పద్మావతి వివాదం.. ఊహించని ట్వీట్‌ | Hollywood Actress Tweet on Padmavati Controversy | Sakshi
Sakshi News home page

పద్మావతి వివాదం.. ఊహించని ట్వీట్‌

Published Sat, Nov 18 2017 5:14 PM | Last Updated on Sat, Nov 18 2017 8:43 PM

Hollywood Actress Tweet on Padmavati Controversy - Sakshi - Sakshi

సాక్షి, ముంబై : పద్మావతి చిత్రంపై వివాదం కొనసాగుతుండగా.. బాలీవుడ్‌ నుంచి మద్దతు కరువు కావటం చర్చనీయాంశంగా మారింది. దీపిక ఒంటరి పోరాటం.. భన్సాలీ వాదన ఓవైపు... రాజ్‌పుత్‌ కర్ణి సేన హెచ్చరికలు మరోవైపు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పద్మావతిపై ఊహించని ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

హాలీవుడ్ నటి రూబీ రోస్‌ పద్మావతి చిత్ర వివాదంపై స్పందించింది. దీపిక హాలీవుడ్‌ చిత్రం ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్స్‌ ఆఫ్‌ క్జాండర్‌ కేజ్‌లో రూబీ రోస్‌ కూడా నటించారు. ‘‘నా స్నేహితురాలి విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యా. ఆమె పోరాటానికి హాట్సాఫ్‌. నాకు తెలిసిన ధైర్యవంతమైన మహిళలలో దీపిక ఒకరు’’ అని రూబీ ట్వీట్ చేసింది. దీపిక పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని రూబీ తెలియజేశారు.

ఈ లెక్కన పద్మావతి చిత్ర వివాదం ఖండాంతరాలు దాటిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీపికను డబ్బుల కోసం ఆడే బజారు మహిళ.. శూర్ఫణకగా అభివర్ణిస్తున్నా రాజ్‌పుత్‌ కర్ణి సేన.. ముక్కు, పీక కోస్తామంటూ హెచ్చరిస్తున్నా... దీపిక మాత్రం హెచ్చరికలపై అస్సలు వెనక్కితగ్గకుండా తన అభిప్రాయం చెబుతున్నారు. మరోవైపు సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవటంపై ప్రస్తుతం మరో వివాదం  మొదలయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement