుతో ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకుండా అప్పుడు కామసూత్ర సినిమా షూటింగ్‌ను పూర్తి చేశామని ఆ సినిమా ప్రొడక్షన్ యూనిట్లో పనిచేసిన సురేందర్ కుమార్ కాల్రా తెలియజేశారు. సంజయ్ లీలా బన్సాలీ కూడా సినిమా టైటిల్ పేరు చెప్పకుండా పద్మావతి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. షూటింగ్ సందర్భంగా ఉండేంత నిరసన సినిమా విడదలయ్యాక ఉండదని ఆయన అన్నారు. కామసూత్ర సినిమా విడుదలయ్యాక దానికి వ్యతిరేకంగా రాజస్థాన్ ప్రజలు ఆందోళన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మాధురీ దీక్షిత్‌తో ‘మీనాక్షి ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్’ అనే సినిమా షూటింగ్ సందర్భంగా కూడా స్థానిక ప్రజలు గొడవ చేశారు. ఆ సినిమా దర్శకుడు ఎంఎఫ్ హుస్సేన్ ముస్లిం కావడమే అందుకు కారణం. రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా తీసిన ‘ఢిల్లీ 6’ సినిమా షూటింగ్ సందర్భంగా కూడా స్థానిక పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వారితో పలు దఫాలుగా చిత్రం యూనిట్ చర్చలు జరిపి నచ్చచెప్పారు. 2013లో చార్లెస్ శోభరాజ్‌పై తీసిన ‘మై ఔర్ చార్లెస్’ సినిమా షూటింగ్ సందర్భంగా కూడా గొడవ జరిగింది. అప్పుడు పోలీసులే సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. రాజకీయ పెద్దల జోక్యంతో గొడవ పెద్దదై చివరకు కొంత మంది పోలీసు అధికారుల బదిలీకి దారితీసింది. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్లో పుట్టిన నార్వే దర్శకురాలొకరు అంతర్జాతీయ సినిమా షూటింగ్ కోసం వచ్చారు. అప్పుడు ఉదయపూర్, అజ్మీర్‌లో జరగాల్సిన ఆమె షూటింగ్ ను అడ్డుకున్నారు. పాకిస్థాన్ కళాకారులను దేశం నుంచి తరిమివేయాలనే పిలుపు నేపథ్యంలో దర్శకురాలు పాకిస్థాన్ అమ్మాయి అనుకొని స్థానికులు షూటింగ్‌కు అడ్డుపడ్డారు. ఆమె పాకిస్థాన్‌లో పుట్టారుగానీ నార్వే దేశస్థురాలంటూ ఆమె పాస్‌పోర్టును చూపిస్తేగానీ స్థానికులు షూటింగ్‌ను అనుమతించలేదు. బన్సాలీ చిత్రం యూనిట్‌పై రాజ్‌పుత్ కర్ణి సేన దాడిచేసి ఐదు రోజులు గడిచినా ఇంతవరకు అక్కడి పోలీసులు కేసు బుక్ చేయలేదు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్వయంగా ఫోన్‌చేసి అక్కడి బీజేపీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పినా ఆమె స్పందించలేదు. అక్కడి ప్రభుత్వం ఎప్పుడూ హిందు సేనల జోలికి వెళ్లదు. -
‘ఆ డైరెక్టర్‌ను బూటుతో కొడితే.. డబ్బులిస్తా’
ముంబై: చారిత్రక కథాంశంతో నిర్మిస్తున్న బాలీవుడ్ సినిమా పద్మావతి గురించి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ వివరణ ఇచ్చినా వివాదం సద్దుమణగలేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత అఖిలేష్ ఖండెల్వాల్.. భన్సాలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భన్సాలీని బూటుతో కొట్టినవారికి పది వేల రూపాయల నజరానా ఇస్తానని ప్రకటించారు. మహారాణి పద్మిని చరిత్రను వక్రీకరించి, ఆమెను అగౌరవ పరిచేలా పద్మావతి సినిమాలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో రాజ్పుట్ కర్ని సేన సభ్యులు పద్మావతి సినిమా షూటింగ్ సెట్‌ను ధ్వంసం చేసి, భన్సాలీని చెంపదెబ్బ కొట్టి జుట్టు పట్టుకుని లాగిన సంగతి తెలిసిందే. దీనిని బాలీవుడ్ పరిశ్రమ ఖండించగా, రాజ్ పుట్ వర్గీయులు మాత్రం నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఈ గొడవ అనంతరం భన్సాలీ వివరణ ఇచ్చారు. పద్మావతి సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని, రాణి పద్మిని, అలావుద్దీన్ ఖల్జీ మధ్య ప్రేమ సన్నివేశాలు లేవని చెప్పారు. అయినా శాంతించని రాజ్ పుట్ వర్గీయులు.. ఈ సినిమా టైటిల్‌ను మార్చాలని, విడుదలకు ముందు తమకు చూపించాలని డిమాండ్ చేశారు. (చదవండి: షూటింగ్లో ప్రముఖ దర్శకుడిపై దాడి) -
పద్మావతి ఎవరు..?
-
పద్మావతి ఎవరు..?
న్యూఢిల్లీ: ‘పద్మావతి’ బాలివుడ్ సినిమా షూటింగ్ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై రాజ్‌పుత్ కర్ణి సేన కార్యకర్తలు దాడి జరపడంపై నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వారెందుకు దాడి చేశారు? అసలు పద్మావతి ఎవరు? ఆమెపై బన్సాలీ తీస్తున్న సినిమా ఏమిటీ? అది చారిత్రక సినిమానా, చరిత్రను వక్రీకరించే సినిమానా? అసలు వివాదం ఏమిటీ? నిజానికి సమస్త చరిత్రలు సైతం వివాదాస్పదమే. చరిత్రలో నిలిచిపోయేటివి ఎక్కువగా విజేతలు రాసిన లేదా రాయించిన చరిత్రలవడమే అందుకు కారణం. రాజ్‌పుత్ రాజకుటుంబానికి చెందిన ‘పద్మావతి’ క్యారెక్టర్ కేవలం కల్పిత గాధనేది మెజారిటీ చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకం 13–14 శతాబ్దానికి చెందిన శక్తివంతమైన ముస్లిం రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ, చిత్తార్ నేటి చిత్తార్‌గఢ్ రాజు రావల్ రతన్ సింగ్ భార్య పద్మావతి అందచందాల గురించి కథకథలుగా విని ఆమెను మోహిస్తారు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసమే 1303లో చిత్తార్‌గఢ్ రాజ్యంపై దాడి చేసి రాజ్యాన్ని కైవసం చేసుకుంటారు. తన భర్తతో సహా తన రాజకుటుంబీకులు మరణించారన్న వార్త తెలిసి, తోటి అంత:పుర స్త్రీలతో కలసి రాణి పద్మావతి సామూహిక ఆత్మాహుతికి (నాడు సతి, జవహర్‌గా వ్యవహరించేవారు) పాల్పడుతుంది. పద్మావతి తెల్సిందిలా... ఈ కథ ముహమ్మద్ జయసీ 1540లో రాసిన కవిత్వం ద్వారా మొదటి సారి ప్రపంచానికి తెల్సింది. ఆ తర్వాత ఆమె గీతా చిత్రాలు కూడా వెలువడ్డాయి. రమ్య శ్రీనివాస్ రాసిన ‘ది మెనీ లైవ్స్ ఆఫ్ రాజ్‌పుత్ క్వీన్: హిరాయిక్ పార్ట్స్ ఆఫ్ ఇండియా’ అన్న పుస్తకంలో కూడా పద్మావతి గురించి కొంత ప్రస్తావన ఉంటుంది. అయితే పద్మావతి కథ నిజమైనదనడానికి చారిత్రక ఆధారాలేవి దొరకలేదు. ఖిల్జీ లాంటి ముస్లిం రాజును దిక్కరించిన ధీరవనితగా ఆమె కథ మాత్రం ప్రచారంలో ఉంది. రాజ్‌పుత్‌లు బయటి కులాల వారికి పిల్లనివ్వరు, తెచ్చుకోరు. ఆ కుల కట్టుబాటుకు కట్టుబడే పద్మావతి సామూహిక ఆత్మాహుతికి పాల్పడిందన్నది రాజ్‌పుత్‌ల విశ్వాసం. తెగింపు, ధైర్య సాహసాలకు రాజ్‌పుత్‌లు మారుపేరని ‘అమర్ చిత్ర కథలు’ కూడా తెలియజేస్తాయి. అయినా మొగల్ రాజులకు లొంగారు... కాలమాన పరిణామాల్లో రాజ్‌పుత్‌లు కూడా మొగల్స్ రాజులకు లొంగిపోవాల్సి వచ్చింది. అక్బర్ నుంచి ఫారుక్సియర్, అంటే మధ్య 16వ శతాబ్దం నుంచి 18 శతాబ్దం వరకు వారు ఆడ పిల్లలను మొగల్ రాజులకు ఇచ్చారు. వారిచేత మామలు, బావలు అని పిలిపించుకున్నారు. మొగల్ చక్రవర్తులకు వియ్యంకులవడం ద్వారా తమ రాజ్యాలను రక్షించుకోవడమే కాకుండా ఇతర రాజులు తమమై దాడులు జరపకుండా కొంత కాలం నివారించుకోకలిగారు. చరిత్ర గమనంలో రాజ్‌పుత్‌లు టర్కీలు, మొగల్స్ రాజులే కాకుండా మరాఠీలు, పిండారీలు చేతుల్లో కూడా ఓడిపోయారు. ఎలాంటి యుద్ధం చేయకుండానే బ్రిటీష్ పాలకులకు లొంగిపోయారు. అయితే ముస్లింల రాజులకు లొంగకుంగా నిలబడింది తామేనని వారు చెప్పుకుంటారు. పద్మావతంటే బన్సాలీకి ఎంతో ఇష్టం.... సంజయ్ లీలా బన్సాలీకి పద్మావతి కథంటే చచ్చేంత ఇష్టం. అందుకే ఆయన 2008లో పారిస్‌లోని ‘డూ చాట్లెట్’ థియేటర్లో ప్రదర్శించిన ఒపేరాకు దర్శకత్వం వహించారు. పద్మావతిపై 1923లో ప్రెంచ్ కంపోజర్ ఆల్బర్ట్ రసెల్ రూపొందిచన ఒపెరాను బన్సాలీ దర్శకత్వం వహించి తనదైన శైలిలో ప్రదర్శించారు. 2002లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్లో బన్సాలీ తీసిన ‘దేవదాస్’ చిత్రాన్ని చూసి ముగ్ధుడైన పారిస్ ఒపేరా థియేటర్ యజమాని జీన్ లక్ చాప్లిన్ ఆహ్వానం మేరకు బన్సాలీ తొలిసారిగా ఒపేరాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. కరీనా కపూర్‌తో తీయాలకున్న బన్సాలీ... స్థానిక నటీనటులతో పారిస్‌లో ప్రదర్శించిన పద్మావతి ఒపేరాకు మంచి పేరు రావడంతో నాడే హిందీలో పద్మావతి సినిమాను తీయాలనుకున్నారు బన్సాలీ. కరీనా కపూర్‌ను పద్మావతిగా పరిచయం చేయాలనుకున్నారు. గుజారిష్ లాంటి చారిత్రక సినిమాలు బాక్సాఫీసు వద్ద పల్టీకట్టడంతో సినిమాను వాయిదా వేసుకున్నారు. బాజీరావు మస్తాని, గోలియోంకి రాస్లీలా–రామ్‌లీలా సినిమాలు హిట్టవడంతో పద్మావతిని కూడా తెరపైకి ఎక్కించాలనుకున్నారు. చిత్ర నిర్మాణాన్ని ముగించి వచ్చే నవంబర్ 17వ తేదీన విడుదల చేయాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే పద్మావతిపై చిత్రాలు... పద్మావతిపై జస్వంత్ జావరి 1961లో జై చితోడ్ను, మహారాణి పద్మావతి సినిమాను 1964లో తీసి విడుదల చేశారు. పద్మావతిపై మొహమ్మద్ జయసీ రాసిన కవిత్వాన్నే జై చితోడ్లో పాటలుగా ఉపయోగించారు. తొలి చిత్రంలో పద్మావతిగా నిరుపమా రాయ్ నటించగా, తర్వాత చిత్రంలో అనితా గుహ నటించారు. పద్మావతిగా వైజయంతిమాల, ఖిల్జీగా శివాజీ గణేష్ నటించిన ‘చిత్తోర్ రాణి పద్మిణి’ అనే తమిళ చిత్రం 1963లో విడుదలైంది. దీనికి చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించారు. అంతకుముందు 2009లో ‘చిత్తోడ్కీ రాణి పద్మినీ కా జోహుర్’ పేరుతో సోనీ టీవీలో సీరియల్ కూడా వచ్చింది. తమిళ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిల్‌కాగా, జస్వంత్ జావరి దర్శకత్వం వహించిన మహారాణి పద్మావతి సక్సెస్ అయింది. అప్పుడు ప్రభుత్వం సహకరించింది... జస్వంత్ జావరి తీసిన ‘మహారాణి పద్మావతి’ చిత్రానికి నాడు రాజస్థాన్ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. రాజ్‌పుత్‌ల ధైర్య సాహసాలను, తెగింపుకు ఆ సినిమా అద్దం పట్టిదంటూ రాజ్‌పుత్‌లు కూడా సినిమాను ఎంతో ఆదరించారు. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ‘జోద్ అక్బర్’లో కూడా చరిత్రను వక్రీకరించారని, పద్మావతిలో కూడా బన్సాలీ చరిత్రను వక్రీకరిస్తారన్నది రాజ్‌పుత్‌ల అనుమానం. అందుబాటులోవున్న చరిత్ర ప్రకారం పద్మావతి, ఖిల్జీలు ఒకరినొకరు చూసుకోరు. మహారాణి పద్మావతి సినిమాలో మాత్రం చివరలో పద్మావతిని చూసి ఆమె అందానికి ఖిల్జీ మరింత ముగ్ధుడవుతారు. ఇలాంటి కథల మధ్య ఖిల్జీలు, పద్మావతి కలలో కలసుకొని పాటలు పాడుకున్నట్లు బన్సీలీ సినిమా తీస్తున్నారన్నది రాజ్‌పుత్‌ల అనుమానం. అందుకే దాడి చేశారు. అసలు బాధ వేరేనేమో..... ఖిల్జీ, పద్మావతి మధ్య ఎలాంటి డ్రీమ్ సీక్వెన్సీలు లేవంటూ బన్సాలీ బహిరంగంగా ప్రకటించారు. పైగా తాను తీస్తున్నది విషాదాంత చిత్రం కాదని, రాజ్‌పుత్‌లకు చెందిన ఓ ధీరవనిత మనోధైర్యాన్ని స్ఫూర్తిగా చూపిస్తున్నానని చెప్పారు. ‘నేను చనిపోయేంత పిరికిదాన్ని కాదు. నేను శత్రువలకు చిక్కకుండా మంటల్లోకి నడిచిపోయే మరింత ధైర్యం కావాలి. రాజ్‌పుత్‌ల పరువు, ప్రతిష్టలు చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోవాలి’ అంటూ పద్మావతి అగ్నికి ఆహుతవుతూ చెప్పేమాటలను కూడా కొన్నేళ్ల క్రితమే ఒపేరా ప్రదర్శన సందర్భంలో బన్సాలీ వినిపించడం ఆయన స్ఫూర్తిని తెలియజేస్తోంది. చరిత్రలో పద్మావతి ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆమెపై చిత్రం తీస్తే రాజ్‌పుత్‌ల పరువు ఎందుకు పోతుందో అర్థం కాదు. వారి పేరుతో వచ్చిన రాజస్థాన్ ఉన్నంతకాలం చరిత్రలో వారు మిగిలే ఉంటుంది కదా, ముస్లిం రాజుల చేతుల్లో ఓడిపోయామన్న బాధ! -
పద్మావతి పాటలు మొదలయ్యాయి
సంజయ్ లీలా భన్సాలీ అంటే బాలీవుడ్లో రాజమౌళి లాంటి దర్శకుడు. ఆయనేం తీసినా అదో దృశ్యకావ్యం లాగే ఉంటుంది. దేవదాసు, రామ్‌లీలా, బాజీరావు మస్తానీ.. ఇలా చెప్పుకొంటూ పోతే అన్నీ అద్భుతాలే. తాజాగా ఆయన తీస్తున్న మరో భారీ చిత్రం.. పద్మావతి. ఆ సినిమా పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో కూడా మళ్లీ బాజీరావు హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ ఈ సినిమాలో పాటలు పాడుతోంది. దీనికోసం భన్సాలీ ఒక పాట కంపోజ్ చేశారట. ఆ పాట తన కెరీర్లోనే ఓ పెద్ద మైలురాయిలా మిగిలిపోతుందని శ్రేయా చెబుతోంది. ‘‘నా జీవితంలోనే మైలురాయి లాంటి పాటను రికార్డు చేశాను. ఇది మనసుకు పూర్తిగా సంతృప్తినిచ్చే అద్భుతమైన పాట. ఇలాంటి పాటల కోసమే జీవిస్తున్నానా అనిపిస్తోంది. పద్మావతి సినిమా కోసం సంజయ్ లీలా భన్సాలీ అత్యద్భుతమైన కంపోజిషన్స్ ఇచ్చారు. గుండె లోతుల్లోంచి ఈ పాట పాడాను’’ అని శ్రేయా ఘోషల్ చెప్పింది. బాజీరావు మస్తానీ సినిమాలోని ‘దీవానీ మస్తానీ’ పాటకు గాను ఆమెకు బోలెడన్ని అవార్డులు వచ్చి పడ్డాయి. బాజీరావు మస్తానీ సినిమాను భన్సాలీ నిర్మించడంతో పాటు దానికి సంగీతం కూడా ఆయనే అందించారు. Wondering which song! What outstanding compositions Sanjay Bhansali sir has made for #Padmavati.Sang with all heart! https://t.co/KzzCpcap4Z — Shreya Ghoshal (@shreyaghoshal) 11 July 2016