‘నన్ను దోచుకుందువటే’ సెన్సార్‌ పూర్తి | Sudheer Babu Nannu Dochukunduvate Censored With U Certificate | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 14 2018 6:56 PM | Last Updated on Fri, Sep 14 2018 6:56 PM

Sudheer Babu Nannu Dochukunduvate Censored With U Certificate - Sakshi

‘సమ్మోహనం’ సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు సుధీర్‌ బాబు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో తన తదుపరి సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. 

ఇప్పటికే రిలీజైన టీజర్‌, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ సర్టిఫికెట్‌ పొందిన ‘నన్ను దోచుకుందువటే’ మూవీని సెప్టెంబర్‌ను 21న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమాను సుధీర్‌ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.సుధీర్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement