
సాక్షి, ముంబై: చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాపై వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళన నిర్వహిస్తుండటంతో డిసెంబర్ 1న రావాల్సి ఉన్న ఈ సినిమా విడుదల ఆగిపోయింది. మరోవైపు ‘పద్మావతి’ సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా భన్సాలీ తలకు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ వెలగట్టింది. భన్సాలీ తలను నరికి తెచ్చిస్తే రూ. 10 కోట్లు ఇస్తామంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్య చేసింది.
ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ ఆందోళనలపై మరోసారి స్పందించింది. ‘పద్మావతి’ సినిమాను వివాదాస్పదం చేయడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. సినిమాలో ఎక్కడా అభ్యంతరకర సన్నివేశాల్లేవని ఆమె స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందని, కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment