
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి చిత్రంపై మరోసారి రాజ్‌పుత్ కర్ణి సేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ దావుద్ ఇబ్రహీం భాగస్వామిగా ఉన్నాడంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో గత రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన దీపికపై కూడా మండిపడ్డారు.
ఈ చిత్రంలో ముంబై మారణహోమం ప్రధాన సూత్రధారి దావూద్ హస్తం కూడా ఉంది. అతను దుబాయ్ నుంచి డబ్బులు పంపిస్తే.. వాటితో భన్సాలీ పద్మావతిని తీశాడు. కరాచీ నుంచి నాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి అని కల్వి తెలిపారు. ఇక చిత్రం విడుదలైన తీరుతుందంటూ దీపిక పడుకొనే తనకు సవాల్ విసరటంపై ఆయన ధ్వజమెత్తారు.
చిత్రాన్ని పద్రర్శించకుండా ఆటలాడుతున్నారని.. ఇంతలో సెన్సార్ గొడవ... చిత్ర విడుదల వాయిదా అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపారని ఆయన అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో సినిమా థియేటర్లకు రాబోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
దీపికను తగలబెడితే కోటి
పద్మావతి చిత్రంపై మరో నజరానాను ప్రకటించారు. ఈ చిత్ర హీరోయిన్ దీపికను సజీవంగా తగలబెట్టినవారికి కోటి రూపాయల నజరానా ఇస్తామని అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం యువ నేత భువనేశ్వర్ సింగ్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. పద్మావతి మహారాణి చేసిన త్యాగం గురించి అర్థం చేసుకునేంత తెలివి దీపికకు లేదు. అందుకే అలాంటి వాళ్లు బతకటానికి వీల్లేదు అంటూ భువనేశ్వర్ తెలిపారు. ఇంతకు ముందు హర్యానా బీజేపీ చీఫ్ మీడియా కో ఆర్డినేటర్ సూరజ్ పాల్ అము.. భన్సాలీ, దీపిక తలలపై 10 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment