
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి చిత్ర వివాదంపై మిస్ వరల్డ్-2017 మానుషి ఛిల్లర్ స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె చిత్ర యూనిట్‌కు తన మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
అభ్యంతరాలు లేవనెత్తుతూ కొందరు చిత్ర విడుదలను అడ్డుకుంటున్నారు. దీపిక పదుకొనే కేవలం యాక్టరేనన్న విషయం నిరసనకారులు గుర్తుంచుకోవాలి. నజరానాలు ప్రకటించటం సరికాదు. ఆమెకు నా మద్దతు ప్రకటిస్తున్నా అని ఆమె చెప్పారు. కాగా, ప్రధానిని కలిసిన మరుసటి రోజే మానుషి తన అభిప్రాయం చెప్పటం గమనించదగ్గ విషయం.
Comments
Please login to add a commentAdd a comment