పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు, నీయవ్వ తగ్గేదేలె.. ఈ డైలాగ్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోయాయ్. మూడేళ్ల తర్వాత మరోసారి పుష్పరాజ్ థియేటర్లలో పూనకం తెప్పించేందుకు రెడీ అయ్యాడు. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 మూవీ ఆరు భాషల్లో డిసెంబర్ 5న విడుదల కానుంది.
ఏకంగా 12 వేల థియేటర్లలో రిలీజవుతోంది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. అందరూ అనుకున్నట్లుగానే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో సినిమా రాబోతోంది. ఇకపోతే సెన్సార్ బోర్డ్.. సినిమాలో ఐదు విషయాల్లో మార్పుచేర్పులు సూచించింది. ఓ బూతుపదాన్ని మ్యూట్ చేయమనగా వెంకటేశ్వర అనే దేవుడి పేరును భగవంతుడిగా మార్చమంది.
సినిమాలో విలన్ కాలిని హీరో నరకగా అది గాల్లో ఎగిఏర సీన్, అలాగే నరికిన చేతికి హీరో పట్టుకునే సన్నివేశాలను సీజీతో కవర్ చేయమని సూచించింది. ఇకపోతే పుష్ప 2 గ్రాండ్ ఈవెంట్ నవంబర్ 29న ముంబైలో జరగనుంది. ఆ మరుసటి రోజు అంటే శనివారం నాడు చిత్తూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
#Pushpa2TheRule - 3 Hrs 20 Min 38 Secs ⏳🔥🔥#Pushpa2TheRule #Pushpa@alluarjun @aryasukku @pushpamovie @mythriofficial#Pushpa2 #AlluArjun #Sukumar pic.twitter.com/oaHuJwam60
— Thyview (@Thyview) November 28, 2024
చదవండి: తాళి, గాజులు, సింధూరం.. అన్నీ అమ్మాయికే! మరి నాకు..?
Comments
Please login to add a commentAdd a comment