సాక్షి, సినిమా : బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం పద్మావతిని తెరకెక్కిస్తున్నాడు. వారం క్రితం దీపికా పదుకునే ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో పాత్రను పరిచయం చేసింది.
చిత్తూరు మహారాజు మహారావల్ రతన్ సింగ్ పాత్రలో, చిత్రంలో దీపిక భర్తగా నటిస్తున్న షాహిద్ కపూర్ పోస్టర్లను వదిలారు. భారీ గడ్డంతో రాజు అవతారంలో ఛాక్లెట్ బోయ్ షాహిద్ లుక్కు సూపర్బ్‌గా ఉంది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశంలో కత్తిని ఒర నుంచి బయటకు తీయకుండా.. సీరియస్‌గా చూస్తున్న పోస్టర్ బాగుంది.
మహారావల్ పాత్ర కోసం తాను చాలా శ్రమించాల్సి వచ్చిందని ఓ సందర్భంలో షాహిద్ చెప్పటం తెలిసిందే. డిసెంబర్ 1న ‘పద్మావతి’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.