
'గోపాలా గోపాలా'కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దు
హైదరాబాద్ : 'పీకే' చిత్రంపై వివాదం ఇంకా కొనసాగుతుంటే... మరోవైపు వెంకటేశ్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న 'గోపాలా గోపాలా' చిత్రంపై వీహెచ్పీ ఆందోళన చేపట్టింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ వీహెచ్పీ కార్యకర్తలు బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ ధర్నా చేపట్టారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకోవటంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.