censor certificate
-
పుష్ప 2: ఐదు కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డ్.. నిడివి ఎంతంటే?
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు, నీయవ్వ తగ్గేదేలె.. ఈ డైలాగ్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోయాయ్. మూడేళ్ల తర్వాత మరోసారి పుష్పరాజ్ థియేటర్లలో పూనకం తెప్పించేందుకు రెడీ అయ్యాడు. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 మూవీ ఆరు భాషల్లో డిసెంబర్ 5న విడుదల కానుంది. ఏకంగా 12 వేల థియేటర్లలో రిలీజవుతోంది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. అందరూ అనుకున్నట్లుగానే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో సినిమా రాబోతోంది. ఇకపోతే సెన్సార్ బోర్డ్.. సినిమాలో ఐదు విషయాల్లో మార్పుచేర్పులు సూచించింది. ఓ బూతుపదాన్ని మ్యూట్ చేయమనగా వెంకటేశ్వర అనే దేవుడి పేరును భగవంతుడిగా మార్చమంది. సినిమాలో విలన్ కాలిని హీరో నరకగా అది గాల్లో ఎగిఏర సీన్, అలాగే నరికిన చేతికి హీరో పట్టుకునే సన్నివేశాలను సీజీతో కవర్ చేయమని సూచించింది. ఇకపోతే పుష్ప 2 గ్రాండ్ ఈవెంట్ నవంబర్ 29న ముంబైలో జరగనుంది. ఆ మరుసటి రోజు అంటే శనివారం నాడు చిత్తూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. #Pushpa2TheRule - 3 Hrs 20 Min 38 Secs ⏳🔥🔥#Pushpa2TheRule #Pushpa@alluarjun @aryasukku @pushpamovie @mythriofficial#Pushpa2 #AlluArjun #Sukumar pic.twitter.com/oaHuJwam60— Thyview (@Thyview) November 28, 2024చదవండి: తాళి, గాజులు, సింధూరం.. అన్నీ అమ్మాయికే! మరి నాకు..? -
కంగనా 'ఎమర్జెన్సీ'కి లైన్ క్లియర్! అందుకు ఓకే అంటేనే..
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు త్వరలోనే లైన్ క్లియర్ కానుంది. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)ను ఇటీవలే ఆదేశించింది. సెప్టెంబర్ 25లోగా ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. తాజాగా ఈ అంశంపై బుధవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది.సెప్టెంబర్ 30కి విచారణ వాయిదామీ దగ్గర ఏదైనా గుడ్‌న్యూస్ ఉందా? అని జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పోనివాలాలతో కూడిన ధర్మాసనం సీబీఎఫ్‌సీని అడిగింది. సినిమాలో కొన్ని కట్స్ సూచించామని, అవి అమలు చేస్తే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని, సినిమా థియేటర్లలో విడుదల చేసుకోవచ్చని సీబీఎఫ్సీ తెలిపింది. దీంతో నిర్మాణసంస్థ జీ స్టూడియోస్.. తమకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని కోరింది. బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 30కు వాయిదా వేసింది. సోమవారం అయినా ఎమర్జెన్సీ సినిమాకు చిక్కులు తొలగిపోతాయేమో చూడాలి!ఎమర్జెన్సీఎమర్జెన్సీ మూవీ విషయానికి వస్తే.. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ 2023 నవంబర్ 24న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల -
Emergency: కంగనాకు బాంబే హైకోర్టు షాక్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ) సినిమాకు ఎదురుదెబ్బ తగలింది. ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)ని ఆదేశించలేమని బాంబే హైకోర్టు బుధవారం వెల్లడించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని బీపీ కొలబవాలా, ఫిర్దౌస్ పూనావాలాతో కూడిన బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమర్జెన్సీ చిత్ర సహ నిర్మాత జీ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారనను 19వ తేదీకి వాయిదా వేసింది.కాగా ఎమర్జెన్సీ చిత్రం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత కాలం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం. ముఖ్యంగా 1975లో ఆమె విధంచిన ఎమర్జెన్సీ కాలాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో కంగనా నటించడమే కాకుండా, దర్శకత్వం, నిర్మతగానూ వ్యవహరించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. అయితే సినిమాను వ్యతిరేకిస్తూ అనేక సిక్కు సంస్థలు ఆందోళనలు చేయడంతో వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎమర్జెన్సీ విడుదలను నిలిపివేయాలంటూ సిక్కు సంస్థలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సిక్క సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి వ్యతిరేకంగా జబల్పూర్ హైకోర్టులో(మధ్యప్రదేశ్) పిటిషన్ దాఖలు చేసి, దాని ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరారు. దానిని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ‘ఎమర్జెన్సీ’ని విడుదల చేయాలని, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కంగనా, చిత్ర సహ నిర్మాణ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. . ఈ క్రమంలోనే తాజాగా తీర్పు వెలువడింది. -
సెన్సార్ U సర్టిఫికెట్ పొందిన వ్యూహం మూవీ
-
Vyuham: ఆర్జీవీ వ్యూహానికి తొలగిన అడ్డంకులు
రాం గోపాల్ వర్మ ‘వ్యూహం’ రిలీజ్‌కు అడ్డంకులు తొలిగాయి. సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ విషయాన్ని ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్వయంగా పంచుకున్నారు. ఈ నెల 29వ తేదీన సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారాయన. ఇక సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించడంపై వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్ అంటూ ఎక్స్‌లో సందేశం ఉంచారాయన. BAD NEWS for BAD GUYS 💪 VYUHAM censor CERTIFICATE 🙌 DECEMBER 29 th in THEATRES 😌 pic.twitter.com/LBBKAt977s — Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2023 వర్మ డైరెక్షన్లో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. ఈ సినిమాను అడ్డుకునేందుకు కొందరు విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ సైతం రాశారు. ఆ సమయంలో ఆర్జీవీ తీవ్ర స్థాయిలోనే స్పందించారు. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని ఛాలెంజ్‌ను స్వీకరించారాయన. ఇదీ చదవండి- ‘వ్యూహం’ ఏ పార్టీకి చెందింది కాదు.. కేవలం.. : ఆర్జీవీ -
సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!
డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ 'సలార్'. పలుమార్లు వాయిదాపడ్డ ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. కొన్నిరోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేయగా.. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు సెన్సార్ రిపోర్ మాత్రం.. అంచనాలు పెంచేలా కనిపిస్తోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!) డిసెంబరు 1 ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇందులో ప్రభాస్ లేట్ ఎంట్రీతో పాటు యాక్షన్ తప్పితే పంచ్ డైలాగ్స్ లాంటివి లేకపోవడంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే. దీంతో రాబోయే వీకెండ్.. ప్రభాస్ మాత్రమే ఉండేలా ఓ యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. దీనికి తోడు 'సలార్' సెన్సార్ పూర్తయిందనే న్యూస్ వైరల్ అయిపోయింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం 'సలార్' మూవీ నిడివి.. 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లు అని తెలుస్తోంది. అలానే 'A' సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అంటే 18 ఏళ్ల నిండని వాళ్లు.. ఈ మూవీ చూడటం కుదరదు. అదే టైంలో సినిమాలోని ప్రభాస్ ఎంట్రీ కూడా అరగంట తర్వాతే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. తొలుత అరగంట పాటు కన్సర్ ప్రపంచాన్ని.. జగపతిబాబు-పృథ్వీరాజ్ పాత్రల్ని ఎష్టాబ్లిష్ చేస్తారని సమాచారం. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
'ఆదిపురుష్' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ కాస్త ఎక్కువే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ చిత్రం.. 'ఆదిపురుష్'. ఈ నెల 16న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.ఇప్పటికే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు (U) సర్టిఫికెట్ జారీ చేసింది. (ఇదీ చదవండి: వరుణ్, లావణ్య త్రిపాటి మధ్య ప్రేమ ఎలా మొదలైందంటే..!) ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు ఉంది. ఈ మధ్య టాలీవుడ్లో ఎక్కువ రన్టైమ్తో చాలా సినిమాలు తెరకెక్కాయి. కంటెంట్ బాగుంటే ఎన్ని గంటలున్నా సినిమా సూపర్ హిట్టే. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమాను కొన్న పీపుల్స్ మీడియా సంస్థ ఏరియాల వారిగా థియేట్రికల్ రైట్స్‌ను అమ్మడం ఇప్పటికే ప్రారంభించింది. నైజాం రైట్స్ దిల్ రాజు కాకుండా మైత్రీ మూవీస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. సుమారు రూ. 60 కోట్లకు నైజాం ఏరియా రైట్స్‌ను మైత్రీ మూవీస్‌కు పీపుల్స్ మీడియా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. (ఇదీ చదవండి: అప్పుడు లడ్డూలా ఉండేదాన్ని: ప్రముఖ నటి) -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’
ఆడియెన్స్ సినిమాలను చూసే ధోరణి మారిపోయింది. ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జాయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. . ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో అన్ని కారెక్టర్లను చూపించారు. -
పఠాన్ మూవీ రన్ టైం లాక్.. ‘బెషరమ్ రంగ్’ పాటకు 3 సెన్సార్ కట్స్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్. విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రెడీ అయ్యింది. హై వొల్టేజ్ యాక్షన్ డ్రామాగా పఠాన్ జవవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాకు బోర్డు షాకిచ్చిన సంగతి తెలిసిందే. పఠాన్‌కు యూ/ఏ సర్టిఫికేట్ కావాలంటే తాము సూచించిన విధంగా మార్పులు చేసుకురమ్మని మూవీ టీంను ఆదేశించారు సెన్సార్ బోర్డు సభ్యులు. పలు మార్పుల అనంతరం రెండోసారి సెన్సార్‌కు వెళ్లిన ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. చదవండి: అమలాపాల్‌కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్ సంఘటన! అయితే ఈ చిత్రంలో మొత్తం 11పైగా పలు అభ్యంతకర సన్నివేశాల సెన్సార్ కట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వివాదంలో నిలిచిన బెషరమ్ రంగ్ పాటలో దీపికాకు చెందిన 3 క్లోజప్ షాట్స్‌ను తొలగించినట్లు సమాచారం. అలా పలు కట్స్ అనంతరం ఆ మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసిందట. ఫైనల్‌గా మూవీ నిడివి 146.16 నిమిషాలు(2 గంటల 26 నిమిషాల 16 సెకన్లు) లాక్ అయ్యింది. కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు. ఇందులో షారుక్ గూఢచారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని -
‘పుష్ప’ సెన్సార్ పూర్తి.. ఇక తగ్గేదేలే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ చిత్రం ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక దాంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. ఇక ‘పుష్ప’ ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12న హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక తాజాగా విడుదలైన సమంత ఐటం సాంగ్ తన అభిమానులను అలరిస్తుంది. -
హారర్ ఆట
నూతన నటీనటులతో పీబీ లింగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాతో ఆట’. విఘ్నేష్ ధనుష్ సమర్పణలో శుక్లాంబరధరం సినీ క్రియేషన్స్‌పై బి.ఎల్. బాబు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా బి.ఎల్. బాబు మాట్లాడుతూ– ‘‘నాతో ఆట’ ఒక హారర్ చిత్రం. మంచి కథతో యూత్‌కి కావాల్సిన అన్ని అంశాలతో నిర్మించాం. మా చిత్రాన్ని మోహిత్ ఫిలిమ్స్ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. -
సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది!
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’తో థియేటర్స్‌లో సందడి చేసేవారు అనుష్క అండ్ టీం. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హెమంత్ మధుకర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: నటుడు సూర్యకు గాయాలు..!) ‘మా రెండు చిత్రాలు తెలుగులో నిశ్శబ్దం, సైలెన్స్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా చూశాక బోర్డు సభ్యుల స్పందన చూసి చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను తొలుత థియేటర్లోనే విడదుల చేయాలని సలహా ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు’ అంటూ హేమంత్ మధుకర్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడి ట్వీట్ ఆసక్తిరేపుతోంది. ఇక షూటింగ్‌లకు, థియేటర్లకు అనుమతుల్వివ్వాలని టాలీవుడ్ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలో విడుదల చేసే ప్రక్రియను కొన్నిరోజుల పాటు నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. (బన్నీ సినిమాలో యాంకర్ సుమ!) Both our films #nishabdham Telugu and #silence given U/A censor certificate and I am overwhelmed by the response of the #cencorboard panel members and my sincere thanks to them for there advice to release the film first in theatre 🙏 pic.twitter.com/bIZTOvjY7q — Hemantmadhukar (@hemantmadhukar) May 26, 2020 ‘మా చిత్రం ‘నిశ్శబ్దం’ విషయంలో మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. చాలా కాలం పాటు అందుకు పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాము. అప్పుడు అదే బెస్ట్ అని అనుకుంటాము’ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పట్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. థియేటర్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతే ‘నిశ్శబ్దం’ విడుదలపై ఆలోచించాలని చిత్రబృందం భావిస్తుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సెన్సార్ పూర్తి.. ఇక సంక్రాంతికి సంబరాలే
సాక్షి, హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకొంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బృందం... యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ‘సెన్సార్ పూర్తయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ సంక్రాంతికి భారీ సంబరాలతో మేం సిద్ధమవుతున్నాం. పండుగ సరదాల కోసం మేం మిమ్మల్ని మీ కుటుంబంతో సహా థియేటర్లకు ఆహ్వానిస్తున్నాం. డోన్ట్ మిస్’ అంటూ గీతా ఆర్ట్స్ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. అయితే, వినూత్నంగా రిలీజ్ చేసిన సెన్సార్ సర్టిఫికేట్ పోస్టర్లోనూ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ వెల్లడించలేదు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే, కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో, తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లోనూ రిలీజ్ డేట్ లేదు. జస్ట్ సంక్రాంతి రిలీజ్ అని మాత్రమే మెన్షన్ చేశారు. దీంతో విడుదల తేదీపై కొంత సందిగ్ధం నెలకొందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ‘మ్యూజికల్ కాన్సెర్ట్’ (ప్రీ రిలీజ్ వేడుక) జనవరి 6వ తేదీన యుసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించి కర్టెన్ రైజర్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో పోతన భాగవతంలో రచించిన ‘అల వైకుంఠపురములో..’ పాటను గాయనీమణులు ఆలపించారు. చదవండి: అల.. వైకుంఠపురములో.. ‘దోశ స్టెప్పు’ -
వర్మ సినిమాకు లైన్ క్లియర్
రాంగోపాల్ వర్మ వివాదస్పద చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’విడుదలకు మార్గం సుగుమమైంది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో రేపు(గురువారం) చిత్రం విడుదల కానుంది. విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో చిత్ర డైరెక్టర్ సిద్దూ, నిర్మాత నట్టి కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివాదస్పదమైన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇస్తుందని, అదేవిధంగా విడుదల ఆపాలంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా ఈ పిటిషన్లపై సెన్సార్ బోర్డు, చిత్ర యూనిట్ కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు విన్న హైకోర్టు రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్‌కు సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికేట్‌ను అందజేశారు. దీంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ రావడంపై రాంగోపాల్ వర్మ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్ర విడుదలను ఆపాలనుకున్న వాళ్లుకు బ్యాడ్ న్యూస్. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ 12న చిత్రం విడుదల కానుంది. కొందరు జోకర్లు, కన్నింగ్ వ్యక్తులు సినిమా విడుదలను ఆలస్యం చేసినప్పటికీ భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్చను ఆపలేకపోయారు’ అంటూ ట్వీట్ చేశాడు. BAD NEWS FOR EVERYONE who tried to stop AMMA RAJYAMLO KADAPA BIDDALU All issues of Censor and Cases sorted..Con men and Jokers can try delaying tactics but can’t stop constitution guaranteed freedom of expression ..Film releasing tomorrow Dec 12th as per schedule 😎 Here’s CC💋💋 pic.twitter.com/NrKxtQEkzs — Ram Gopal Varma (@RGVzoomin) December 11, 2019 -
వర్మపై కేఏ పాల్ కోడలి ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి సోమవారం సీసీఎస్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ప్రమోషన్లో భాగంగా తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి వర్మ వాడుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తాము మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి దిగిన ఫోటోను వర్మకు తాము సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టు మార్ఫింగ్ చేసి పోస్టు చేశారని, తమ అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా ఇష్టానుసారం తమపై ప్రచారం చేస్తున్న వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. వర్మ తన ఖాతాలో పోస్టు చేసిన మార్ఫింగ్ ఫొటోను తొలగించాలని డిమాండ్ చేశారు. ఐపీసీ 469 సెక్షన్ కింద వర్మపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టు చేసిన వర్మ ఐపీ నెంబర్ కోసం ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థకు పోలీసులు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొందరు రాజకీయ నాయకుల నేపథ్యంలో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పేరుతో వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ వివాదాస్పద చిత్రంపై కేఏ పాల్ మండిపడుతూ.. సినిమాను విడుదల చేయొద్దంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే తాజాగా.. ఈ మూవీకి సెన్సార్ క్లియరెన్స్ లభించింది. దీంతో వర్మ సెన్సార్ సర్టిఫికేట్‌ను కేఏ పాల్ చేతుల మీదుగా అందుకుంటున్నట్లు ఓ మార్ఫింగ్ ఫోటోను తన ట్విటర్లో షేర్ చేశారు. -
వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కేఏ పాల్
ముంబై: ఏం చేసినా వివాదంతో ప్రారంభమై.. వివాదంతో ముగిసి..సెన్సేషన్ కావడం ఒక్క రామ్ గోపాల్ వర్మకే సాధ్యం. తాజాగా ఆయన నిర్మించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు ముందే ఎంత వివాదాస్పదం అవుతున్నదో తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొందరు రాజకీయ నాయకుల నేపథ్యంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు పేరుతో వర్మ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ వివాదాస్పద చిత్రంపై కేఏ పాల్ మండిపడుతూ.. సినిమాను విడుదల చేయొద్దంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే తాజాగా.. ఈ మూవీకి సెన్సార్ క్లియరెన్స్ లభించింది. దీంతో వర్మ సెన్సార్ సర్టిఫికేట్‌ను కేఏ పాల్ చేతుల మీదుగా అందుకుంటున్నట్లు ఓ మార్ఫింగ్ ఫోటోను తన ట్విటర్లో షేర్ చేశాడు. అయితే ఇప్పుడు వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోలో వర్మ మార్క్ మార్ఫింగ్ కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వరుస వివాదాల నేపథ్యంలో మూవీ టైటిల్‌ను కూడా మార్చిన సంగతి తెలిసిందే. కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్‌ను కాస్త... అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా మార్చారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 12న సినిమాని విడుదల చేస్తున్నట్లు ఇటీవలే వర్మ సోషల్ మీడియాలో ప్రకటించాడు. చదవండి: వర్మ మూవీకి లైన్ క్లియర్.. ఆ రోజే రిలీజ్..! -
జీవీ చిత్రానికి సెన్సార్ ప్రశంసలు
సామాజిక సేవాభావం కలిగిన అతి కొద్ది మంది నటుల్లో జీవీ.ప్రకాశ్‌కుమార్ ఒకరు. నిజ జీవితంలోనే కాదు తన చిత్రాల్లోనూ సామాజికపరమైన అంశాలు ప్రతిభించాలని కోరుకునే నటుడు. అలాంటి జీవీకి నాచ్చియార్ తరువాత మంచి సక్సెస్ పడలేదు. తాజాగా ఐంగరన్ చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. నటి మహిమా నంభియార్ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని కామన్‌మెన్ పిక్చర్స్ పతాకంపై పి.గణేశ్ నిర్మించారు. ఈటీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రవిఅరసు తెరకెక్కించిన చిత్రం ఐంగరన్. నిజానికి ఐంగరన్ చిత్రం చాలా కాలంగా నిర్మాణ కార్యక్రమాల్లో ఉంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విశేషం ఏమిటంటే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు మంచి కథా చిత్రం అని ప్రశించించారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపి తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఐంగరన్ నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ గత చిత్రాలకు భిన్నంగా వేరే కోణంలో ఉంటుందని దర్శకుడు రవిఅరసు పేర్కొన్నారు. ఇందులో ఆయన యాక్షన్ కోణాన్ని కూడా చూస్తారని చెప్పారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల దర్శకుడు ఏఆర్.మురుగదాస్ చేతుల మీదగా విడుదల చేయగా కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల నుంచి అత్యధికంగా లైక్స్ వచ్చాయని తెలిపారు. అంతే కాదు సినీవర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. ఐంగరన్ చిత్రం కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జెర్సీ’
నేచురల్ స్టార్ నాని హీరోగా మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్లకు మంచి స్పందన రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జెర్సీకి క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమాలో నాని 36 ఏళ్ల వ్యక్తిగా ఓ కుర్రాడికి తండ్రిగా నటిస్తున్నాడు. కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ నానికి జోడి నటిస్తోంది. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘యాత్ర’
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ యాత్ర. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు మహి వీ రాఘవ్ దర్శకుడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్‌కు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. నిజ జీవిత సంఘటలన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్‌ను జారీ చేశారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజా రెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. సుహాసిని, అనసూయ, రావూ రమేష్, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
‘నన్ను దోచుకుందువటే’ సెన్సార్ పూర్తి
‘సమ్మోహనం’ సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో తన తదుపరి సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ సర్టిఫికెట్ పొందిన ‘నన్ను దోచుకుందువటే’ మూవీని సెప్టెంబర్‌ను 21న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.సుధీర్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతమందిస్తున్నారు. .@isudheerbabu- @nabhanatesh's #NannuDochukunduvate censored with clean 'U' & got raving reception from the censor board members!! @rsnaidu77 @ajaneeshb @sbpoffl_ #NannuDochukunduvateOnSep21 pic.twitter.com/mXfjojKSnH — BARaju (@baraju_SuperHit) September 14, 2018 -
అజ్ఞాతవాసి.. ఓ పనైపోయింది
సాక్షి, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మొత్తానికి సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. యూ బై ఏ సర్టిఫికెట్ తో చిత్రం లైన్ క్లియర్ క్లియర్ చేసుకుంది. జనవరి 10వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో.. అంతకు ముందు రోజు అంటే 9వ తేదీన యూఎస్‌లో ప్రీమియర్ షో పడిపోనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు అగ్రహీరో వెంకటేష్ కూడా ఓ పాత్రలో మెరవబోతున్నారనే టాక్ ఉంది. Power Star Pawan Kalyan’s #Agnyaathavaasi censored with ‘UA’ Directed by #TrivikramSrinivas Produced by S. Radha Krishna (chinababu) under @haarikahassine Creations Grand Release on 10th January (US Premieres 9th Jan)#AgnyaathavaasiOnJan10 pic.twitter.com/bJcKvQC0wU — BARaju (@baraju_SuperHit) 1 January 2018 -
రిలీజ్‌కు అనుమతి.. కానీ, విడుదల చెయ్యరంట!
లండన్ : పద్మావతి చిత్ర విషయంలో ఆసక్తికరమైన అప్ డేట్. బ్రిటన్‌లో ఈ చిత్ర విడుదలకు అనుమతి లభించింది. డిసెంబర్ 1న ఈ చిత్రం యూకేలో విడుదల అవుతున్నట్లు బ్రిటీష్ బోర్డు ఆఫ్ ఫిల్మ్స్ క్లాసిఫికేషన్(బీబీఎఫ్‌సీ) ప్రకటించింది. తాజాగా నిన్న(నవంబర్ 22న) సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సింగిల్ కట్ లేకుండా విడుదల కాబోతుండటం విశేషం. ఈ మేరకు బీబీఎఫ్‌సీ తన అఫీషియల్ వెబ్ సైట్ లో పేర్కొంది. చిత్ర నిడివి 164 నిమిషాలుగా పేర్కొంటూ 12A సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. ఓవైపు భారత్‌లో రాజ్‌పుత్ కర్ణి సేన నిరసనలు, సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయటంలో తాత్సారం నడుమ పద్మావతి చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. 190 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించగా.. దీపిక పదుకొనే, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. విడుదల చెయ్యట్లేదు.. నిర్మాతలు అయితే చిత్రాన్ని యూకేలో విడుదల చేసేందుకు మేకర్లు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. భారత్‌లో కూడా విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాకే ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేశారు. -
పద్మావతి ఎఫెక్ట్.. సల్మాన్‌కీ కష్టాలు తప్పవా?
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి సెన్సార్ సర్టిఫికేషన్ వివాదం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సెన్సార్ నిబంధనల కారణంగా చిత్రం ఖచ్ఛితంగా పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు పాత నిబంధనలను తిరగదోడిన సీబీఎఫ్సీపై బాలీవుడ్ నిర్మాతలు మండిపడుతున్నారు. చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ కావాలంటే మేకర్లు 68 రోజుల ముందుగానే సెన్సార్ బోర్డు వద్ద దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఉంది. అయితే కొన్నేళ్లుగా ఆ రూల్‌ను బోర్డు పక్కనపడేసింది. ఇప్పుడు పద్మావతి చిత్రం వివాదాల్లో నానుతున్న నేపథ్యంలో అనూహ్యంగా మళ్లీ ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీనికితోడు మేకర్లు అందించిన డాక్యుమెంట్లు అసంపూర్తిగా ఉన్నాయంటూ సర్టిఫికెట్ జారీచేయకుండా వెనక్కి తిప్పి పంపించి వేసింది. ఇప్పుడు ఆ ప్రభావం సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం టైగర్ జిందా హై చిత్ర విడుదలపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సల్మాన్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కొద్దికాలంగా బాలీవుడ్ సినిమాలు కేవలం 22 రోజుల ముందుగానే సర్టిఫికెట్ కోసం సెన్సార్‌కు వెళ్తున్నాయి. కానీ, పాత నిబంధన మళ్లీ తెరపైకి రావటంతో ఇంత తక్కువ టైంలో టైగర్ జిందా హై చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రావటం అనుమానంగా కనిపిస్తోంది. దీంతో సెన్సార్ తీరుపై బాలీవుడ్ నిర్మాతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో 68 రోజుల పద్ధతిని పాటించి విడుదలైన చిత్రాల జాబితాను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో సర్టిఫికెట్ జారీ విషయంలో పెనువివాదాలే చోటు చేసుకున్నాయి. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించిన మెసేంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి ఒక్క రోజు ముందుగానే సర్టిఫికెట్ ఇవ్వటం.. అది కాస్త తీవ్ర విమర్శలకు దారితీయటంతో అప్పుడు చైర్‌పర్సన్‌గా ఉన్న లీలా శామ్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. -
సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజా ది గ్రేట్'
చాలా రోజుల విరామం తరువాత సీనియర్ హీరో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా రాజా ది గ్రేట్. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. రవితేజ మార్క్ మాస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సాయి కార్తీక్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా సక్సెస్ మీద కూడా చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు. -
సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి!
బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది. క్రిష్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి- జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. బాలకృష్ణ సరసన శ్రేయ హీరోయిన్గా నటించగా, వీరమాత గౌతమిగా ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ నటి హేమమాలిని నటించారు. ఈ సినిమాలకు సెన్సార్ సభ్యులు ఒక్క కట్ కూడా లేకుండా యు/ఎ సెర్టిఫికెట్ ఇచ్చారు. శాలివాహన శకం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిష్ ఓ దృశ్యకావ్యంలా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు క్రిష్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. "మా శాతకర్ణి సెన్సార్ పూర్తయ్యింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అభినందనలు తెలపడంతోపాటు.. బాలకృష్ణ నటవిశ్వరూపం, భారీ వ్యయంతో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గౌతమిపుత్ర శాతకర్ణి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నందమూరి అభిమానులనే కాక యావత్ తెలుగు సినిమా అభిమానులను విశేషంగా అలరించడం ఖాయం" అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్, సంగీతం: చిరంతన్ భట్, కళ: భూపేష్ భూపతి, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంభాషణలు: సాయిమాధవ్ బుర్ర, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు, సమర్పణ: బిబో శ్రీనివాస్, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.