
నూతన నటీనటులతో పీబీ లింగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాతో ఆట’. విఘ్నేష్ ధనుష్ సమర్పణలో శుక్లాంబరధరం సినీ క్రియేషన్స్‌పై బి.ఎల్. బాబు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా బి.ఎల్. బాబు మాట్లాడుతూ– ‘‘నాతో ఆట’ ఒక హారర్ చిత్రం. మంచి కథతో యూత్‌కి కావాల్సిన అన్ని అంశాలతో నిర్మించాం. మా చిత్రాన్ని మోహిత్ ఫిలిమ్స్ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు.