
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ చిత్రం ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక దాంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. ఇక ‘పుష్ప’ ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12న హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక తాజాగా విడుదలైన సమంత ఐటం సాంగ్ తన అభిమానులను అలరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment