సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ సినిమాకు అత్యున్నత న్యాయస్థానంలో మరోసారి మద్దలు లభించింది. సినిమా విడుదలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చబోనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలను నిలిపేయాలంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు మంగళవారం కొట్టివేశారు. దీంతో జనవరి 25న ‘పద్మావత్’ యధావిధిగా విడుదలకానుంది.