బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ) సినిమాకు ఎదురుదెబ్బ తగలింది. ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)ని ఆదేశించలేమని బాంబే హైకోర్టు బుధవారం వెల్లడించింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని బీపీ కొలబవాలా, ఫిర్దౌస్ పూనావాలాతో కూడిన బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమర్జెన్సీ చిత్ర సహ నిర్మాత జీ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారనను 19వ తేదీకి వాయిదా వేసింది.
కాగా ఎమర్జెన్సీ చిత్రం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత కాలం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం. ముఖ్యంగా 1975లో ఆమె విధంచిన ఎమర్జెన్సీ కాలాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో కంగనా నటించడమే కాకుండా, దర్శకత్వం, నిర్మతగానూ వ్యవహరించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. అయితే సినిమాను వ్యతిరేకిస్తూ అనేక సిక్కు సంస్థలు ఆందోళనలు చేయడంతో వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎమర్జెన్సీ విడుదలను నిలిపివేయాలంటూ సిక్కు సంస్థలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సిక్క సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి వ్యతిరేకంగా జబల్‌పూర్ హైకోర్టులో(మధ్యప్రదేశ్) పిటిషన్ దాఖలు చేసి, దాని ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరారు. దానిని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది.
‘ఎమర్జెన్సీ’ని విడుదల చేయాలని, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కంగనా, చిత్ర సహ నిర్మాణ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. . ఈ క్రమంలోనే తాజాగా తీర్పు వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment