
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. హాలీవుడ్ దర్శకనటులు సైతం ఈ కళాఖండాన్ని చూసి అబ్బురపడిపోయారు. అయితే హాలీవుడ్ నటి మిన్నీ డ్రైవర్ ఇంకా ఆర్‌ఆర్‌ఆర్ మేనియా నుంచి బయటకు రాలేకపోతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండియన్ సినిమా గురించి ఇలా మాట్లాడింది.
మా ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ
ఆర్‌ఆర్‌ఆర్ నా ఫేవరెట్ సినిమా. నా కుమారుడితో కలిసి ఈ సినిమా చూడటమంటే నాకెంతో ఇష్టం. మాకు ఇది ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. అందుకే మూడు నెలలకోసారి కచ్చితంగా ఈ చిత్రాన్ని చూస్తుంటాం. ఎంతో అందమైన, అద్భుతమైన చిత్రాల్లో ఇదీ ఒకటి అని చెప్పుకొచ్చింది.
భారత్‌కు రావాలనుంది..
ఇండియన్ చెఫ్ రోమీ గిల్‌తో స్నేహం గురించి మాట్లాడుతూ.. రోమీ నాకు మంచి స్నేహితురాలు. తను చాలా బాగా వంట చేస్తుంది. భారత్‌కు వచ్చి, ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలను చూడాలనుందని తనతో తరచూ అంటూ ఉంటాను అని తెలిపింది. కాగా మిన్నీ డ్రైవర్.. ఇటీవలే ద సెర్పంట్ క్వీన్ రెండో సీజన్‌లో నటించింది. ఇందులో క్వీన్ ఎలిజబెత్‌గా యాక్ట్ చేసింది. ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లయన్స్‌గేట్ ప్లేలో అందుబాటులో ఉంది.
చదవండి: Bigg Boss 8 Telugu: వీటి గురించి ఎవరు మాట్లాడుకోరేం..
Comments
Please login to add a commentAdd a comment