ఇంతటి ఆగ్రహానికి గురికాదగ్గది ఏదీ ఆ సినిమాలో లేదని దాన్ని చూసిన మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. సినిమా చూడకుండానే, సెన్సార్ కాకముందే ప్రదర్శిస్తున్న ఈ అర్థరహిత అసహనం ఎటు దారి తీస్తుంది?
రెండు దశాబ్దాల క్రితం, స్వలింగ సంపర్కసంబంధం గురించి తీసిన ఫైర్ సినిమా చిక్కుల్లో పడింది. అది, మన దేశంలో తీసిన అలాంటి మొట్ట మొదటి సినిమా. మితవాదవర్గానికి చెందిన వారు ఆ సినిమాను ప్రదర్శిం చడానికి వీల్లేదంటూ నిరస నకు దిగారు. ఆ సినిమా నిర్మాతపైన, నటీనటులపైన కోపంతో ఆ యూనిట్ తదుపరి చిత్రం వాటర్ సెట్లను ధ్వంసం చేశారు. అది ‘భారత సంస్కృతికి వ్యతిరేకమై న’దంటూ రాజకీయవేత్తలు ఆ గూండాయిజాన్ని వెనకే సుకొచ్చారు. ఇప్పుడు, సెన్సార్ సర్టిఫికెటైనా లభించని పద్మావతి సినిమాపై కూడా అలాంటి ఆగ్రహాన్నే తిరిగి ప్రదర్శిస్తున్నారు. సినిమాలోని పద్మావతి ప్రచారంలో ఉన్న జానపదగాథల్లోని వ్యక్తే తప్ప, విశ్వసనీయమైన చరిత్రలోని వ్యక్తికాదనీ, ఒకరిని మరొకరుగా పొరబడ రాదనీ గుర్తించడానికి సైతం నిరాకరించేటంత తీవ్ర ఉద్రేకంతో వ్యక్తమౌతున్న ఈ సామూహిక అనుచిత ప్రవర్తనకు నేడు మనం అలవాటుపడిపోయాం.
ఈ దురభిమానులు సినిమాను చూడనైనా చూడ కుండానే తమ తప్పుడు అభిప్రాయాలను వ్యక్తం చేస్తు న్నారు. బహిరంగంగానూ, టీవీల్లోనూ ఆ నటీనటుల ముక్కులను కోస్తామని బెదిరిస్తున్నారు, నిర్మాత, ప్రధాన నటి తలలకు రూ. 10 కోట్ల బహుమతి ప్రకటించారు. రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం తెలివి తక్కువగా అవసరమైన కత్తిరింపులు చేయకుండా ఆ సినిమా విడుదలను అనుమతించరాదని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను కోరింది. కథను చెప్పడంలో సిని మాకు ఉండే కళాత్మకమైన స్వేచ్ఛకూ, వ్యక్తిగత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకూ కూడా వ్యతిరేకమైన అసహనం నేడు సుస్పష్టంగా కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై తీసిన ఎన్ ఇన్‌సిగ్నిఫికేంట్ మ్యాన్ అనే డాక్యుమెంట రీకి సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దానిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, కోర్టు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఉన్న హక్కును ఎత్తి పట్టింది. అయినా అది పద్మావతి వ్యతిరేక బృందాల ఉద్రేకాన్ని చల్లార్చలేకపోయింది.
ఈ అసహనం 15 రోజుల్లోనే పెను దుమారంగా మారింది. గోవాలో జరగనున్న భారత అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన న్యూడ్ (మరాఠీ), ఎస్. దుర్గ (మలయాళం) సినిమాల ప్రదర్శనను సమా చార, ప్రసార మంత్రిత్వశాఖ నిలిపివేస్తున్నట్టు ప్రక టించింది. ఎందుకో కనీసం ఒక్క వాక్యం వివరణనైనా ఇవ్వలేదు. ఈ రెండూ సెన్సార్ సర్టిఫికేట్లతో విడుదల య్యాయి కూడా. చూడబోతే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు సెన్సార్ సర్టిఫికెట్లన్నా, తామే ఏర్పాటు చేసిన జ్యూరీ ఎంపిక అన్నా లెక్క లేన ట్టుంది. దీనికి నిరసనగా జ్యూరీ సభ్యులు వరుసగా చేస్తున్న రాజీనామాల పరంపరగానీ, తామే ఏర్పాటు చేసిన సంస్థలు, ప్యానెళ్లను విలువలేకుండా చేస్తూ ఇష్టా నుసారం చేసిన ఈ నిర్ణయాల పట్ల నిరసనగానీ ఆ మంత్రిత్వశాఖ అంతరాత్మను ఏమాత్రం ఇబ్బంది పెట్టినట్టు లేదనుకుంటా. తగు కత్తిరింపులు లేనిదే పద్మావతి విడుదలకు అనుమతిని ఇవ్వరాదంటూ స్మృతి ఇరానీకి వసుంధరా రాజే రాసిన లేఖలో ఇది స్పష్టంగానే కని పించింది.
ఎలాంటి వివరణా లేకుండానే న్యూడ్, ఎస్. దుర్గ సినిమాలను తొలగించడం కచ్చితంగా నిరంకుశ వైఖరే. అవి రెండూ అంతర్జాతీయంగా ప్రశంసలను, గుర్తింపును పొందినవి. అవి అశ్లీలతను లేదా మహిళల పట్ల అసభ్యతను చూపినవి కావు. ఎస్. దుర్గ చిత్ర నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
పద్మావతి సినిమాను తీసిన వారుగాక మరెవరూ ఇంతవరకూ ఆ సినిమాను చూసిందే లేదు. కొందరు ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకు దాన్ని ప్రద ర్శించి చూపారు. అలా చూసినవారంతా ఆ చిత్రంపై ఇలా మాటల దాడులను, నిరసన ప్రదర్శలను సాగిం చాల్సినది, తలలకు, ముక్కులకు వెలలు కట్టాల్సినది సినిమాలో ఏమీ లేదని అంటున్నారు. ఆందోళనకారు లకు విచక్షణారహితంగా సమయాన్ని, స్థలాన్ని కేటా యిస్తూ మీడియా అగ్నికి ఆజ్యం పోస్తోంది. అందు వల్లనే కావచ్చు నిర్మాతలు మీడియాకు సినిమాలో ఏమి ఉందో తెలియాలని అనుకున్నట్టుంది.
సెన్సార్ బోర్డు ఈ అంశాన్ని అనుమానాస్పద దృష్టితో చూస్తోంది. అది అన్ని వేపులనుంచీ చుట్టి ముట్టివేతకు గురై ఉంది, రాజస్తాన్, యూపీ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా సినిమా చూడని నిరసన కారుల పక్షం వహించాయి, కారణం ఏదైనా కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోంది, నిర్మాతలు ఏది ఏమైనా త్వరగా విడుదల చేయాలని చూస్తున్నారు.
ముందు ఏమి జరగనుందో ఎవరికీ తెలియదు. సినిమాను ‘‘అనుమతించడానికి’’ ముందు బ్లాక్ మెయిల్ చేసి, నిరసన తర్వాత అనుమతించటం జరు గుతుందా? అది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? కర్ణీ సేన ఒక సినిమాకు ప్రచారం లభించేట్టు చేయడం కోసం సంకేతాత్మక నిరసన తెలిపి, నెలరోజులపాటూ రక్షణను కల్పించడానికి అంగీకరించడాన్ని ఇండియా టుడే ఒక స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టింది. దాన్ని మీడియా విస్మరించింది.
- మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment