Karni Sena
-
బిష్ణోయ్ ని ఎన్ కౌంటర్ చేస్తే కోటి..
-
‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటి రివార్డు’
ముంబై: ఇటీవల మహారాష్ట్రలో ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యకు పాల్పడింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. రూ. కోటి రివార్డు ఇస్తామంటూ క్షత్రియ కర్ణిసేన ప్రకటించింది. క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్.. లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. ఏ పోలీసు అధికారికైనా రూ.1,11,11,111 రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రాజ్ సేకావత్ ఆ వీడియోలో మాట్లాడుతూ... ‘‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. భద్రతా సిబ్బందికి మేము ప్రకటించిన రివార్డు అందజేస్తాం. లారెన్స్ బిష్ణోయ్ విషయంలో కేంద్రం, గుజరాత్ ప్రభ్వుం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అమర్ షహీద్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని హత్య చేసిన నిందితుల్లో లారెన్స్ బిష్ణోయ్ కూడా ఒకరు’’ అని అన్నారు.लॉरेंस बिश्नोई के एनकाउंटर के लिए क्षत्रिय करणी सेना ने घोषित किया इनाम। सुनिए क्या कह रहे है डॉ. राज शेखावत। #LawrenceBishnoi #KarniSena #SalmanKhan #BabaSiddique #BabaSiddiqui #Gujarat pic.twitter.com/zaHn3O8ens— Achlendra Kr. Katiyar (@achlendra) October 21, 2024డిసెంబర్ 5, 2023న జైపూర్‌లో గుర్తుతెలియని దుండగులు.. కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. హత్య జరిగిన కొన్ని గంటలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతని హత్యకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. బిష్ణోయ్‌కు సంబంధించిన బలమైన క్రిమినల్ సిండికేట్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా పని చేస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. సెప్టెంబరు 2023లో ఖలిస్తానీ సానుభూతిపరుడు సుఖా దునేకే హత్యకు కూడా ఈ గ్యాంగ్ బాధ్యత వహించటం గమనార్హం. కెనడాలోని ఏపీ ధిల్లాన్, గిప్పీ గరేవాల్ నివాసాల వెలుపల కూడా బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు. ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన కేసులో కూడా అతని పేరు ఉంది. చదవండి: సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్ వీడియోలు, బైక్‌తో ప్లాన్ -
Karni Sena Chief’s Killing Case: కర్ణిసేన చీఫ్ హత్య..మరో నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గొగామెడి హత్య కేసులో మరో ప్రధాన నిందితుడు అశోక్ కుమార్‌ను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది. తాజా అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ హత్యకు సంబంధించి రాజస్థాన్, హర్యానాల్లోని 31 ప్రదేశాల్లో బుధవారం జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. తాజాగా అరెస్టయిన నిందితుడు అశోక్‌కుమార్ కర్ణిసేన చీఫ్ హత్య తామే చేశామని క్లెయిమ్ చేసుకున్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోడారాకు సన్నిహితుడు. ‘కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం(జనవరి 3)న హర్యానా, రాజస్థాన్‌లోని 31 ప్రాంతాల్లో సోదాలు జరిపాం. వీటిలో నిందితులకు సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. సోదాల్లో భాగంగానే అశోక్ కుమార్ అనే నిందితుడిని రాజస్ధాన్‌లోని జున్జున్లో అరెస్టు చేశాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన జైపూర్‌లోని శ్యామ్నగర్లో ఉన్న ఆయన ఇంట్లోనే కర్ణిసేన చీఫ్ గొగామెడిని ముగ్గురు షూటర్లు కాల్చిచంపారు. పట్టపగలు జరిగిన ఈ హత్య సంచలనం రేపింది. హత్య తర్వాత రాజస్థాన్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇదీచదవండి..మహువా పిటిషన్..లోక్‌సభ సెక్రెటరీకి సుప్రీం నోటీసు -
ఎన్ఐఏ చేతికి కర్ణిసేన చీఫ్ హత్య కేసు
చంఢీగడ్: కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ గోగమేడి హత్య కేసును ఎన్ఐఏ చేపట్టింది. హత్యలో ప్రముఖ గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్నందున హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కర్ణిసేన అధినేతను డిసెంబర్ 5న రాజస్థాన్, జైపూర్‌లోని ఆయన నివాసంలో దుండగులు కాల్చి చంపారు. హత్య జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా హత్యకు బాధ్యత వహించాడు. ఇద్దరు నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలను డిసెంబర్ 9న చండీగఢ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. గోదారానే తమను సుఖ్‌దేవ్ గోగామేడి హత్యకు ఆదేశించారని పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న షూటర్లు గోదార సన్నిహితులు వీరేంద్ర చాహన్, దనరామ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొందరు వ్యాపారవేత్తల నుంచి వసూళ్లకు సంబంధించి గోదార, గోగమేడి మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే హత్యకు దారితీసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: 'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్‌పై విపక్ష ఎంపీ మిమిక్రి -
కర్ణిసేన చీఫ్ హత్య: ‘డుంకీ’ టెక్నిక్‌తో సూత్రధారి పరార్
న్యూఢిల్లీ: కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ గొగామెడిని హత్య వెనుక కీలక సూత్రధారి గ్యాంగ్‌స్టర్ రోహిత్ గొడారా భారత్ నుంచి పారిపోయాడు. అయితే గొడారా డాంకీ ఫ్లైట్ టెక్నిక్ వాడి కెనడాకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ టెక్నిక్‌నే పంజాబ్‌లో డుంకీ అని పిలుస్తారు. ఈ పేరుతోనే త్వరలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ సినిమా రాబోతోంది. డుంకీ సినిమా థీమ్ కూడా పోలీసుల కళ్లుగప్పి పారిపోవడమేనని తెలుస్తోంది. డుంకీ టెక్నిక్‌లో పోలీసులను తప్పుదారి పట్టించేందుకు వెళ్లాల్సిన చోటికి నేరుగా కాకుండా మధ్యలో వేరు వేరు దేశాల్లో ఆగుతూ చివరకు గమ్యస్థానం చేరుకుంటారు. ఇందుకు ఆయా దేశాల వీసా,ఇమిగ్రేషన్ నిబంధనల్లోని లోపాలను అడ్డుపెట్టుకుంటారు. ఈ తరహాలోనే గొడారా పలు దేశాల్లో ఆగుతూ తొలుత అమెరికా వెళ్లాడు. అక్కడి నుంచి చివరకు కెనడా పారిపోయాడు. ఈ నెల ఐదవ తేదీన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ గొగామెడిని ఆయన ఇంట్లోనే టీ తాగుతుండగా ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. వీరిలో ఒకరు అక్కడే క్రాస్ ఫైరింగ్‌లో చనిపోగా మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ హత్య తామే చేశామని గ్యాంగ్‌స్టర్ రోహిత్ గొడారా ప్రకటించుకున్నారు. ఇతనిపై దేశంలోని పలు పోలస్‌స్టేషన్‌లలో 32 కేసులు నమోదయ్యాయి. ఇదీచదవండి..కాంగ్రెస్ ఉండగా మనీ హేస్ట్ ఎందుకు? -
కర్ణిసేన చీఫ్ హత్య కేసు..ఇద్దరు షూటర్లు సహా ముగ్గురి అరెస్ట్
న్యూఢిల్లీ/జైపూర్: శ్రీ రాష్ట్రీయ కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామెడి హత్య కేసుకు సంబంధించి ఇద్దరు షూటర్లు సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న రాజస్తాన్ రాజధాని జైపూర్‌లోని తన సొంతింట్లోనే గోగామెడిని దుండగులు కాల్చి చంపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా జైపూర్‌కు చెందిన రోహిత్ రాథోడ్, హరియాణాలోని మహేంద్రగఢ్ వాసి నితిన్ ఫౌజీ అనే వారే కాల్పుల ఘటనలో పాల్గొన్నట్లు నిర్థారణకు వచ్చారు. రాజస్తాన్, ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి, చండీగఢ్‌లోని 24వ సెక్టార్‌లోని ఓ హోటల్లో ఉండగా వీరిద్దరితోపాటు తప్పించుకునేందుకు సహకరించిన ఉద్ధమ్ సింగ్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వీరిని జైపూర్ పోలీసులకు అప్పగించనున్నారు. గోగామెడిని చంపేందుకు షూటర్లను కాంట్రాక్టుకు కుదిర్చిన రాంవీర్ అనే వ్యక్తిని శనివారం జైపూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు పథకం ‘గోగామెడిని చంపిన అనంతరం నిందితులిద్దరూ నకిలీ గుర్తింపు పత్రాలతో చండీగఢ్‌లోని ఓ హోటల్లో బస చేశారు. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు పథకం వేసినట్లు భావిస్తున్నాం. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది’అని పోలీసులు చెప్పారు. నాలుగేళ్ల క్రితం ఆర్మీలో చేరేందుకు శిక్షణ తీసుకుంటున్న సమయంలో నితిన్ ఫౌజీ, ఉద్ధమ్ సింగ్‌లకు పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. గతంలో ఫౌజీపై కిడ్నాప్ కేసు, పోలీసు అధికారిపై దాడి కేసులతో సంబంధముంది. రాథోడ్‌కు కూడా నేరచరిత్ర ఉంది. జైలుకెళ్లి వచ్చాడు. రోహిత్ గోదారా ఆదేశాల మేరకు గోగామెడి హత్యకు వీరేంద్ర చరణ్ అనే వ్యక్తి పథక రచన చేసినట్లు అనుమానిస్తున్నారు. గోగామెడిని చంపినందుకు గాను రాథోడ్, ఫౌజీలకు చెరో రూ.50 వేలు ముట్టినట్లు చెబుతున్నారు. నకిలీ వీసాలు, పాస్‌పోర్టులు తయారయ్యే వరకు అజ్ఞాతంలో గడపాలని వీరు నిర్ణయించుకున్నట్లు సమాచారం. చండీగఢ్ నుంచి గోవాకు అక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లేందుకు వీరు పథకం వేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్మీలో పనిచేస్తూ సెలవుపై మహేంద్రగఢ్‌లోని సొంతింటికి వచ్చిన ఫౌజీ, మళ్లీ విధుల్లో చేరకుండా హరియాణాలో నేరాలకు పాల్పడుతున్నట్లు వివరించాయి -
కర్ణిసేన చీఫ్ హత్య కేసు : ఇద్దరు షూటర్ల అరెస్ట్
చండీగఢ్: కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ గొగామెడి హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు గొగామెడిని కాల్చి చంపిన షూటర్లు. గొగామెడి హత్య కేసులో రోహిత్ రాథోర్, నితిన్ ఫౌజీ అనే ఇద్దరు షూటర్లు, వారి వెంట ఉన్న మరొక వ్యక్తిని శనివారం రాత్రి చండీగఢ్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ, రాజస్థాన్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం కర్ణిసేన చీఫ్ గొగామెడిని జైపూర్‌లోని ఆయన ఇంట్లోనే ముగ్గురు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. వీరిలో ఒక దుండగుడు స్పాట్లోనే క్రాస్‌ఫైర్ జరిగి బుల్లెట్ తగిలి చనిపోయాడు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దిరని పోలీసులు తాజాగా పట్టుకున్నారు. హత్య తర్వాత ఇద్దరు షూటర్లు జైపూర్ నుంచి హిస్సార్‌కు రైలులో వెళ్లి అక్కడి నుంచి మనాలీ, మండి మీదుగా చండీగఢ్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య తామే చేశామని గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోడారా ప్రకటించుకున్నాడు. పరారీలో ఉండి పట్టుబడ్డ ఇద్దరు షూటర్లు ఎప్పటికప్పుడు గోడారాకు టచ్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, కర్ణిసేన చీఫ్ గొగామెడి హత్య రాజస్థాన్‌లో రాజకీయ దుమారం రేపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకే ఆయనపై కాంగ్రెస్ పార్టీ పగ తీర్చుకుందని బీజేపీ ఆరోపించింది. గొగామెడికి ప్రాణాలకు ప్రమాదం ఉందని, సెక్యూరిటీ పెంచాల్సిందిగా కోరినప్పటికీ సీఎం గెహ్లాట్ ఎలాంటి చర్య తీసుకోకపోవడమే ఇందుకు ఆధారమని బీజేపీ నేతలు విమర్శించారు. ఇదీచదవండి..ఎంపీ డానిష్ అలీపై బీఎస్పీ బహిష్కరణ వేటు -
కర్ణిసేన చీఫ్ గోగామేడి హత్య కేసులో నిందితులు వీరే..!
జైపూర్: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడిని హతమార్చిన కేసులో ఇద్దరు ముష్కరులను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. జైపూర్‌లోని మంగళవారం తన ఇంట్లో టీ తాగుతున్న సమయంలో గోగామేడిని నిందితులు కాల్చి చంపారు. నిందితుల కోసం పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. సమాచారం అందిస్తే ఒక్కొక్కరికి రూ.5 లక్షల నజరానాను కూడా ప్రకటించారు. కర్ణిసేన చీఫ్ హత్య రాజస్థాన్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయన మద్దతుదారులు ఈరోజు రాజస్థాన్ బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రహదారులను దిగ్బంధించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జైపూర్‌తో పాటు చురు, ఉదయ్‌పూర్, అల్వార్, జోధ్‌పూర్ జిల్లాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ హత్యపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేష్ మిశ్రా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. Rajasthan Karni Sena chief murder accused identified Read @ANI Story | https://t.co/rDleKvcsqS#SukhdevSinghGogaMedi #KarniSena #Rajasthan pic.twitter.com/asUyGXdOkc — ANI Digital (@ani_digital) December 6, 2023 సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు బాధ్యత వహిస్తూ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లతో దగ్గరి సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ఫేస్బుక్ పోస్టు చేశాడు. రోహిత్ గోదార గతంలో సుఖ్‌దేవ్ గోదారాను బెదిరించాడు. రోహిత్ గొదారాపై సుఖ్‌దేవ్ సింగ్ ఫిర్యాదు కూడా చేశారని పోలీసులు తెలిపారు. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో కూడా ఉన్నాడు. పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. #WATCH | Karni Sena members protest in Rajasthan's Jaipur over the murder of Sukhdev Singh Gogamedi, national president of Rashtriya Rajput Karni Sena. pic.twitter.com/IjAOtsYnms — ANI (@ANI) December 6, 2023 ఇదీ చదవండి: Karni Sena Chief Murder Case: రాజస్థాన్ బంద్.. నాలుగు జిల్లాల్లో హైఅలర్ట్ -
కర్ణిసేన చీఫ్ హత్య..గెహ్లాట్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు!
జైపూర్: రాజస్థాన్‌లో కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గొగామెడి హత్యపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జరిగిన ఈ హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఓటమికి ప్రతీకారంగానే కాంగ్రెస్ పార్టీ ఈ హత్యకు పాల్పడినట్లుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గెహ్లాట్ కావాలనే సుఖ్‌దేవ్ భద్రత తగ్గించారని, ఇదే ఈ హత్య జరిగేందుకు కారణమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సుఖ్‌దేవ్‌కు ప్రాణాపాయం ఉందని పోలీసులకు సమాచారం ఉండి కూడా భద్రత తగ్గించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల ట్వీట్ చేశారు. ఎన్నికల్లో కర్ణిసేన బీజేపీకి మద్దతిచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బైక్ మీద వచ్చిన ముగ్గురు దుండగులు మంగళవారం ఉదయం సుఖ్‌దేవ్‌ను ఆయన ఇంట్లోనే కాల్చి చంపారు. ఈ హత్య ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాల్పులు జరిపిన వారిలో ఒక దుండగుడు అతని సహచరుల కాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సుఖ్‌దేవ్ సెక్యూరిటీ గార్డు కాల్పుల్లో దుండగుడు చనిపోలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. Congress has a caretaker government in place right now. BJP govt is not in office Also security of the said victim was reduced by Gehlot Hear the victim blame anti Hindu Congress govt & stop peddling your lies https://t.co/C7uldNmGUH pic.twitter.com/BSaMkhfExZ — Shehzad Jai Hind (@Shehzad_Ind) December 5, 2023 ఇదీచదవండి..‘ఎక్స్’లో హాట్‌టాపిక్‌గా దోశ ధర..! -
కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్య
జైపూర్: జైపూర్‌లో దారుణం జరిగింది. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన దుండగులు గోగమేడిని పిస్టల్‌తో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో గోగమేడి తన ఇంటి వరండాలో కూర్చోగా ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ఫేస్బుక్ పోస్ట్‌లో గోగమేడి హత్యకు తానే కారణమని పేర్కొన్నాడు. తీవ్రంగా గాయపడిన గోగమేడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో గోగమేడితో పాటు ఉన్న అజిత్ సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు -
Live Video: మున్సిపల్ ఆఫీస్ ముందే యువకుడి దారుణ హత్య
భోపాల్: పాత పగలతో హక్కుల పోరాట విభాగం కర్ణీ సేనాకు చెందిన 28 ఏళ్ల యువకుడిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతా చూస్తుండగానే కత్తులతో పలుమార్లు పొడిచారు. ఈ సంఘటన గత శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. ఇటార్సిలోని కర్ణీ సేనా టౌన్ సెక్రెటరీ రోహిత్ సింగ్ రాజ్‌పుత్‌ను.. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందే ముగ్గురు దారుణంగా పొడిచారు. రోహిత్‌ను కాపాడేందుకు యత్నించిన ఆయన స్నేహితుడు సచిన్ పటేల్‌పైనా కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడివున్న ఇరువురిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రాజ్‌పుత్ ప్రాణాలు కోల్పోగా.. పటేల్ పరిస్థతి విషమంగా ఉంది. పాత పగలతోనే రోహిత్ సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేసినట్లు ఇటార్సి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ఆర్ఎస్ చౌహాన్ తెలిపారు. ప్రధాన నిందితుడు 27 ఏళ్ల రాను అలియాస్ రాహుల్‌గా చెప్పారు. ‘బాధితుడు, అతడి స్నేహితుడు మార్కెట్లోని ఓ టీ షాప్ ముందు నిలుచుని ఉన్నారు. బైక్‌లపై ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అందులోని ఓ వ్యక్తి కత్తి తీసి రాజ్‌పుత్‌పై దాడి చేశాడు. ముగ్గురు నిందితులు రాహుల్ రాజ్‌పుత్, అంకిత్ భట్, ఐషు మాలవియాలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచాం.’ అని తెలిపారు ఎస్సై. కర్ణీ సేన సభ్యుడి హత్య నేపథ్యంలో నిందితుల్లో ఒకడైన అంకిత్ భట్ నివాసాన్ని అధికారులు కూల్చేసినట్లు స్థానికులు తెలిపారు. మిగిలిన ఇద్దరి ఇళ్లను సైతం కూల్చేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. అదే ప్రాంతంలో ఐదు రోజుల క్రితం ఓ బ్యాంకు ఉద్యోగిపై ఐదుగురు దుండగులు దాడి చేశారు. దీనిపై మాజీ స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ సితాశరన్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. A 28-year-old member Karni Sena was publicly stabbed to death on Friday night in Itarsi allegedly over an old dispute. His friend, Sachin Patel, was also stabbed when he tried to save him. @ndtv @ndtvindia pic.twitter.com/MR0PYkI5ss — Anurag Dwary (@Anurag_Dwary) September 4, 2022 ఇదీ చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. -
అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ మూవీపై కర్ణిసేన ఆగ్రహం
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘పృథ్వీరాజ్’. తాజాగా ఈ మూవీ టైటిల్ వివాదంలో చిక్కుకుంది. చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా తన నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న మూవీ టైటిల్‌పై కర్ణి సేన సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మూవీ టైటిల్ పేరు వెంటనే మర్చాలని కర్ణి సేన యూత్ వింగ్ ప్రెసిడెంట్, చిత్ర నిర్మాత సుర్జీత్ సింగ్ రాథోర్ డిమాండ్ చేశారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్ ఆర్టికల్ షేర్ చేస్తూ మూడు షరతులు విధించారు. మేకర్స్ వెంటనే ఈ మూవీ టైటిల్‌ను పృథ్వీరాజ్ నుంచి చక్రవర్తి పూర్తి పేరు పృథ్వీరాజ్ చౌహాన్‌గా మార్చాలని, అలా కాకుండా ‘పృథ్వీరాజ్’ అని మాత్రమే పేరు పెట్టడం తగదన్నారు. అది హిందూ చక్రవర్తి ప్రతిష్ఠకు భంగం కలిగించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తమ డిమాండ్లను తిరస్కరిస్తే గతంలో సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ సినిమా ఎదుర్కొన్న పరిణామాలనే మీరు కూడా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ పోస్టులో ఆయన ‘ఈ మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్న అక్షయ్ కుమార్‌ను తాము గౌరవిస్తున్నాం. అయితే ఈ చిత్ర నిర్మాత ఆదిత్య ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. చివరి హిందూ సామ్రాట్ యోధుడైన పృథ్వీరాజ్ చౌహాన్ పూర్తి పేరు మీ మూవీకి పెట్టాలి. అంతేగాక ఇందులో ఆయన గొప్పతనం ప్రతిబింబించాలి. ఒకవేళ అలా లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ఆందోళన చేపడతాం’ అంటూ డిమాండ్ చేశారు. కాగా గతంలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ సినిమాకు విడుదల సమయంలో వివాదం చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Surjeet Singh Rajput (@realsurjeetsinghrajput) -
వాళ్ల అంతు చూస్తా
‘మణికర్ణిక’ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఓ వివాదం నడుస్తోంది. దర్శకులు మారడం.. నటుడు సోనూసూద్ తప్పుకోవడం.. తాజాగా సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ను తప్పుగా చిత్రీకరించారంటూ కర్ణిసేన నిరసన తెలియజేస్తున్నారు. ఈ విషయంపై కంగనా రనౌత్ స్పందిస్తూ– ‘‘మా సినిమాను నలుగురు చరిత్రకారులు చూసి సర్టిఫై చేశారు. సెన్సార్ బృందం కూడా చూసింది. కర్ణిసేనకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. ఇంకా మా సినిమా మీద అనవసరమైన వివాదాన్ని సృష్టిస్తున్నారు వాళ్లు. ఆ పనులు ఆపకపోతే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నేనూ రాజ్‌పుత్‌నే.. వాళ్ల అంతు చూస్తాను’’ అని ఘాటుగా పేర్కొన్నారు. -
‘మహేశ్వరి ముక్కు, చెవులు కోస్తాం...’
జైపూర్ : రాజ్‌పుత్ కర్ణిసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి కిరణ్ మహేశ్వరి రాజ్‌పుత్‌లను ఎలుకలతో పోల్చినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అలా జరగని పక్షంలో ఆమె ముక్కు, చెవులు కోస్తామని కర్ణిసేన బెదిరింపులకు పాల్పడింది. వివరాలు... సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మహేశ్వరి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘సర్వ్ రాజ్‌పుత్ సమాజ్ సంఘర్ష్ సమితి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించబోతున్న వార్తలు నిజమేనా’ అన్న ప్రశ్నకు బదులుగా.. ‘వర్షాకాలంలో కలుగు నుంచి బయటికి వచ్చే ఎలుకల లాంటి కొందరు వ్యక్తులు ఎన్నికల సమయంలో బయటకు వస్తారంటూ’ ఆమె వ్యాఖ్యానించారు. మహేశ్వరి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణిసేన... ‘దీపికా పదుకొనె ‘పద్మావతి వివాదాన్ని’ మహేశ్వరి మర్చిపోయినట్టున్నారు. రాజ్‌పుత్‌ల వల్లే బీజేపీకి రాజస్థాన్‌లో బలం చేకూరింది. మహేశ్వరి అన్నట్లే ఆమె నియోజక వర్గంలో ఉన్న 40 వేల ఎలుకల వల్లే గత ఎన్నికల్లో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు తప్పక బుద్ధి చెప్తామంటూ’ మండిపడింది. ‘మహేశ్వరి వెంటనే క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. మేము మహిళలకు గౌరవం ఇస్తాం. కానీ హద్దులు దాటి మాట్లాడే మహిళలను ఎన్నటికీ సహించబోమంటూ’ కర్ణిసేన చీఫ్ మహిపాల్ మక్రానా వీడియో విడుదల చేశారు. కాగా ఈ విషయంపై స్పందించిన మహేశ్వరి మాట్లాడుతూ...తాను రాజ్‌పుత్‌ల గురించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను(కాంగ్రెస్ పార్టీని) ఉద్దేశించే అలా మాట్లాడానని చెప్పారు. క్షమాపణలు చెప్పాల్సిందే : సచిన్ పైలట్ రాజ్‌పుత్‌లను అవమానించిన మహేశ్వరి వెంటనే క్షమాపణలు చెప్పాలని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలకు విలువ ఇచ్చే సంస్కృతి బీజేపీకి లేదని విమర్శించారు. తమను తాము రక్షించుకోవడానికి బీజేపీ నేతలు ఎంతకైనా దిగజారుతారంటూ వ్యాఖ్యానించారు. -
కర్ణిసేన యూటర్న్పైనే మరో యూటర్న్..!
సాక్షి, ముంబై : పద్మావత్ చిత్రానికి రాజ్‌పుత్‌ల ఆధ్వర్యంలోని కర్ణిసేన మరో ఝలక్ ఇచ్చింది. పద్మావత్ సినిమాపై ఆందోళనలు విరమించుకునే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ సినిమా రాజ్‌పుత్‌ల ధైర్యసాహసాలను చాటేలే, వారి గౌరవాన్ని ఇనుమడించేలా ఉందని పేర్కొంటూ.. ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలను విరమించుకుంటున్నట్లు కర్ణిసేన పేరుతో ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణిసేన తాజాగా వివరణ ఇచ్చింది. పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు విరమించుకోలేదని, సినిమాపై తమ నిరసన యథాతథంగా కొనసాగుతోందని తాజాగా కర్ణిసేన జాతీయ నాయకులు లోకేంద్ర సింగ్ కల్వీ, సుఖ్‌దేవ్ సింగ్ గొగమేడి తెలిపారు. కర్ణిసేన ముంబై చీఫ్ యోగేంద్ర సింగ్ కటార్‌తోపాటు ముంబై విభాగపు బాధ్యులు పద్మావత్ సినిమాపై తమ ఆందోళనలు విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, దేశవ్యాప్తంగా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన కల్వీ, గొగమేడి మాత్రం ఈ ప్రకటనను ఖండించారు. శ్రీరాజ్‌పుత్ కర్ణిసేనకు కల్వీ జాతీయస్థాయిలో నాయకత్వం వహిస్తుండగా.. రాజ్‌పుత్‌లకు సంబంధించిన మరో జాతీయ సంఘమైన శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేనకు గోగమేడి జాతీయాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు అనుకూలంగా ప్రకటన ఇచ్చినందుకు యోగేంద్రతోపాటు.. ఆ ప్రకటనలో సంతకాలు చేసిన ఇతరులను సైతం తమ సంఘం నుంచి బహిష్కరించినట్టు గోగమేడి తెలిపారు. పద్మావత్ సినిమాపై తమ అభ్యంతరాలు పరిష్కారం కాలేదని, తాము ఆందోళన విరమించుకున్నట్టు సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాదని వివరించారు. కాగా, 'పద్మావత్ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఏం లేవు. ఇందులో రాజ్‌పుత్‌ల గురించి చాలా గొప్పగా చూపించారు. పద్మావత్ చూశాక ప్రతీ రాజ్‌పుత్ కూడా గర్వపడతారు' అని గోగమేడి నాయకత్వంలోని కర్ణిసేనకు ముంబై చీఫ్‌గా ఉన్న యోగేంద్ర తెలిపారు. కర్ణిసేన జాతీయాధ్యక్షుడు గోగమేడి ఆదేశాలను అనుసరించి ప్రకటన విడుదల చేసినట్టు ఆయన ఇంతకుముందు మీడియాతో తెలిపారు. చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచే అభ్యంతరాలు లేవనెత్తుతూ విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన శతవిధాల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆందోళనలు, ధర్నాలు, దాడులు, నిరసనలు, భన్సాలీ-దీపిక తలలపై నజరానాల ప్రకటనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాల(బీజేపీ పాలిత) నిషేధం... ఇలా ఏవీ కూడా పద్మావత్ విడుదలను అడ్డుకోలేకపోయాయి. చివరకు న్యాయస్థానాలు కూడా పద్మావత్ విడుదలకు క్లియరెన్స్ ఇవ్వటంతో కర్ణిసేన కూడా కాస్త వెనక్కి తగ్గింది. -
‘పద్మావత్’ విజయంపై కర్ణిసేన కామెంట్
జైపూర్: వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కర్ణిసేన ‘పద్మావత్’ బాక్సాఫీస్ వసూళ్లపై కర్ణిసేన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఇది భారతదేశం. ఇక్కడ సన్నిలియోన్(మాజీ పోర్న్ స్టార్)కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నార’ని కర్ణిసేన ప్రతినిధి విజేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘పద్మావత్’కు సానుకూల రివ్యూలు వచ్చాయని, మంచి కలెక్షన్లు సాధిస్తోందని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆయన ఈవిధంగా స్పందించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ఈ సినిమాను కర్ణిసేన వ్యతిరేకిస్తూనే ఉంది. ముమ్మాటికీ ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని పునరుద్ఘాటించారు. ‘ఈ సినిమాలో చూపించినట్టుగా గర్భవతిగా ఉన్న మహిళ జౌహర్ లేదా ఆత్మాహుతికి పాల్పడదు. చిత్తోర్‌గఢ్ కోటపై ఖిల్జీ 55 ఏళ్ల వయసులో దండెత్తాడు. కానీ ఈ సినిమాలో అతడు 25 ఏళ్ల వయసులో దాడి చేసినట్టు చూపించారు. అలాగే చిత్తోర్‌గఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ పగలగొట్టకపోయినా, పగలగొట్టినట్టు తెరకెక్కించారు. చరిత్ర ప్రకారం చూస్తే కోట ద్వారాన్ని పెకలించి తనతో పాటు ఢిల్లీకి ఖిల్జీ తీసుకుపోయినట్టు ఉంది. 400 ఏళ్ల తర్వాత భతర్పూర్ రాజు ఈ ద్వారాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రతిష్టించారు. కానీ సినిమాలో చిత్తోర్‌గఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ పగలకొట్టుకుని లోపలికి ప్రదేశించినట్టుగా చిత్రీకరించారు. ఇలాంటి వక్రీకరణలు చాలా ఉన్నాయ’ని విజేంద్ర సింగ్ వివరించారు. జనవరి 25న విడుదలైన ‘పద్మావత్’ సినిమా ఇప్పటివరకు రూ. 150 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకుల అంచనా. -
కర్ణిసేన నేత అరెస్ట్
గుర్గావ్: బాలీవుడ్ చిత్రం పద్మావత్‌కు వ్యతిరేకంగా హింసకు పాల్పడిన కేసులో స్థానిక కర్ణిసేన చీఫ్ ఠాకూర్ కుషాల్పాల్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గుర్గావ్లో విధ్వంసానికి కారణమైన వారిలో ఇప్పటివరకూ 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పద్మావత్ చిత్ర ప్రదర్శనను నిరసిస్తూ ఆందోళనకారులు బుధవారం గుర్గావ్లో ఓ పాఠశాల బస్సుపై దాడిచేయడంతో పాటు ప్రభుత్వ బస్సుకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుల్ని అరెస్ట్‌చేసి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీస్ పీఆర్వో రవీందర్ కుమార్ చెప్పారు. -
కర్ణిసేన అంత పవర్ ఫుల్లా?
షాహిద్ కపూర్, రణ్ బీర్ సింగ్, దీపికా పదుకొనే నటించిన సినిమా పద్మావత్ ఎంత వివాదాస్పదమైందో, దాన్ని నిషేధించాలని కోరిన కర్ణిసేన అంతకంటే ఎక్కువ పాపులర్ అయింది. శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన అన్నది ఇప్పటికిప్పుడు ఏర్పడిన సంస్థ కాదు. దానికి చాలా చరిత్రే ఉంది. సరిగ్గా సంవత్సరం క్రితం జనవరి 27న జైపూర్‌లో పద్మావతి షూటింగ్ సందర్భంగా చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై దాడికి దిగి బీభత్సం సృష్టించింది ఈ కర్ణిసేనే. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కడమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ శక్తిమంతమైన సంస్థగా ఎదిగింది కర్ణిసేన. పద్మావత్ సినిమా వివాదం పుణ్యమా అని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండే వివిధ రాజపుత్ర సంఘాలన్నింటినీ ఇప్పుడు కర్ణిసేన అనడం పరిపాటైంది. వీటిన్నింటిలోనూ అతి పాతది శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన. దీన్ని 2006లో స్థాపించారు. రాజకీయాల్లో విజయం సాధించలేకపోయిన లోకేంద్ర సింగ్ కాల్వి, బిల్డర్ అజిత్ సింగ్ మామ్డోలి ఈ సంస్థను స్థాపించింది తామేనని చెప్పుకుంటారు. సంస్థను ఏర్పాటు చేసిన కొన్ని నెలల తర్వాత తాను కాల్విని చేరాలని కోరానని అజిత్ సింగ్ చెప్తారు. కాని తాను కూడా సహ వ్యవస్థాపకుడినని కాల్వి వాదిస్తుంటారు. 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరు విడిపోయారు. ఇప్పటికీ ఇద్దరూ శ్రీరాజ్ పుత్ కర్ణిసేన పేరుతో సమాంతర సంస్థలను నడుపుతున్నారు. పేరు విషయంలో ఇద్దరి మధ్య కోర్టు కేసు కూడా నడుస్తోంది. ఈ సంస్థలో 7.64 లక్షల మంది సభ్యులున్నారని కాల్వి అంటారు. అజిత్ సింగ్ మాత్రం తమ సభ్యుల సంఖ్య 2.62 లక్షలని చెప్తారు. ఇంతకీ లోకేంద్ర సింగ్ కాల్వి ఎవరు? పద్మావత్ సినిమాపై నిరసనలు మిన్నంటిన వేళ టీవీల్లో ఎక్కువ కనిపిస్తున్న వ్యక్తి లోకేంద్ర సింగ్ కాల్వి. ఆరడుగుల అజానుబాహుడైన ఆయన సినిమాను నిషేధించాలని కోరుతూ రాజ్‌పుత్‌లను ఏకం చేసేందుకు గడిచిన కొన్ని నెలలుగా ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా కార్యాలయమంటూ ఏమి లేదు. జైపూర్‌లోని ఆయన ఇల్లు లేదా మరో రాజ్‌పుత్ సంఘం శ్రీ రాజ్ పుత్ సభా కార్యాలయం నుంచి ఆయన తన కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ మంత్రివర్గంలో పనిచేసిన కళ్యాణ్ సింగ్ కాల్వి కుమారుడు లోకేంద్ర సింగ్. 1993 లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా, 1998 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండుసార్లు కూడా లోకేంద్ర సింగ్ ఓటమిపాలయ్యారు. 1999లో బీజేపీని వీడి, మరో బీజేపీ మాజీ నేత దేవీ సింగ్ భాటీతో కలిసి రాజ్‌పుత్‌లు సహ అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సోషల్ జస్టిస్ ఫ్రంట్ అనే సంస్థను స్థాపించి ఉద్యమం నిర్వహించారు. అంతే కాదు దాన్ని విస్తృతపరిచి రాజస్థాన్ సామాజిక్ న్యాయ్ మంచ్ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి 2003లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 65 మంది అభ్యర్థులను నిలిపారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కాల్వి, భాటి ఆ తర్వాత తిరిగి బీజేపీలోకి వచ్చారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించి కాల్వి విఫలయ్యారు. 2015లో శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన రాజస్థాన్ శాఖ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడిని కాల్వి బహిష్కరించారు. దీంతో ఆయన శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన పేరుతో సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇవే కాదు పద్మావత్ సినిమాను వ్యతిరేకించే రాజ్‌పుత్ సంస్థలు ఉత్తరాదిన అనేకం ఉన్నాయి. ప్రత్యేకంగా మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా మటుకు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసే సంస్థలే. సంస్థ ఎవరిదనే విషయంలో విభేదాలున్నప్పటికీ చిరకాల ప్రత్యర్థులు జాట్లను ఎదుర్కొనేందుకే శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేనను ఏర్పాటు చేశామని లోకేంద్ర సింగ్, అజిత్ కుమార్ అంగీకరిస్తారు. 2006లో రావణ రాజ్‌పుత్ వర్గానికి చెందిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ సింగ్ తన అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డుతగులుతున్నారనే కారణంతో ఇద్దరు జాట్లను హత్య చేశాడు. దీనిపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన జాట్లకు అన్ని రాజకీయపక్షాల నుంచి మద్దతు లభించింది. దీంతో ఆనంద్‌పాల్ అనుచరులుగా భావించిన రాజ్పుత్లందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వేధింపులను అడ్డుకునేందుకు 11 లక్ష్యాలతో సెప్టెంబర్ 23, 2006న శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన ఏర్పాటైంది. రాజపుత్రల్లో ఐకమత్యాన్ని ప్రోత్సహించడం, రాజపుత్రులకు వ్యతిరేకంగా జరిగే సామాజిక, రాజకీయ దుష్ప్రచారాన్ని అడ్డుకోవడం, చరిత్ర, చారిత్రక సంఘటనలను తప్పుగా చూపడాన్ని వ్యతిరేకించడం వంటివి ఆ 11 లక్ష్యాల్లో కొన్ని. రాజస్థానీయులందరూ ఆరాధించే కర్ణిమాత పేరును సంస్థకు పెట్టారు. చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ 2008లో అశుతోష్ గోవారికర్ నిర్మించిన జోధా అక్బర్ సినిమాను కూడా కర్ణిసేన వ్యతిరేకించింది. ఆ చిత్రాన్ని రాజస్థాన్ ప్రభుత్వం నిషేధించనప్పటికీ అది అక్కడ విడుదల కాలేదు. బ్రాహ్మణులను రక్షించడం క్షత్రియుల కర్తవ్యమంటూ బ్రాహ్మణులపై లాఠీ ఛార్జ్‌ను నిరసిస్తూ 2008లో కర్ణిసేన జైపూర్ బంద్‌కు పిలుపునిచ్చింది. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ 2013లో జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శివిర్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది. రాజస్థాన్‌లో రాజపుత్రులు బీజేపీకి మద్దతుగా నిలవడం, జాట్లు కాంగ్రెస్‌కు అండగా ఉండటం చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. ఈ విషయాన్ని గుర్తించే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పద్మావత్ సినిమాను మార్పులు లేకుండా విడుదలకు అనుమతి వద్దని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. అంతే కాదు ఆ తర్వాత ఆ సినిమాను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు ఆ తర్వాత కొట్టేసింది. ఈ ఏడాది జరిగే రాజస్థాన్ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామని భావిస్తున్న కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణిసేనను వ్యతిరేకించడం సరైన చర్య కాదని భావిస్తోంది. రాజస్థాన్‌లో రాజకీయంగా బాగా పట్టున్న సామాజిక వర్గం రాజ్‌పుత్. రాష్ట్ర జనాభాలో వారు 12శాతముంటారు. కనీస పాతిక అసెంబ్లీ స్థానాల్లో ఫలితాల్ని తారుమారు చేయగల సత్తా ఆ వర్గానికి ఉంది. జాట్లు మినహా మిగిలిన ఏ సామాజికవర్గాలు కూడా రాజస్థాన్‌లో రాజ్‌పుత్‌లను వ్యతిరేకించే పరిస్థితి లేదు. రాజ్‌పుత్‌లు తన సమస్యలపైనే కాదు ఇతర సామాజికవర్గాల సమస్యలపైనా పోరాటం చేస్తుంటారు. ప్రస్తుత రాజస్థాన్ అసెంబ్లీ దాదాపు పాతిక మంది రాజ్‌పుత్ ఎమ్మెల్యేలున్నారు. పద్మావత్ సినిమాను నిషేధించాలని కోరుతూ సంతకాల ఉద్యమం చేపట్టింది జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి. ఆమె బీజేపీ ఎమ్మెల్యే కూడా. ఆర్. పరమేశ్, సాక్షి -
రాహుల్ ‘మౌనం’ కాంగ్రెస్‌కే ప్రమాదం!
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ చిత్రం ‘పద్మావత్’కు వ్యతిరేకంగా ఆరేడు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తూ కర్ణిసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంతవరకు నోరు విప్పి నిర్ద్వందంగా ఖండించక పోవడం పట్ల ప్రగతిశీల పౌరుల్లో విస్మయం వ్యక్తం అవుతుంది. తనకుతాను లౌకికపార్టీగా, ప్రగతిశీల శక్తిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ భావ ప్రకటనా స్వేచ్ఛను వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్‌లను ఎందుకు ఖండించడం లేదు? రాజస్థాన్ రాష్ట్రంలో రానున్న ఉప ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం రాజీపడుతుందా? రాజ్‌పుత్‌లు పార్టీకి దూరం అవుతారని భయపడుతుందా? హర్యానాలో ఓ చిన్న పిల్లల స్కూల్ బస్సుపై జరిగిన రాళ్ల దాడి వార్త దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ‘ఎంత పెద్ద కారణం ఉన్నప్పటికీ పిల్లలపై జరిగిన దాడిని ఎవరూ సమర్థించుకోలేరు’ అంటూ ట్వీట్ ద్వారా మాత్రమే రాహుల్ గాంధీ తేలిగ్గా స్పందించారు. ‘మీరు చేస్తున్నది తప్పు’ అంటూ బహిరంగంగా రాజ్‌పుత్‌లను నిలదీయాల్సిన రాహుల్ మెతక వైఖరిని అవలంబించడాన్ని ప్రగతిశీల పౌరులు, ముఖ్యంగా మేథావులు విమర్శిస్తున్నారు. గోవథను నిషేధిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకొచ్చిన కఠిన చట్టాలను నిరోధించడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత గోరక్షకుల పేరిట జరిగిన దాడుల నుంచి దళితులను, మైనారిటీలను రక్షించడంలో ఇలాంటి మెతక వైఖరి కారణంగానే విఫలమైంది. ఇప్పుడు రాజ్‌పుత్‌ల ఆందోళన పట్ల కూడా రాహుల్ గాంధీ తన మౌనాన్ని కొనసాగించినట్లయితే మున్ముందు అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్నారుగదా! పైగా రాజ్‌పుత్‌లకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైనందున వారంతా బీజేకీ వ్యతిరేకంగా ఉన్నారు కదా! అలాంటి వారిని ఖండించి దూరం చేసుకోవడం ఎందుకు?’ అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండవచ్చు. అప్పుడు ఇక్కడ పార్టీ నైతిక ప్రవర్తన ప్రశ్నార్థకం అవుతుందన్న విషయాన్ని గ్రహించకపోతే ప్రమాదం. పద్మావత్ సినిమాను తమ రాష్ట్రంలో నిషేధించాలంటూ రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినప్పుడు కూడా రాహుల్ గాంధీ అది సరైన మార్గం కాదంటూ నచ్చచెప్పలేకపోయారు. దాంతో కొందరి మనోభావాలను దెబ్బతీసే చారిత్రక చిత్రాలను తీయకపోవడమే మంచిదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ వ్యాఖ్యానించే వరకు వెళ్లింది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కున్న సెక్యులర్ భావాలను చెరిపేస్తాయని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. రాజులకు పుత్రులుగా చెప్పుకునే రాజ్‌పుత్‌ల పూర్వీకులు ఎక్కువగా మొగల్ చక్రవర్తులు దగ్గర సామంత రాజులుగా పనిచేశారు. ఆ తర్వాత బ్రిటీష్ ఇండియా సైన్యంలో చేరి ‘మార్షల్ రేస్ (సుశిక్షితులైన యోధులు)’ అని పిలుపించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భూస్వాములుగా ఉత్తర భారతమంతా విస్తరించారు. రాజస్థాన్‌లో అధికంగా ఉన్న రాజ్‌పుత్ యువత ప్రభుత్వ ఉద్యోగ, విద్యారంగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఆధ్వర్యాన 2006లో ‘శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన’గా ఏర్పడింది. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీలకు అనుకూలంగా మూడు ముక్కలుగా విడిపోయింది. -
లైవ్‌లో మాట్లాడుతుండగానే అరెస్ట్ చేసి..!
సాక్షి, చంఢీగఢ్: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ మూవీ విడుదల కావడంతో కర్ణిసేన దేశంలో పలు చోట్ల విధ్వంసానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలంటూ పిలుపునిస్తున్న కర్ణిసేన కీలకనేత సూరజ్‌పాల్ అమును హర్యానా పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. జాతీయ మీడియాతో పద్మావత్ మూవీపై లైవ్‌లో వ్యతిరేకంగా మాట్లాడుతుండగా అప్రమత్తమైన పోలీసులు సూరజ్‌పాల్‌ను అదుపులోకి తీసుకుని భోండ్సి జైలుకు తరలించారు. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా కర్ణిసేన నేత బయట ఉండటం మంచిది కాదని భావించిన పోలీసులు ఈ నెల 29 వరకూ సూరజ్‌పాల్‌ను జ్యూడిషియల్ కస్టడీలో ఉంచనున్నట్లు సమాచారం. గుర్గావ్ లోని డీసీపీ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించిన అనంతరం ఈస్ట్ జోన్ డీసీసీ కుల్దీప్ సింగ్ మేజిస్ట్రేట్ అధికారాలను వినియోగించి కర్ణిసేన వివాదాస్పదనేత సూరజ్‌పాల్‌ను తమ కస్టడీలో ఉంచడమే ఉత్తమమని నిర్ణయించారు. గురుగ్రామ్‌లో, హర్యానాలో గానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడటంలో భాగంగా వివాదాస్పదనేత కస్టడీకి తీసుకున్నామని, బెయిల్ కూడా నిరాకరించినట్లు వివరించారు. అసాంఘిక శక్తులను రెచ్చగొట్టి, విధ్వంసానికి పాల్పడితే చూస్తు ఊరుకునేది లేదని కర్ణిసేన నేతలతో పాటు మరికొన్ని వర్గాలను డీసీపీ హెచ్చరించారు. పద్మావత్ మూవీలో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్లు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పద్మావత్ చిత్రాన్ని ప్రదర్శించవద్దంటూ కర్ణిసేన ఆందోళనలు చేస్తోంది. 'దీపికా పదుకునే చెవులు, ముక్కు కోసిన వారికి క్షత్రియ కమ్యూనిటీ రూ.కోటి బహుమతిగా ఇస్తుంది' అని క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ సోషల్ మీడియాలో ప్రకటించడం చర్చనీయాంశమైంది. -
హోరెత్తుతున్న కర్ణిసేన ఆందోళనలు
-
భద్రత నడుమ ‘పద్మావత్’
న్యూఢిల్లీ/ముంబై: రెండు నెలలుగా విడుదలకు ఊరిస్తున్న పద్మావత్ చిత్రం పటిష్టమైన భద్రత నడుమ గురువారం దేశవ్యాప్తంగా విడుదలైంది. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, గోవా మినహా మిగిలిన రాష్ట్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించారు. గుర్గావ్లో భారీ సంఖ్యలో సినిమాభిమానులు థియేటర్ల ముందు బారులు తీరారు. సినిమా చూసిన వారు.. ఆందోళలనలు అర్థరహితమని, చిత్రంలో నిరసన చేపట్టాల్సిన సన్నివేశాలేమీ లేవని పేర్కొన్నారు. గుర్గావ్లో చిత్ర విడుదల సందర్భగా మాల్స్, సినీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ హాల్స్ వద్ద పోలీసులతోపాటు బౌన్సర్లతో పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. పద్మావత్ చిత్రాన్ని విడుదలైన తొలిరోజే 10 లక్షల మంది వీక్షించారని ఈ చిత్ర నిర్మాణ సంస్థ వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ తెలిపింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో చిత్రం విడుదల కానప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కర్ణిసేన బంద్ పాక్షికంగానే కొనసాగింది. చిత్ర విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. -
దిగ్విజయ్ కామెంట్స్.. మరింత రెచ్చిపోతారేమో
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మద్దతిచ్చారు. ఓ మతాన్నిగాని, కులాన్నిగానీ కించపరిచే ఏ సినిమాలను కూడా అసలు విడుదల కానివ్వొద్దంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి చిత్రాన్ని అసలు తీయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. పద్మావత్ చిత్రం తమ మనోభావాలను దెబ్బకొట్టిందంటూ గత కొద్ది రోజులుగా శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా వారు హింసాత్మకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో దిగ్విజయ్ వారికి మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశం అయింది. అంతేకాదు.. ఈ ఆందోళన మొత్తానికి కూడా ప్రధాని నరేంద్రమోదీ, ఆయన పార్టీ బీజేపీ అని ఆరోపించారు. గుర్గావ్లో పాఠశాల బస్సుపై జరిగిన దాడిని గురించి స్పందన తెలియజేస్తూ 'మొత్తం దేశాన్ని బీజేపీ మంటల్లోకి నెడుతోంది' అంటూ తీవ్రంగా విమర్శించారు. -
'పద్మావత్'కు మరోషాక్ :ఎఫ్బీలో ఫుల్ మూవీ
ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనల మధ్య సంజయ్ లీలా భన్సాలీ మూవీ 'పద్మావత్' నేడు(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అటు కర్ణిసేన ఆందోళనలతో తీవ్ర చిక్కుల్లో కూరుకున్న ఈ మూవీకి, ఓ ఫేస్బుక్ పేజీ కూడా తీవ్ర షాకిచ్చింది. పద్మావత్ ఫుల్ మూవీని ఫేస్బుక్లో లీక్ చేసింది. ' జాటోన్ కా అడ్డ' అనే ఫేస్బుక్ పేజీ, థియేటర్లో స్క్రీన్ అవుతున్న ఈ మూవీని లైవ్ స్ట్రీమ్ చేసింది. ఇలా లైవ్ స్ట్రీమ్ అవుతున్న సమయంలోనే ఈ ఫేస్బుక్ పేజీ లింక్‌ను 15వేల మంది షేర్ చేయగా... ఈ వీడియోకు 3.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే కర్ణిసేన విధ్వంసనలతో తీవ్రంగా ఆందోళన చెందుతున్న మూవీ యూనిట్ సభ్యులకు ఇది మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల ఆపివేశారు. రాజ్‌పుత్‌ల ప్రభావం బలంగా ఉండడం, ప్రజల సెంటిమెంట్, కర్ణిసేన హెచ్చరికలు తదితర కారణాల వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనే భావనతో ఇక్కడ మల్టీప్లెక్స్ యజమానుల సంఘం సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పద్మావత్ ప్రదర్శన సాఫీగా సాగుతోంది. దీపికా పదుకోన్, షాహిద్ కపూర్, రణ్వీర సింగ్‌లు ఈ సినిమాలో ప్రధాన పాత్రదారులుగా నటించారు. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా చూడ్డానికి బాగుందంటూ మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయినప్పటికీ కర్ణిసేన ఆందోళనలను మాత్రం తగ్గించడం లేదు. -
'దీపికా చెవులు, ముక్కు కోస్తే కోటి రూపాయలు'
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటికే దాదాపు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తగులబెడుతూ విధ్వంసానికి పాల్పడుతున్న కర్ణిసేన మరింత ఆగ్రహంతో రగిలిపోతోంది. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పద్మావత్ చిత్రాన్ని విడుదల చేయాడానికి వీల్లేదంటూ ఆందోళనలు చేస్తున్నా ఆ సినిమా గురువారం విడుదల కావడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ ఈ చిత్రంలో పద్మావత్‌గా నటించిన దీపికా పదుకొనేపై నిప్పులు చెరిగాడు. 'దీపికా పదుకునే చెవులు, ముక్కులు కోసినవారికి క్షత్రియ కమ్యూనిటీ రూ.కోటి బహుమతిగా ఇస్తుంది' అని ఆయన ప్రకటించారు. తన అధికారిక ట్విటర్ పేజీలో ఈ మేరకు సంచలన ఆఫర్ చేశారు. ఇదిలా ఉండగా, పద్మావత్ చిత్రం విడుదల అయినప్పటికీ ఆందోళనలు ఎక్కడా ఆగడం లేదు. పోలీసులు ఎక్కడివారిని అక్కడ నిర్బందంలోకి తీసుకుంటున్నా ఏ మాత్రం వారు వెనక్కి తగ్గడం లేదు. గురువారం దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా జరగుతున్నాయి. మహిళలు కూడా పెద్ద మొత్తంలో ఈ ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. కొంతమంది కత్తులతో రోడ్లపై వీరంగం చేస్తున్నారు. మాల్స్‌పై కూడా దండయాత్రలు చేస్తున్నారు. Kshatriya community will contribute & give the person a reward of Rs 1 Crore who chops off Deepika Padukone's ears and nose: Gajendra Singh, President Kshatriya Mahasabha (24.1.2018) #Padmaavat pic.twitter.com/OP9R4EmaG1 — ANI UP (@ANINewsUP) 25 January 2018 -
శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన ఎవరిది?
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’కు వ్యతిరేకంగా ఐదారు రాష్ట్రాల్లో కర్ణిసేన అల్లర్లు సష్టిస్తున్న నేపథ్యంలో ఈ సేన ఎప్పుడు పుట్టింది ? ఎందుకు పుట్టింది ? దీనికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు ? అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు రావడం సహజమే. రాజస్థాన్ రాజ్‌పుత్ సామాజిక వర్గానినికి చెందిన నిరుద్యోగ యువత 2006 సంవత్సరంలో ‘శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన’ను ఏర్పాటు చేసింది. అప్పటికే రాజ్‌పుత్ నాయకుడిగా ఆ కమ్యూనిటీలో మంచి గుర్తింపు ఉన్న లోకేంద్ర సింగ్ కల్వీ అండదండలతో అది ప్రాణం పోసుకుంది. కులాల ప్రాతిపదికన తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసింది. కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లను రాజ్‌పుత్ రాజకీయ నాయకులు మొదటి నుంచి వ్యతిరేకిస్తుండగా, శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన ఏర్పాడ్డాక హఠాత్తుగా వారి వైఖరి మారింది. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా వారి వైఖరి అదే. ఆ తర్వాత తమ నాయకుల రాజకీయ సమీకరణల కారణంగా ఈ సేనలో చీలికలు వచ్చి మూడు గ్రూపులుగా సేన విడిపోయింది. తొలిగ్రూపు శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన కాగా, రెండో గ్రూపు రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేనా సమితి, మూడో గ్రూపు శ్రీరాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన. శ్రీరాజ్‌పుత్ కర్ణిసేనను లోకేంద్ర సింగ్ కల్వీ ఏర్పాటు చేసినప్పుడు సేనకు అధ్యక్షుడిగా అజీత్ సింగ్ మందోలిని నియమించారు. 2008లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చినప్పుడు తనకు కాంగ్రెస్ టిక్కెట్ కావాలని మందోలి పట్టుపడ్డారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కల్వీ టిక్కెట్‌ను ఆశిస్తున్నందున ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో మొదటిసారిగా కర్ణిసేన విడిపోయింది. ఆ తర్వాత 2010లో మూడో వర్గం ఏర్పడింది. రెండు లక్షల మంది సభ్యులున్నారని చెప్పుకుంటున్న ఆవిర్భావ సంస్థ ‘శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన’నే ప్రస్తుతానికి బలమైన గ్రూపు. ఉమ్మడి లక్ష్యాల కోసం ఏ ఆందోళనలు చేసినా ఈ మూడు గ్రుపులు పోటాపోటీగా వ్యవహరిస్తాయి. ఆందోళనల సందర్భంగా విధ్వంసానికి దిగడంలో కర్ణిసేనలకు పెట్టింది పేరు. అశుతోశ్ గోవరికర్ తీసిన ‘జోధా అక్బర్’ బాలీవుడ్ సినిమాను 2006లో అడ్డుకోవడం ద్వారా కర్ణిసేన పేరు మొదటిసారి దేశవ్యాప్తంగా వినిపించింది. ఇప్పుడు పద్మావత్ సినిమాను అడ్డుకోవడం ద్వారా ఆ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెల్సింది. -
'ఆ క్షణంలో బస్సు ఆపినట్లయితే ఏం జరిగేదో..'
సాక్షి, న్యూఢిల్లీ : 'పద్మావత్' సినిమా వివాదం వారి జీవితాల్లో మర్చిపోలేని సంఘటనగా మిగిలింది. 30మంది చిన్నారులకు, ఓ టీచర్‌కు, బస్సు డ్రైవర్‌కు, కండక్టర్‌కు పెద్ద భయానక అనుభవంగా గుర్తుండిపోనుంది. ఆ సమయంలో డ్రైవర్ బస్సు ఆపి ఉన్నట్లయితే, బహుశా! చెప్పవీలుకానీ దుర్ఘటన చోటుచేసుకుని చరిత్రలో ఓ చెరిగిపోని మరకగా మిగిలి ఉండేదేమో. పద్మావత్ చిత్రం విడుదలను ఆపేయాలంటూ గుర్గావ్లో ఆందోళన చేస్తున్న కర్ణిసేనకు చెందినవారు కొంతమంది ఓ పాఠశాల బస్సుపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఎలాజరిగిందనే విషయాన్ని కండక్టర్‌ను అడిగి తెలుసుకోగా ఒళ్లు గగుర్పొడిచే అనుభవాన్ని చెప్పాడు. 'సరిగ్గా మేం స్కూల్ నుంచి బయలుదేరి 7కిలో మీటర్ల వరకు వచ్చాం. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఓ బస్సు తగలబడిపోతుండటాన్ని మేం చూశాం. పోలీసులు ఆందోళన కారులను చెదరగొడుతున్నారు.. వారు మాత్రం తిరిగి దాడి చేస్తున్నారు. చెట్ల పొదల్లో నుంచి అనూహ్యంగా మా బస్సు వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో స్కూల్లో 30మంది నర్సరీ చదువుతున్న చిన్నారులు ఉన్నారు. దాదాపు 60మంది ఆందోళన కారులు రాళ్లు విసరడం మొదలుపెట్టారు. దాంతో చిన్నారులు ఏడ్వడం మొదలుపెట్టారు. అందులోని టీచర్ వారిని ఓదార్చడం మొదలుపెట్టింది. అన్ని వైపుల నుంచి రాళ్లు రావడం మొదలయ్యాయి. దాంతో చిన్నారులను సీట్ల కింద దాచి ఉంచే ప్రయత్నం చేశాం. ఒక పెద్ద బండరాయి వచ్చి ముందు అద్దాన్ని బద్ధలు కొట్టింది. దాంతో ఇక ఎంత నష్టం జరిగినా పర్వాలేదని డ్రైవర్, నేను నిర్ణయించుకున్నాం. బస్సును ముందుకు పోనిచ్చాం. పిల్లల ప్రాణాలు ముఖ్యం అని భావించి బస్సును వేగంగా ముందుకు తీసుకెళ్లాం. అప్పటికీ కొంతమంది వెదురు బొంగులతో వెంబడించారు. వెళ్లే క్రమంలోనే గాయపడిన చిన్నారులకు ప్రథమ చికిత్స చేశాం. ఆ సమయంలో బస్సును ఆపినట్లయితే ఏం జరిగి ఉండేదో కూడా ఊహించలేకపోయేవాళ్లం' అని వెల్లడించాడు. ఈ సంఘటన మొత్తం దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే. -
పద్మావత్‌పై పంతం
-
ఆ నాలుగు రాష్ట్రాల్లో పద్మావత్ విడుదల కాలేదు
-
స్కూల్ బస్సుపై దాడి.. రాహుల్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ‘పద్మావత్’ సినిమా విషయంలో విధ్వంసాలకు దిగుతున్న కర్ణిసేన వ్యవహార శైలి తీవ్ర వివాదం రేపుతోంది. చిన్న పిల్లలు ఉన్నారన్న కనీస విచక్షణ చూపకుండా స్కూల్ బస్సుపై కర్ణిసేన కార్యకర్తలు దాడులు చేయడం విమర్శలకు తావిస్తోంది. స్కూల్ బస్సుపై కర్ణిసేన దాడులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ‘పిల్లలపై హింసకు కారణం ఎంతపెద్దదైనా అది ఎన్నటికీ సమర్థినీయం కాదు. హింస, విద్వేషాలు బలహీనుల ఆయుధాలు. బీజేపీ హింసను, విద్వేషాన్ని ఉపయోగించుకుంటూ దేశాన్ని తగులబెడుతోంది’ అని రాహుల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పద్మావత్ సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కర్ణిసేన కార్యకర్తలు బుధవారం సాయంత్రం గురుగ్రామ్‌లో జీడీ గోయెంకా పాఠశాల బస్సుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. స్కూల్ టైం ముగించుకొని పిల్లలతో ఇంటికి బయల్దేరిన బస్సును నిరసనకారులు మధ్యలోనే అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని బస్సును ముందుకు పంపించే ప్రయత్నం చేసేలోపే నిరసనకారులు రెచ్చిపోయి.. దాడి చేశారు. బస్సులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా రాళ్లవర్షం కురిపించారు. దీంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. సీట్లు, బస్సు ఫ్లోర్ అంతా కూడా అద్దాలతో నిండిపోయింది. ఒక్కసారిగా రాళ్లు దూసుకురావడంతో పిల్లలు బిక్కచచ్చిపోయారు. ప్రాణభయంతో వణికిపోయారు. బస్సులో ఉన్న ఉపాధ్యాయులు పిల్లలకు దెబ్బలు తగలకుండా చూసుకున్నారు. సీట్ల కింద దాక్కోవాలని, ఫ్లోర్‌పై పడుకోవాలంటూ గట్టిగా హెచ్చరించారు. చిన్న చిన్న పిల్లలను దగ్గరికి తీసుకొని వారు బెదిరిపోకుండా చూసుకున్నారు. ఈ ఘటనలో కర్ణిసేన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదని, కర్ణిసేన రాళ్లు రువ్వుతూ.. పోలీసులతో కొట్లాడుతున్న సమయంలో ఈ ఘర్షణల్లో చిక్కుకోకుండా చాకచక్యంగా అక్కడి నుంచి బస్సును వేరేరూట్లోకి తరలించానని డ్రైవర్ తెలిపారు. -
హోరెత్తుతున్న కర్ణిసేన ఆందోళనలు
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ‘పద్మావత్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకావడంతో ఈ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన విధ్వంసాలకు దిగుతోంది. పలు రాష్ట్రాల్లో సినిమాకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు జరుపుతోంది. ముఖ్యంగా రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో తొలిరోజు ‘పద్మావత్’ విడుదల నిలిచిపోయింది. ఈ రాష్ట్రాలు మొదటి నుంచి సినిమా విడుదలను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌పుత్‌ల ప్రభావం బలంగా ఉండడం, ప్రజల సెంటిమెంట్, కర్ణిసేన హెచ్చరికలు తదితర కారణాల వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనే భావనతో ఇక్కడ మల్టీప్లెక్స్ యజమానుల సంఘం సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించింది. కర్ణిసేన ఆందోళనలు ఇలా.. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో కర్ణిసేన దుకాణాలపై విరుచుకుపడి విధ్వంసాలకు పాల్పడింది. రాజస్థాన్ జైపూర్‌లో పద్మావత్‌కు వ్యతిరేకంగా కర్ణిసేన బైక్ ర్యాలీ చేపట్టింది బిహార్ ముజఫర్‌పూర్‌లో కర్ణిసేన ఆందోళనకారులు తల్వార్లు ప్రదర్శిస్తూ.. టైర్లు తగలబెడుతూ నిరసన తెలిపారు తమిళనాడులో పద్మావత్‌కు శ్రీరామసేన ఆందోళన గుజరాత్ అహ్మదాబాద్‌లో పద్మావత్ సినిమా థియేటర్ల వద్ద భారీ భద్రత.. వారణాసిలో పద్మావత్ థియేటర్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి యత్నం చేసిన యువకుడు. అడ్డుకున్న పోలీసులు దక్షిణాది రాష్ట్రాల్లో సాఫీగా.. దక్షిణాది రాష్ట్రాల్లో పద్మావతి ప్రదర్శన సాఫీగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 400పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు థియేటర్ల వద్ద పోలీసుల బందోబస్తును ఏర్పాటుచేశాయి. బాగుందన్న టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. -
థియేటర్లలోకి పద్మావత్.. టెన్షన్.. టెన్షన్!
సాక్షి, ముంబై: వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న సంజయ్‌లీలా భన్సాలీ తాజా చిత్రం ‘పద్మావత్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్ణిసేన ఆగ్రహావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సినిమా విడుదలవుతోంది. దేశవ్యాప్తంగా ‘పద్మావత్’ సినిమా విడుదల అవుతున్న థియేటర్ల వద్ద భారీ భద్రత కల్పించారు. మరోవైపు ‘పద్మావత్’ సినిమా రాజ్‌పుత్‌లకు అనుకూలంగా ఉందని కథనాలు వెలువడుతున్నా.. కర్ణిసేన ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని కర్ణిసేన అంటోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో హింస చోటుచేసుకోవడం, కర్ణిసేన మూకలు దాడులకు దిగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. సినిమా విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన ఏమైనా అవాంఛనీయ ఘటనలకు దాడులకు పాల్పడుతుందా? అన్నది టెన్షన్ రేపుతోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ‘పద్మావత్’ మార్నింగ్‌షోలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పుణెలోని ఈస్క్వేర్ థియేటర్లో ఎలాంటి అలజడి, ఆందోళన లేకుండా మార్నింగ్ షోలు నడుస్తున్నాయి. కర్ణిసేన బెదిరింపుల నేపథ్యంలో థియేటర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. చాలా నగరాల్లో మార్నింగ్‌షోలు ప్రశాంతంగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ‘పద్మావత్’ థియేటర్ల వద్ద పోలీసులు అప్రమత్తంగా భద్రత కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కర్ణిసేన ఆందోళనల నేపథ్యంలో గురుగామ్‌లోని పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గురుగామ్‌లోని ఓ స్కూల్ బస్సుపై కర్ణిసేన దాడులు చేసి విధ్వంసానికి దిగడంతో పిల్లలను బడులకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కారణంగానే ఈ భయానక పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు అంటున్నారు. -
పాలన ఇలాగేనా?!
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘రాణి పద్మిని’ పేరుతో ప్రారంభించిన చిత్రం ‘పద్మావతి’గా, ఆ తర్వాత ‘పద్మావత్’గా మారడమే కాదు... సెన్సార్ బోర్డు కత్తిరింపులనూ, ఆ సినిమాపై కత్తులు నూరిన కర్ణిసేన ‘మనో భావాలను’ గుర్తించి మసులుకున్నా దానికి కష్టాలు తప్పలేదు. 68వ గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు గురువారం అది దేశవ్యాప్తంగా విడుదల కాబో తుండగా అన్ని రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అల్లరి మూకలు వీధుల్లో వీరంగం వేస్తున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. థియేటర్లు, షాపింగ్ మాల్స్, బస్సులు, కార్లు, మోటారు సైకిళ్లు, ఇతర ఆస్తులు తగలబడుతున్నాయి. హర్యానాలోని గురుగ్రాంలో పసివాళ్లతో వెళ్తున్న పాఠశాల బస్సును కూడా వదలకుండా రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. అందులోని పిల్లలనూ, టీచర్లునూ భీతావహుల్ని చేశారు. మరో పాఠశాల బస్సును దహనం చేశారు. సెన్సార్ బోర్డు అనుమతి లభించిన ‘పద్మావత్’ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని, దానికి అన్నివిధాలా భద్రత కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పాక కూడా ఇదంతా యధేచ్ఛగా సాగుతోంది. వీధుల్లోకి వస్తున్న వేలమందిని నియంత్రించడానికి అవసరమైన పోలీసు బందోబస్తు కల్పించకుండా ఆ ప్రభుత్వాలన్నీ అటు రాజ్యాంగబద్ధమైన కర్తవ్యాన్ని, ఇటు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనూ బేఖాతరు చేశాయి. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులే కర్ణిసేనతో సమానంగా, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువగా ఆ చిత్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని గుర్తుంచుకుంటే ఇలాంటి హింసాత్మక ఘటనలు అక్కడే ఎందుకు చోటుచేసుకుంటున్నాయో సులభంగానే అర్ధమవుతుంది. పైగా ఈ గొడవంతకూ బాధ్యత ‘పద్మావత్’ తీసిన సంజయ్ లీలా భన్సాలీదేనని హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రకటించి అందరినీ నివ్వెరపరిచారు. ఈసారి గణతంత్ర దినోత్సవానికి సింగపూర్, ఇండొనేసియా, మలేసియా, వియత్నాం, బ్రూనై తదితర ఆగ్నేయాసియా దేశాల(ఆసియాన్) అధినేతలు పదిమంది ముఖ్య అతిథులుగా వస్తున్నారని, వారు దేశంలో అడుగుపెట్టిన రోజున చానెళ్లన్నిటా ఈ హింసే ప్రధాన వార్తయితే దేశం పరువు పోతుందన్న కనీస జ్ఞానం కూడా అక్కడి ప్రభుత్వాలకు కొరవడింది. గురుగ్రామ్ బహుళజాతి సంస్థలకు ప్రసిద్ధి. అక్కడ అనేక భారీ పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, సాఫ్ట్వేర్ సంస్థలు పనిచేస్తున్నాయి. వేలకొలది కార్మికులు, ఉద్యో గులు ఆ నగరంలో పనిచేస్తున్నారు. పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ అక్కడ వందల సంఖ్యలో విద్యా సంస్థలున్నాయి. అది దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో భాగం. అలాంటిచోట అల్లరిమూకలు రోడ్లపైకొస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు... కేంద్ర ప్రభుత్వానికి సైతం అప్రదిష్ట. చిత్ర మేమంటే ఇంతచేటు హింస జరిగినా బీజేపీ ప్రతినిధులెవరూ చానెళ్లలో జరిగిన చర్చలకు రాలేదు. ఆ పార్టీ వైఫల్యాలను సొమ్ము చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించే ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మోహం చాటేసింది. ఈమధ్య వ్యంగ్యమైన ట్వీట్లు ఇవ్వడంలో ముందుంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం పత్తాలేరు. కులాల పేరిటా, మనోభావాల పేరిటా ఎవరు ఏం చేసినా దేశ ప్రజలకు దిక్కూ మొక్కూ లేదన్నమాట! మన రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛతో సహా ఎన్నో హక్కుల్ని కల్పించింది. చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పింది. ఏవో కొన్ని గ్రూపులు మతం పేరు చెప్పుకుని, కులం పేరు చెప్పుకుని మనోభావాలు దెబ్బ తిన్నాయని రోడ్డెక్కుతుంటే, సమాజం మొత్తంపై తమ అభిప్రాయాలను బల వంతంగా రుద్దాలని ప్రయత్నిస్తుంటే ప్రభుత్వాలన్నీ చేష్టలుడిగి చూస్తున్నాయి. తమకు నచ్చని అభిప్రాయాలను వ్యక్తం చేసిన వ్యక్తులపై, సంస్థలపై విరుచుకుపడే ఈ ప్రభుత్వాలు ఇలాంటి గ్రూపుల ముందు సాగిలపడుతున్నాయి. వాటికి వ్యతిరేకిస్తే తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందన్న భయంతో వణుకుతున్నాయి. ఆ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనైనా ధిక్కరించడానికి సాహసిస్తు న్నాయి. అది చలనచిత్రం కావొచ్చు... ఒక పుస్తకం కావొచ్చు... మరో కళాత్మక చిత్రం కావొచ్చు–దేన్నయినా నచ్చలేదని, విభేదిస్తున్నానని చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. మన రాజ్యాంగం సైతం హక్కులకు కొన్ని పరిమితులను కూడా విధించింది. కానీ ఆ పరిమితుల పేరిట భావప్రకటన హక్కునే కాలరాయాలని చూడటం ప్రభు త్వాలకైనా, ప్రైవేటు గ్రూపులకైనా తగని పని. కేజ్రీవాల్‌పై ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మాన్’ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీలో తనకు సంబంధించి పెట్టిన పాత్రను వక్రీకరించారని, అది న్యాయస్థానంలో తనపై ఉన్న కేసును ప్రభావితం చేసేలా ఉన్నదని ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మొన్న నవంబర్‌లో తీర్పునిస్తూ సృజనాత్మకతకు సంకెళ్లు విధించే ధోరణులను అనుమతించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. మనోభావాలు దెబ్బతిన్నాయన్న పేరిట సృజనాత్మక వ్యక్తీకరణలను శిలువ ఎక్కించడం తగదన్నది. ఆ తీర్పు వెలువడి మూడు నెలలైనా కాలేదు... ప్రభుత్వాలన్నీ ‘పద్మావత్’పై పగబట్టినట్టు వ్యవహరించాయి. ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చి దాదాపు 25 రోజులవుతోంది. ఆ సినిమా చూడనే చూడం... మేం వద్దన్నాం గనుక విడుదలను ఆపాల్సిందేనని ఆగ్రహించే కర్ణిసేన సంగతలా ఉంచి ప్రభుత్వాల్లో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారో, బీజేపీ ముఖ్యులో దాన్ని వీక్షించి ఏమున్నదో తెలుసుకుంటే, వాటిపై తమకున్న అభ్యంతరాలేమిటో న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే వేరుగా ఉండేది. నిజానికి చిత్రం చూసినవారు అది రాజపుట్ గౌరవప్రతిష్టలను, పద్మావతి పాత్రను ఉన్నతంగా చూపిందని అంటున్నారు. కనీసం నిజానిజాలేమిటో తెలుసు కోవాలన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించేవారిని అదుపు చేయలేకపోతే చట్టబద్ధ పాలన దెబ్బతింటుందని, అది అంతిమంగా అరాచకానికి దారితీస్తుందని ప్రభు త్వాలు గ్రహించాలి. -
‘పద్మావత్’ నిరసనలు హింసాత్మకం
జైపూర్/ముంబై/అహ్మదాబాద్: ‘పద్మావత్’ చిత్రం విడుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. హరియాణాలోని గుర్గావ్లో ఆందోళనకారులు ఓ స్కూలు బస్సుపై రాళ్లురువ్విన ఘటనలో అందులో ఉన్న విద్యార్థులు, టీచర్లు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలోని ఈ చిత్రం గురువారం దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో కర్ణిసేన, పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. మాల్స్, సినిమా హాళ్లలో విధ్వంసం సృష్టించారు. చాలాచోట్ల హైవేలను దిగ్బంధించారు. గుర్గావ్, రాజస్తాన్ సహా ముంబై, నాసిక్, లక్నో, ఇండోర్ తదితర ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కాగా, ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాల్లేవని చిత్ర బృందం మరోసారి స్పష్టం చేసింది. రాజ్‌పుత్ గౌరవాన్ని పెంచే దృశ్యాలే ఉంటాయని పునరుద్ఘాటించింది. కాగా, ఆందోళనల నేపథ్యంలో గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోవటం లేదని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆస్తుల విధ్వంసం పద్మావత్ చిత్రం విడుదలను వ్యతిరేకిస్తూ.. రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీల్లో ఆందోళనలు మిన్నంటాయి. జైపూర్‌లో నిరసనకారులు రెండు బస్సులను ధ్వంసం చేశారు. రోడ్రోకోలతో రోడ్లపై నిరసన చేపట్టారు. ముంబై, నాసిక్లలోనూ నిరసనలు జరిగాయి. చిత్రం ప్రదర్శించేందుకు సిద్ధమైన మూడు మల్టీప్లెక్స్‌ల ముందు నిలిపి ఉంచిన 30 బైకులు, స్కూటర్లకు నిరసనకారులు నిప్పంటించారు. ఆందోళన నేపథ్యంలో శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన తీవ్రంగా మండిపడింది. మహారాష్ట్రలో చిత్ర ప్రదర్శనను అడ్డుకునేందుకు శివసేన మద్దతు తెలిపిందని కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కాల్వీ వెల్లడించారు. చిత్రంలో రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖల్జీ మధ్య శృంగార భరిత దృశ్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. చిన్నారులని చూడకుండా..! గుర్గావ్.. మధ్యాహ్నం 3 గంటలవుతోంది. స్కూలు ముగించుకున్న విద్యార్థులను తీసుకుని జీడీ గోయెంకా స్కూలు బస్సు బయలుదేరింది. రోడ్డుపై ‘పద్మా వత్’ నిరసనకారులు రాస్తారోకో చేయటంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. దాని ముందు న్న గోయెంకా స్కూలు బస్సుపై రాళ్లతో దాడిచేశారు. ఆ సమయంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకున్న విద్యార్థులు, కొందరు టీచర్లు కూడా బస్సులో ఉన్నారు. రాళ్లదాడితో విద్యార్థులు భయంతో వణికిపోయారు. తప్పించుకునేందుకు అవకాశం లేకపోవటంతో ఏడు స్తూ సీట్లకింద నక్కారు. రోడ్డు పక్కనున్న వారు తీసిన వీడియోలో ఈ హృదయవిదారక దృశ్యాలు ఆవేదన కలిగించాయి. -
పద్మావత్ థియేటర్లను తగలపెట్టిన కర్ణిసేన
పద్మావత్(పద్మావతి) సినిమా విడుదల సందర్భంగా గుజరాత్లో హింస చెలరేగింది. వివాదాలకు చిరునామాగా నిలిచిన పద్మావత్ చిత్రం విడుదల సందర్భంగా గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. మొదటి నుంచి సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించిన కర్ణిసేన అన్నంత పని చేసింది. గుజరాత్, అహ్మదాబాద్‌లో సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లు, షాపింగ్ మాల్స్‌పై దాడులకు దిగారు. సినిమా విడుదలకు సిద్దమౌతున్న హిమాలయ, అహ్మదాబాద్ వన్ మాల్స్, మరో సినిమా థియేటర్‌ను కర్ణిసేన కార్యకర్తలు తగలపెట్టేశారు. పార్కింగ్ ప్రదేశాల్లో, రోడ్లపై ఉన్న సుమారు 150 వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు, పరిస్థితి అదుపు తప్పడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరకొట్టారు. దీనిపై రాష్ట్ర డీజీపీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. అంతేకాకుండా సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లకు సెక్యూరిటీ పెంచారు. ఆందోళనలపై స్పందించిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శాంతి పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అల్లర్లకు సంబంధించిన వీడియోని గుజరాత్ పోలీసులు విడుదల చేశారు. ఈ వీడియో ఉన్న వ్యక్తులు తమను ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్‌లు ధరించి థియేటర్లపై రాళ్లతో దాడులకు పాల్పడగా మరికొంత మంది రోడ్డుపై ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. గుజరాత్లో చెలరేగిన హింస, గంటల్లోనే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యాపించింది. మద్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లలో కర్ణిసేన కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కాన్పూర్‌లో ఓ షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశించిన ఆందోళనకారులు, అక్కడి సిబ్బందిపై దాడలకు పాల్పడ్డారు. సినిమా ప్రదర్శించొద్దంటూ అక్కడున్న సినిమా పోస్టర్లను చించిపడేశారు. ఇండోర్, మొరేనా, గ్వాలియర్లలో ఆందోళనలు నిర్వహించారు. ఉజ్జయనీలో ఓథియేటర్‌పై దాడికి యత్నించిన వారిని స్థానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రామ్‌లో అల్లర్లను అదుపు చేయాడానికి 144 సెక్షన్ విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకూ ఎవరూ గుంపులగా తిరగొద్దంటూ అహ్మదాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అల్లర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులకోసం గాలిస్తున్నారు. వరుస ఆందోళనల నేపథ్యంలో థియేటర్ యజమానులు సినిమా ప్రదర్శించట్లేదంటూ బయట బోర్డులు పెట్టారు. -
సుప్రీంకోర్టులో పద్మావత్‌కు మరోసారి ఊరట
-
‘పద్మావత్’కే సుప్రీం మద్దతు ; రాష్ట్రాలకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ సినిమాకు అత్యున్నత న్యాయస్థానంలో మరోసారి మద్దలు లభించింది. సినిమా విడుదలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చబోనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలను నిలిపేయాలంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు మంగళవారం కొట్టివేశారు. దీంతో జనవరి 25న ‘పద్మావత్’ యధావిధిగా విడుదలకానుంది. రాష్ట్రాలదే బాధ్యత : పద్మావత్ ప్రదర్శించలేమంటూ పిటిషన్ వేసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ‘శాంతిభద్రత పరిరక్షణ రాష్ట్రాల బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించలేమని చేతులెత్తేయడం సరికాదు. జనవరి 25న సినిమా విడుదలవుతుందన్న గత ఆదేశాల్లో మార్పుల్లేవు’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వెనక్కి తగ్గిన కర్ణిసేన? : అత్యున్నత న్యాయస్థానంలో పద్మావత్‌కు అనుకూలంగా తీర్పులు వస్తుండటంతో ఇరకాటంలోపడ్డ కర్ణిసేన పునరాలోచనలోపడ్డట్లు సమాచారం. సినిమాకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలకు నేతృత్వం వహిస్తోన్న కర్ణిసేనకు పద్మావత్ దర్శకుడు భన్సాలీ సైతం ప్రత్యేక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘ముందు మీరంతా సినిమా చూడండి. ఆ తర్వాత మీ ఇష్టం..’ అని భన్సాలీ కోరారు. సోమవారం కూడా ఉధృతంగా సాగిన ఆందోళనలు.. మంగళవారం నాటికి కాస్త తగ్గుముఖం పట్టడాన్ని బట్టిచూస్తే భన్సాలీ లేఖకు సానుకూలఫలితం వచ్చినట్లేనని సినీవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆందోళన విరమించే విశయమై కర్ణిసేన ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. రక్షణ కల్పిస్తాం : ముంబై, హరియాణా పోలీసులు ‘పద్మావత్’ విడుదలకు సంబంధించి సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఆ సినిమాను ప్రదర్శించబోయే థియేటర్లకు రక్షణ కల్పిస్తామని ముంబై పోలీసు శాఖ ప్రకటించింది. అటు హరియాణా ప్రభుత్వం కూడా సినిమా హాళ్ల వద్ద పహారాకు హామీ ఇచ్చింది. థియేటర్ యాజమాన్యాలు ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని పోలీసులు పేర్కొన్నారు. -
'మేం చూశాకే ఆ సినిమా భవిష్యత్ తేలుస్తాం'
సాక్షి, ముంబయి : అభ్యంతరకర అంశాలు ఏవీ కూడా పద్మావత్ చిత్రంలో లేవని కావాలంటే ఆ సినిమాను ముందే చూడొచ్చని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఇచ్చిన ఆఫర్‌కు శ్రీ రాజ్పుట్ కర్ణిసేన అంగీకరించింది. ఎట్టి పరిస్థితుల్లో పద్మావత్ చిత్రాన్ని విడుదలకానివ్వబోమని ప్రకటించిన కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మరికొద్ది సేపటికే తాను పద్మావత్ చూసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనతోపాటు తన ఉద్యమ బృందంలో పనిచేస్తున్నవారు కూడా ఈ సినిమాను చూస్తారని తెలిపారు. 'మాకు ఓ లేఖ అందింది. మేం ఆ చిత్రాన్ని చూడాలని కోరుతూ ఆ లేఖలో భన్సాలీ రాశారు. బహుశా మేం తిరస్కరిస్తామని ఆయన అనుకోవచ్చు.. కానీ మేం అంగీకరిస్తున్నాం. సినిమా చూసేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం చూశాకే ఆ సినిమా దేశ వ్యాప్తంగా విడుదల చేసుకోవచ్చా లేదా కొంతమందే ఈ సినిమా చూడాలా అనే విషయం చెబుతాం. అలాగే, సెన్సార్ బోర్డు ముగ్గురు మాత్రమే ఈ సినిమా చూడాలని మరో ఆరుగురుని పక్కన పెట్టింది. అయితే, ఆ ఆరుగురితోపాటు జర్నలిస్టులు కూడా ఈ సినిమాను చూడాలి' అని కల్వి అన్నారు. -
‘పద్మావత్’ని ఆపండి
న్యూఢిల్లీ/జైపూర్: సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావత్ చిత్రం విడుదలపై రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దేశవ్యాప్తంగా జనవరి 25న పద్మావత్ చిత్ర ప్రదర్శనకు అనుకూలంగా ఇంతకుముందు ఇచ్చి న తీర్పును వెనక్కి తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాయి. ఇరురాష్ట్రాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం, ఈ మధ్యంతర పిటిషన్లను మంగళవారం విచారించేందుకు అంగీకరించింది. పద్మావత్ చిత్ర ప్రదర్శనపై గుజరాత్, రాజస్తాన్ ప్రభుత్వాలు విధించిన నిషేధాన్ని ఈ నెల 18న కోట్టేసిన సుప్రీం.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు అనుమతిచ్చింది. ఈ సినిమా బృందంతో పాటు ప్రేక్షకులకు సైతం రక్షణ కల్పించాలనీ, చిత్ర ప్రదర్శనను అడ్డుకునే చర్యలు తీసుకోరాదని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. పద్మావత్ చిత్రం విడుదలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ రాజస్తాన్‌లోని చిత్తోడ్గఢ్లో నిర్వహించిన ‘స్వాభిమాన్ ర్యాలీ’లో రాజ్‌పుత్ మహిళలు కత్తులు పట్టుకుని భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ చిత్రం విడుదలను నిషేధించకపోతే ఆత్మగౌరవంతో చనిపోవడానికి వీలుగా యాక్టివ్ యూథనేషియా (అనాయాస మరణం)కు అనుమతించాలని వీరు రాష్ట్రపతికి లేఖ రాయాలని నిర్ణయించారు. పద్మావత్ చిత్రం విడుదలను నిలిపివేయకుంటే రాణి పద్మిని తరహాలోనే తామంతా ఆత్మాహుతి చేసుకుంటామని జోహర్ క్షత్రానీ మంచ్ కార్యదర్శి సంగీతా చౌహాన్ హెచ్చరించారు. -
దేశంలో కనీవినీ ఎరుగని నిరసన
జైపూర్/అహ్మదాబాద్ : దేశ చరిత్రలోనే ఊహించని మలుపు. ఒక సినిమాకు వ్యతిరేకంగా ఏకంగా 2వేల మంది మహిళలు ఆత్మార్పణకు సిద్ధమైన అరుదైన ఘట్టం. ‘‘మా మాట కాదని సినిమాను ప్రదర్శిస్తే థియేటర్ల ముందు చితిపేర్చుకుని ఆ మంటల్లో దూకి చస్తాం..’’ అని రాజ్‌పుత్ మహిళలు శపథంపూనారు. మహిళలకు తోడు పురుషులు కూడా పెద్ద ఎత్తున నిరసనల్లో పాలుపంచుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ‘పద్మావత్’ విడుదలకానున్న నేపథ్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరో ఐదు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం బస్సు సర్వీసులను రద్దు చేసింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మాహుతికి పేర్లు నమోదు చేసుకున్న 2వేల మంది మహిళలు : రాజ్‌పుత్ కులానికి చెందిన రాణి పద్మావతిది గొప్ప చరిత్ర అని, సినిమాలతో ఆమె పరువును మంటగలుపుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆ కులానికి చెందిన మహిళలు నినదించారు. ఆదివారం రాజస్థాన్‌లోని చిత్తోర్ఘర్ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 3వేల మంది రాజ్‌పుత్ మహిళలు పాల్గొన్నారు. సినిమాను ప్రవర్శిస్తే తామంతా మంటల్లోకి దూకి ఆత్మార్పణ(జౌహార్) చేసుకుంటామని జిల్లా కలెక్టర్‌కు అల్టిమేటం ఇచ్చారు. జౌహార్‌కు సిద్ధమంటూ ఇప్పటికే 2వేల మంది మహిళలు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ జాబితాను కూడా కలెక్టర్‌కు అందించారు. బస్సులు బంద్.. మంత్రి అనూహ్య వ్యఖ్యలు : గుజరాత్లో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న హెహసానా రీజియన్‌లో కొద్ది గంటలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనేఉన్నాయి. పలుచోట్ల గుజరాత్ ఆర్టీసీకి చెందిన బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. దీంతో సోమవారం నుంచి బస్సు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో పరిస్థితులపై మంత్రి భూపేంద్రసింహ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటివి చాలా సహజం’ అని అన్నారు. సినిమా విడుదలను అడ్డుకోరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడంపైనే తాము దృష్టిపెట్టినట్లు చెప్పుకొచ్చారు. 25న దేశవ్యాప్త ఆందోళన : పద్మావత్ సినిమాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న కర్ణిసేన.. సినిమా విడుదలయ్యేరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ‘‘ఇప్పటికే థియేటర్ యాజామాన్యాలతో మాట్లాడాం. పద్మావతిని ప్రదర్శించొద్దన్న మా డిమాండ్‌కు చాలా మంది ఒప్పుకున్నారు. ఒకవేళ ఎవరైనా సినిమాను ప్రదర్శిస్తే జరగబోయే పరిణామాలకు వారిదే బాధ్యత. పద్మావతి విడుదలయ్యే జనవరి 25న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’’ శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన అధికార ప్రతినిధి విజేంద్ర సింగ్ మీడియాతో అన్నారు. -
బొమ్మ పడితే.. థియేటర్ మసే!
సాక్షి, పూణే : సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో.. కర్ణిసేన తన అందోళనలను మరింత ఉధృతం చేసింది. ఇప్పటివరకూ సినిమా విడుదలను చట్టపరంగా ఆపేందుకు ప్రయత్నించిన కర్ణిసేన.. తాజాగా థియేటర్ల యజమానులపై బెదిరింపులకు దిగింది. ‘పద్మావత్’ చిత్రాన్ని ప్రదర్శిస్తే.. థియేటర్లను ధ్వంసం చేస్తామని తాజాగా పూణే కర్ణిసేన అధ్యక్షుడు ఓమ్ సింగ్ భార్తి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ‘పద్మావత్’ చిత్రం ఈ నెల 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర విడుదలను ఎలాగైనా అడ్డుకునేందుకు కర్ణిసేన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదిలావుండగా.. హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్‌లోని ఓ సినిమా థియేటర్ టిక్కెట్ కౌంటర్‌ను కర్ణిసేనకు చెందిన ఆందోళన కారులు తగులబెట్టారు. కర్ణిసేన బెదిరింపుల నేపథ్యంలో గుజరాత్ సినిమా థియేటర్ల యజమానులు ఈ చిత్రాన్ని విడుదల చేయలేమని చేతులెత్తేస్తున్నారు. -
‘పద్మావత్’కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: వివాదాస్పద బాలీవుడ్ చిత్రం పద్మావత్ ఈ నెల 25న దేశవ్యాప్తంగా విడుదలవడానికి మార్గం సుగమమైంది. ఈ చిత్ర ప్రదర్శనపై నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో(రాజస్తాన్, గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్) విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఇతర రాష్ట్రాలు పద్మావత్‌పై నిషేధం విధించకుండా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలిచ్చింది. పద్మావత్ విడుదలైన తరువాత శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్రాలదే అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చికి వాయిదా వేసింది. చిత్ర నిర్మాతల తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ వాదిస్తూ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తరువాత నిషేధం విధించే అధికారం రాష్ట్రాలకు లేదని అన్నారు. గుజరాత్, హరియాణా, రాజస్తాన్ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. పద్మావత్ విడుదలైతే ఆ రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్యలు నెలకొంటాయని నిఘా వర్గాల సమాచారం ఉందని, సెన్సార్ బోర్డు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండానే విడుదలకు అనుమతిచ్చిందని తెలిపారు. రాష్ట్రాలు ‘సూపర్ సెన్సార్ బోర్డు’లా వ్యవహరించరాదని రోహత్గీ అభిప్రాయపడ్డారు. పద్మావత్‌ను ఆడనీయం: కర్నిసేన సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే రాజ్‌పుత్ కర్నిసేన కార్యకర్తలు, హిందూ అతివాదులు విధ్వంసానికి దిగారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కర్నిసేన కార్యకర్తలు ఓ సినిమా థియేటర్‌పై దాడికి పాల్పడి, పద్మావత్ పోస్టర్లను చించేశారని పోలీసులు తెలిపారు. పద్మావత్ ప్రదర్శనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్ వర్గం కర్నిసేన ఈ చిత్ర విడుదలను అడ్డుకుంటామని పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్ర ప్రదర్శనను అడ్డుకునేలా సహకరించాలని సంస్థ నాయకుడు స్వచ్ఛంద సంస్థలను కోరారు. -
‘థియేటర్లు అన్నింటికి నిప్పు పెడతాం’
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ సినిమా విడుదలైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజ్‌పుత్ గ్రూపులు గురువారం మరోమారు హెచ్చరించాయి. సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే రాజ్‌పుత్ గ్రూపులు ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. పద్మావత్ విడుదలను నిషేధించాలని, లేకపోతే సినిమా విడుదలయ్యే థియేటర్లకు నిప్పు పెడతామని రాజ్‌పుత్ శ్రేణులు తీవ్ర హెచ్చరిక చేశాయి. ఇదే తమ ఆఖరి హెచ్చరిక అని కూడా చెప్పాయి. రాణి పద్మావతి అభిమానంతో అడుకునే పనులు ఎవరైనా చేస్తే తాము చూస్తూ ఊరుకోమని పేర్కొన్నాయి. -
పద్మావత్’పై సుప్రీం తీర్పు ఎలా ఉంటుంది?
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పదమైన ‘పద్మావత్’ బాలీవుడ్ సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని అనుకుంటున్న సమయంలో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో సినిమా విడుదలను నిషేధించారు. ఆది నుంచి ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ, వ్యయ ప్రయాసాలకోర్చి సినిమాను పూర్తి చేసిన నిర్మాతలకు సెన్సార్ బోర్డు తలనొప్పులు కూడా తప్పలేదు. (సాక్షి ప్రత్యేకం) చివరకు బోర్డు సూచన మేరకు పద్మావతి పేరును పద్మావత్‌గా మార్చగా ఐదు కట్లతో సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు యూ–ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో ఊపిరి పీల్చుకున్న సినిమా దర్శక, నిర్మాతలు ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి మంజూరు చేశాక సినిమా విడుదలను అడ్డుకునే అధికారం ఓ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఉంటే అది న్యాయబద్ధమే అవుతుందా? ఈ అంశాలను తేల్చుకునేందుకే సినిమా నిర్మాతలు బుధవారం నాడు సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) వెబ్సైట్ ప్రకారం సినిమాల ప్రదర్శన రాష్ట్రాల అంశం కనుక సినిమా ఆటోగ్రపీ చట్టం–1952 నిబంధనలను అమలు చేసే అధికారం కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదే. ఈ కారణంగా తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను (ఆందోళనలను) పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు అధికారం ఉందనే విషయం స్పష్టమవుతుంది. (సాక్షి ప్రత్యేకం) సీబీఎఫ్సీ చైర్‌పర్సన్‌గా ప్రసూన్ జోషిని కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వమే నియమించింది. ( సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించిన తర్వాత ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం సెన్సార్ బోర్డును లెక్క చేయక పోవడం కాదా? ఓ ప్రజాస్వామ్య సంస్థ ఉనికికే ప్రమాదం తీసుకరావడం కాదా? సొంత పార్టీ ప్రభుత్వం నియమించిన సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్‌ను అవమానించడం కాదా? సెన్సార్ బోర్డు తొందరపడి సినిమా విడుదలకు నిర్ణయమేమీ తీసుకోలేదు. కేంద్ర పార్లమెంటరీ ప్యానెల్, చరిత్రకారుల కమిటీ ఆమోదంతోనే సినిమా విడుదలకు సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఈ కారణంగా బీజేపీ సీఎంల ప్రవర్తన పార్లమెంటరీ ప్యానల్ అభిప్రాయాన్ని కూడా అగౌరవపర్చడమే అవుతుందికదా? సినిమాల ప్రదర్శన రాష్ట్రాల అంశం అనేదే తమకు ప్రాతిపదికగా భావిస్తే ఇక రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు సినిమాల విషయాల్లో తమ ఇష్టానుసారం వ్యవహరించే ప్రమాదకర పరిస్థితులకు దారితీయదా? తద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగదా?(సాక్షి ప్రత్యేకం) వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి అడుగడుగున సినిమా నిర్మాతలకు అడ్డం పడడం, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై దాడి చేయడం, హీరోయిన్ దీపికా పదుకొనే ముక్కు కోస్తే లక్షల రూపాయలు ఇస్తాననడం, హీరోలు రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్లను బెదిరించడం, సినిమా పేరు మార్చినంత మాత్రాన సినిమాను అనుమతించాలని ఎక్కడైన ఉందా? అంటూ సాక్షాత్తు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే ప్రశ్నించడం, సెన్సార్ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖతోపాటు ప్రధాని కార్యాలయం మౌనం వహించడం తదితర అన్ని పరిణామాలు భావ ప్రకటనా స్వేచ్ఛను తుంగలో తొక్కడమే అవుతుంది. మరి సుప్రీం కోర్టు సినిమా ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలు రాష్ట్రాల పరిధిలోనివి అంటుందా? సమాఖ్య స్ఫూర్తి, భావ ప్రకటనా స్వేచ్ఛను దష్టిలో పెట్టుకొని తీర్పు చెబుతుందా? చూడాలి!((సాక్షి ప్రత్యేకం) -
ఆ సినిమాను ఆపకుంటే చచ్చిపోతాం
జైపూర్: వివాదాస్పద ‘పద్మావత్’ సినిమాకు కష్టాలు ఇప్పట్లో తొలగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమాను ప్రదర్శిస్తే ఆత్మాహుతికి పాల్పడతామని రాజ్‌ఫుత్ మహిళలు హెచ్చరించారు. చిత్తోర్‌గఢ్ కోట వద్ద బలిదానాలు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ‘పద్మావత్’కి వ్యతిరేకంగా పలు దశల్లో పోరాటం చేయాలని సర్వసమాజ్ సంఘం సభ్యులు నిర్ణయించారు. చిత్తోర్‌గఢ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి 500 మంది హాజరయ్యారు. వీరిలో 100 మంది సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నారు. ఈ నెల 17న జాతీయ రహదారులు, రైలు మార్గాలను దిగ్బంధిస్తామని రాజ్‌పుత్ కర్ణిసేన ప్రతినిధి వీరేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు ఉదయ్‌పూర్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి ‘పద్మావత్’ విడుదల కాకుండా చూడాలని కోరినట్టు చెప్పారు. అలాగే 16న బార్మర్ జిల్లా పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీని కూడా తమ ప్రతినిధులు కలుస్తారని వెల్లడించారు. తమ ప్రయత్నాలు విఫలమైతే ఈ నెల 24న రాణి పద్మావతి ఆత్మాహుతికి పాల్పడిన చిత్తోర్‌గఢ్ కోటలోనే క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలు బలిదానాలకు పాల్పడతారని వీరేంద్ర సింగ్ హెచ్చరించారు. కాగా, సెన్సార్ బోర్డు అనుమతించడంతో ఈనెల 25న పద్మావత్ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
‘పద్మావత్’ విడుదలైతే ప్రజా కర్ఫ్యూ: రాజ్‌పుత్ వర్గం
న్యూఢిల్లీ: వివాదాస్పద ‘పద్మావత్’చిత్రం విడుదలైతే థియేటర్లలో ప్రజా కర్ఫ్యూ చేపడతామని రాజ్‌పుత్ కర్ణిసేన బుధవారం మరోసారి హెచ్చరించింది. ఆ చిత్రంపై పూర్తిగా నిషేధం విధించాలని పునరుద్ఘాటించింది. చరిత్రను వక్రీకరించి ఈ సినిమా తీశారని, నిర్మాతలతో తాము రాజీపడబోమని ఆ సంస్థ నాయకుడు లోకేంద్ర సింగ్ కల్వి అన్నారు. ‘పద్మావత్‌ను జనవరి 25న విడుదల చేయబోతున్నట్లు విన్నాం. అదే జరిగితే వీధుల వెంట ఆందోళనలు చేస్తాం. థియేటర్లలో పబ్లిక్ కర్ఫ్యూ నిర్వహించాలని యువతను కోరుతాం’అని కల్వి విలేకర్లతో చెప్పారు. -
‘పద్మావత్’ రిలీజ్ డేట్..!
ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైన బాలీవుడ్ సినిమా పద్మావతి. చారిత్రక కథగా తెరకెక్కిన ఈ సినిమాలో మహారాణి పద్మావతి పాత్రను అభ్యంతరకరంగా చూపించారని కర్ణిసేన సభ్యులు ఆరోపిస్తున్నారు. షూటింగ్ సమయంలో దాడి దిగిన కర్ణిసేన రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. అదే సమయంలో సెన్సార్ బోర్డ్ నుంచి కూడా క్లియరెన్స్ రాకపోవటంతో డిసెంబర్ 1న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది. అయితే ఇటీవల సెన్సార్ బోర్డ్ సినిమాకు కొన్ని మార్పులతో సెన్సార్ సర్టిఫికేట్ ను జారీ చేసేందుకు అంగీకరించింది. చిత్రయూనిట్ కూడా సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేసేందుకు సుముఖంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టైటిల్ ను పద్మావత్ గా మార్చాలన్న సూచనకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అంగీకరించినట్టుగా సమాచారం. దీంతో సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయినట్టుగానే భావిస్తున్నారు. ఈ రోజు పద్మావతిగా నటించిన దీపికా పదుకొణే పుట్టిన రోజు కావటంతో సినిమా రిలీజ్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పద్మావత్ సినిమాను ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారట. -
‘పద్మావతిపై గర్వంగా ఉంది’
దేశవ్యాప్తంగా అత్యంత తీవ్రస్థాయిలో వివాదాలు రేపుతున్న సంజయ్‌లీలా భన్సాలీ చిత్రం ‘పద్మావతి’పై దీపికా పదుకునే స్పందించారు. ఈ చిత్రం కోసం తన జీవితంలో అత్యంత విలువైన రెండేళ్ల కాలాన్ని కేటాయించానని దీపిక అన్నారు. పద్మావతి చిత్రంపై జరుగుతులన్న అల్లర్లు, వివాదాలు, గొడవల ఆమె తీవ్రంగా ఖండించారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని అమె చెప్పారు. ఒక చిత్రంపై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకముందని చెప్పిన దీపిక.. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన ముక్కు కోస్తామనే హెచ్చరికలు, చంపితే రూ. 5కోట్లు ఇస్తామన్న మాటలను దీపిక కొట్టిపారేశారు. పద్మావతి చిత్రంలో నటించినందుకు చాలా గర్వపడుతున్నట్లు దీపిక స్పష్టం చేశారు. -
పద్మావతి హీరోయిన్‌కు కర్ణిసేన హెచ్చరిక
-
దీపిక ముక్కు కోస్తాం!
కోట/జైపూర్/లక్నో: సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి సినిమా వివాదం కొత్తరూపు తీసుకుంది. ఈ చిత్రంలో రాణి పద్మినిగా నటించిన దీపికా పదుకొనే ముక్కు కోస్తామని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన పరోక్షంగా హెచ్చరించింది. దీపిక రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోకపోతే రామాయణంలో లక్ష్మణుడి చేతిలో శూర్పణకకు పట్టిన గతే ఆమెకు పడుతుందని చెప్పింది. పద్మావతి చిత్రం విడుదలను ఎవ్వరూ అడ్డుకోలేరనీ, ఒకదేశంగా భారత్ తిరోగమిస్తోందని ఇంతకుముందు దీపిక వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కర్ణిసేనకు చెందిన నేత మహిపాల్‌సింగ్ మక్రానా మీడియాతో మాట్లాడుతూ.. ‘క్షత్రియులు మహిళల్ని అమితంగా గౌరవిస్తారు. ఒకవేళ ఈ చిత్రాన్ని విడుదల చేసినా, దీపిక మా మనోభావాలు దెబ్బతినేలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోకపోయినా రామాయణంలో లక్ష్మణుడిలా ప్రవర్తించేందుకు రాజపుత్రులు ఎంతమాత్రం వెనుకాడరు’ అని హెచ్చరించారు. అసలు డెన్మార్క్ పౌరసత్వం ఉన్న దీపిక రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా చేస్తారని సింగ్ ప్రశ్నించారు. క్షత్రియుల శౌర్యపరాక్రమాలను చూపిస్తూ బాహుబలి లాంటి సినిమాలు కోట్లు అర్జిస్తుంటే.. వక్రీకరణలతో ఇలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో దీపికకు భద్రతను పెంచినట్లు మహారాష్ట్ర హోంశాఖ సహాయమంత్రి రంజిత్ పాటిల్ తెలిపారు. ఈ సినిమా దర్శకుడు భన్సాలీకి ఇప్పటికే భద్రత కల్పించినట్లు వెల్లడించారు. ఈచిత్రంలో రాణి పద్మినిగా దీపిక, రాజా రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటించారు. ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకోండి: పద్మావతి చిత్రం డిసెంబర్ 1న విడుదలైతే రాష్ట్రంలో తీవ్రమైన శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. డిసెంబర్ 2న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న వనరులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. సినిమా విడుదలకు ముందు ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా యూపీ ప్రభుత్వం సెన్సార్ బోర్డును కోరింది. ఈ సినిమాకు సర్టి ఫికెషన్ ఇచ్చేది తాను కాదనీ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కల్పించే ప్రతి చర్యను అడ్డుకుని తీరుతామని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ లేఖలో వెల్లడించారు. మరోవైపు పద్మావతి చిత్రం విడుదలయ్యే థియేటర్లకు రక్షణ కల్పిస్తామని మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ప్రకటించాయి. పద్మావతి విడుదలకు వ్యతిరేకంగా 10వేలమంది రక్తంతో కూడిన సంతకాల సేకరణ చేపడతామని, దీన్ని సెన్సార్ బోర్డుకు పంపిస్తామని ‘సర్వ బ్రాహ్మణ మహాసభ’ తెలిపింది. భన్సాలీ, దీపిక తలలు నరికి తెచ్చినవారికి రూ.5 కోట్ల బహుమానం ఇస్తానని మీరట్‌కు చెందిన ఠాకూర్ అభిషేక్ సోమ్ ప్రకటించారు. -
'దీపికా పదుకొనే ముక్కు కోస్తాం'
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పద్మావతి సినిమా వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే పలు సంఘాలు సినిమా విడుదల ఆపాలంటూ ఆందోళనలు చేస్తుండగా.. చిత్రయూనిట్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదలను అడ్డుకుంటాం అంటూ కర్ణిసేన హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో దీపిక సినిమా విడుదలపై స్పందించిన తీరు వివాదాన్ని మరింత పెంచింది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దీపిక, పద్మావతి రిలీజ్ ను ఎవరు ఆపలేరని, తాము కేవలం సెన్సార్ బోర్డ్ కు మాత్రమే జవాబు దారి అనటం నిరసనకారులకు మరింత కోపాన్ని తెప్పించింది. తాజాగా కర్ణిసేన పద్మావతి సినిమాపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 'సినిమా విడుదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం, హిందువుల మనోభావాలను దర్శకుడు బన్సాలీ దెబ్బతీశారు. సినిమా విడుదల చేస్తే థియేటర్లను ధ్వంసం చేస్తాం' అంటూ హెచ్చరికలు చేశారు. -
డిసెంబర్ 1న భారత్ బంద్.. పద్మావతి విడుదల అయ్యేనా!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ.. ఈ సినిమా వివాదం మరింత ముదురుతోంది. ఈ సినిమాకు వత్యిరేకంగా రాజ్‌పుత్ వర్గీయుల ఆధ్వర్యంలోని కర్ణిసేన ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. డిసెంబర్ 1న పద్మావతి సినిమా విడుదల కావాల్సి ఉండగా.. సినిమా విడుదలకు వ్యతిరేకంగా 'భారత్ బంద్'కు కర్ణిసేన పిలుపునిచ్చింది. ఈ సినిమాను విడుదలను ఆపాల్సిందేనని, ఒకవేళ సినిమాను విడుదల చేస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవని కర్ణిసేనకు చెందిన లోకేంద్ర సింగ్ కల్వి హెచ్చరించారు. ఒకవేళ 'పద్మావతి' సినిమా విడుదలైతే.. నిరసన జ్వాలలతో దేశం తగలబడుతుందని, దీనిని అడ్డుకుంటే అడ్డుకోండి అని ఆయన సవాల్ విసిరారు. మరోవైపు బెంగళూరులో సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాను వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకుండా నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్ గోయెల్ ఇప్పటికే కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మరోవైపు జోరుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు. అయితే, తమ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. -
'పద్మావతి' వివాదం.. బద్దలైన థియేటర్!
-
'పద్మావతి' వివాదం.. బద్దలైన థియేటర్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాక వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన ఓ థియేటర్‌పై దాడి చేసింది. కర్ణిసేన కార్యకర్తలు ఆకాశ్ థియేటర్‌పై దాడి చేసి కౌంటర్ అద్దాలను, కిటికిలను ధ్వంసం చేశారు. ఆకాశ్ థియేటర్లో తాజాగా ‘పద్మావతి’ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ విషయంలో తెలుసుకున్న రాజ్‌పుత్ వర్గీయులు కర్ణిసేన ఆధ్వర్యంలో థియేటర్‌పై దాడులకు దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా స్పందించారు. ప్రజాస్వామికంగా ఎవరైనా నిరసన తెలుపవచ్చునని, కానీ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే.. చట్టప్రకారం చర్యలు తప్పవని కర్ణిసేనను ఆయన హెచ్చరించారు. రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాను వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకుండా నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్ గోయెల్ ఇప్పటికే కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మరోవైపు జోరుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కర్ణిసేన ఆధ్వర్యంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన సభలో దాదాపు లక్ష మంది రాజ్‌పుత్ వర్గీయులు హాజరయ్యారు. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు. అయితే, తమ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. -
గుజరాత్లో ‘పద్మావతి’ మంటలు
అహ్మదాబాద్ : సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘పద్మావతి’ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ ఆదివారం గుజరాత్‌లోని రాజ్‌పుత్‌లు భారీ ఆందోళనలు నిర్వహించారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కర్ణిసేన ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి దాదాపు లక్ష మంది రాజ్‌పుత్ వర్గీయులు హాజరయ్యారు. పద్మావతిని నిలిపివేయాలంటూ వేలాది మంది సూరత్ లో ఆందోళనలు నిర్వహించారు. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లా వుద్దీన్ ఖిల్జీల మధ్య ఓ ప్రేమ గీతాన్ని చిత్రీ కరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై కర్ణిసేనకు చెందిన వీరేంద్రసిన్హ్ భాటి మీడియాతో మాట్లాడుతూ.. ‘చారిత్రక అంశాల్లోని వాస్తవాల ఆధారంగానే భన్సాలీ చిత్రం తీస్తే..తొలుత ఇచ్చిన మాట ప్రకారం మాకు సినిమాను చూపించడానికి ఎందుకు జంకుతున్నారు? ఈ సినిమాలో రాణి పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ప్రేమ గీతం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పద్మావతి విడుదలైతే.. రాజపుత్రులు ఏం చేయగలరో చూపిస్తాం’ అని హెచ్చరించారు. ఈ చిత్రంపై నిషేధం విధించకుంటే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర పర్యావసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుం దని స్పష్టం చేశారు. ముంబైలోని భనాల్సీ కార్యాలయం ముందు 25 మంది రాజపుత్ర వర్గీయులు ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వారిని విడిచిపెట్టారు. చిత్రీకరణ ప్రారంభమైనప్పటి నుంచి పద్మావతి చిత్రానికి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత భన్సాలీపై దాడికి దిగిన దుండగులు..తర్వాత కొల్హాపూర్‌లో వేసిన కోట్లాది రూపాయల విలువైన సినిమా సెట్‌ను సైతం తగలబెట్టారు. -
టాప్ డైరెక్టర్ దిష్టిబొమ్మ దహనం!
-
టాప్ డైరెక్టర్ దిష్టిబొమ్మ దహనం!
ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం 'పద్మావతి' విషయంలో ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటికే ఆందోళనకారులు జైపూర్‌లో 'పద్మావతి' షూటింగ్‌పై దాడి చేసి.. దర్శకుడిని కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహారాష్ట్ర కొల్హాపూర్‌లో 'పద్మావతి' చిత్రం కోసం భారీస్థాయిలో వేసిన సెట్టింగ్స్‌ను తగలబెట్టారు. జైపూర్‌లో భన్సాలీపై దాడి చేసిన రాజ్‌పుత్‌లకు చెందిన కర్ణిసేన తాజాగా శనివారం రాత్రి ముంబై సమీపంలోని నల్లసోపరా వద్ద ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా కర్ణిసేన కార్యకర్తలు దర్శకుడు భన్సాలీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. దర్శకుడికి, పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌పుత్ రాకుమారి అయిన 'పద్మావతి' జీవితకథను వక్రీకరించి సినిమాగా తెరకెక్కిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణిసేన భన్సాలీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. -
రాణి పద్మిని వాడిన చారిత్రక అద్దాలు బద్దలు
చిత్తోర్‌గఢ్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా ఆయన చిత్ర బృందంపై దాడి చేసిన కర్నిసేనా అనే గ్రూపు తిరిగి మరోసారి దాడికి పాల్పడింది. రాజస్థాన్‌లోని 13వ శతాబ్దానికి చెందిన కోటలో నాటి రాణి పద్మిని ఉపయోగించిన అద్దాలను ధ్వంసం చేసింది. పద్మిని ప్యాలెస్‌లో ఉన్న రెండు పెద్ద చారిత్రక అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసింది. అంతేకాదు, స్వయంగా ఆ దాడిని తామే చేశామని ప్రకటించుకోవడమే కాకుండా ఆ అద్దాలను పూర్తి తొలగించాలని తాము పాలన వర్గాన్ని డిమాండ్ చేస్తున్నామని, వాటి ద్వారా తమ ప్రముఖ రాణి చరిత్రను హీనంగా చెబుతున్నారని మండిపడ్డారు. పద్మిని మహల్‌లోని గతంలో పద్మిని ఉన్న గదిలో రెండు పెద్ద అద్దాలు ఎదురెదురుగా ఉన్నాయి. తన భర్త రాణా రతన్ సింగ్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాక ఆ అద్దాల్లోనే అందాల రాణి పద్మినిని నాటి ముస్లిం పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి చూపించారని అక్కడికి వచ్చిన పర్యాటకులకు టూరిస్టు గైడ్లు చెబుతుంటారు. గొప్ప చరిత్ర కలిగిన తమ వారసురాలిని ఇలాంటి కట్టుకథలతో తప్పుబడుతున్నారని, అందుకు ఈ అద్దాలను ఉపయోగించుకుంటున్నారని, ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని పగులగొట్టినట్లు దాడికి పాల్పడినవారు చెబుతున్నారు. ఇదే గ్రూపు గతంలో సంజయ్ లీలా బన్సాలీపై ఆయన చిత్ర బృందంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.