సాక్షి, బెంగళూరు : పద్మావతి సినిమాలో నటించిన నటీనటులు ప్రాణహాని బెదిరింపులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయా కుటుంబాలకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్ర పోషించిన దీపిక పదుకొనేకు పలు సంఘాల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో బెంగుళూరులోని దీపికా పదుకొణె కుటుంబానికి కర్ణాటక పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
పద్మావతి సినిమాలో నటించినందుకు దీపికా తల నరికి తెచ్చిన వారికి రూ.10 కోట్లు ఇస్తానంటూ హర్యాణాకు చెందిన బీజేపీ నేత సూరజ్‌పాల్‌తో పాటు పలు సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు జేసీ నగర సమీపంలోని నందిదుర్గలో నివసిస్తున్న దీపికా కుటుంబానికి భద్రత అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హోం మంత్రి రామలింగారెడ్డి ఆదేశాల మేరకు, దీపిక తల్లిదండ్రులు, సోదరి నివసిస్తున్న ఉడ్స్ వేల్ అపార్ట్‌మెంట్ వద్ద పోలీసుల భద్రత ఏర్పాటైంది. ఒక ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను మోహరించారు. బెంగళూరులో మల్లేశ్వరంలోని 18వ క్రాస్‌లో ఉంటున్న దీపికా పదుకొణె నాయనమ్మ ఇంటి వద్ద కూడా పోలీసులను మొహరించారు.
దేశంలో ప్రస్తుతం విదాస్పదంగా మారిన సినిమా పద్మావతి. ఇప్పటికే ఈ సినిమాను పలు ఉత్తరాది రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించగా, మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే బాటలో నడవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment