అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఇప్పుడు చాలామందికి 'పుష్ప'నే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతా బాగుందనకునేలోపు ఏకంగా మూడో పార్ట్ కూడా ఉందని తెగ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఉంటే ప్లస్సులు మైనస్సులు ఏంటి?
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు, వాటికి సీక్వెల్స్ అనే ట్రెండ్ నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి హీరో కూడా తమ తమ సినిమాలకు సీక్వెల్స్‌ని రెడీ చేస్తున్నారు. 'పుష్ప'కి కూడా సీక్వెల్ ఉంటుందని తొలి భాగం రిలీజైనప్పుడే ప్రకటించారు. ఇప్పుడు మూడో భాగమని అంటున్నారు. అయితే ఫస్ట్ పార్ట్‌ని 2021లో డిసెంబరులో థియేటర్లలోకి తీసుకురాగా.. సీక్వెల్ మాత్రం 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. అంటే ఒక్క సినిమా తీయడానికి దాదాపు మూడేళ్లు పట్టేసింది. ఇక సీక్వెల్ అంటే మరో రెండు మూడేళ్లయినా పట్టేయొచ్చు.
(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ హీరో?)
అలానే అల్లు అర్జున్, సుకుమార్‌కి 'పుష్ప 2' కాకుండా వేరే కమిట్‌మెంట్స్ ఉన్నాయి. బన్నీ కోసం త్రివిక్రమ్, అట్లీ లాంటి డైరెక్టర్స్ లైనులో ఉన్నారు. అలానే సుక్కూ కోసం చరణ్, మహేశ్ తదితరులు ఆల్రెడీ వెయిటింగ్‌లో ఉన్నారని టాక్. అలానే ప్రేక్షకులకు ఓ పార్ట్ నచ్చింది కదా అని వరసపెట్టి అవే తీసుకుంటూ పోతే కంటెంట్ ఎంత బాగున్నా సరే జనాలకు బోర్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది.
ముందుగా 'పుష్ప' కథని వెబ్ సిరీస్ గా తీయాలనేది డైరెక్టర్ సుకుమార్ ప్లాన్. కానీ సినిమాగా వచ్చింది. రికార్డులు సృష్టించింది. అయితే తొలి భాగం హిట్ అనేది ఎవరూ ఊహించలేదు. కానీ రెండో భాగంపై అంచనాలైతే ఉన్నాయి కానీ ఏం జరుగుతుందనేది చూడాలి. ఒకవేళ రెండో పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే మూడో పార్ట్ రావొచ్చు. లేదంటే మాత్రం సైలెంట్ అయిపోవచ్చేమో. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి మరి.
(ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్)
Comments
Please login to add a commentAdd a comment