లండన్ : పద్మావతి చిత్ర విషయంలో ఆసక్తికరమైన అప్ డేట్. బ్రిటన్‌లో ఈ చిత్ర విడుదలకు అనుమతి లభించింది. డిసెంబర్ 1న ఈ చిత్రం యూకేలో విడుదల అవుతున్నట్లు బ్రిటీష్ బోర్డు ఆఫ్ ఫిల్మ్స్ క్లాసిఫికేషన్(బీబీఎఫ్‌సీ) ప్రకటించింది.
తాజాగా నిన్న(నవంబర్ 22న) సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సింగిల్ కట్ లేకుండా విడుదల కాబోతుండటం విశేషం. ఈ మేరకు బీబీఎఫ్‌సీ తన అఫీషియల్ వెబ్ సైట్ లో పేర్కొంది. చిత్ర నిడివి 164 నిమిషాలుగా పేర్కొంటూ 12A సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది.
ఓవైపు భారత్‌లో రాజ్‌పుత్ కర్ణి సేన నిరసనలు, సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయటంలో తాత్సారం నడుమ పద్మావతి చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. 190 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించగా.. దీపిక పదుకొనే, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.
విడుదల చెయ్యట్లేదు.. నిర్మాతలు
అయితే చిత్రాన్ని యూకేలో విడుదల చేసేందుకు మేకర్లు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. భారత్‌లో కూడా విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాకే ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment