'దీపికా చెవులు, ముక్కు కోస్తే కోటి రూపాయలు' | will give one crore one who chops off Deepika ears and nose | Sakshi
Sakshi News home page

'దీపికా చెవులు, ముక్కు కోస్తే కోటి రూపాయలు'

Published Thu, Jan 25 2018 4:09 PM | Last Updated on Thu, Jan 25 2018 5:41 PM

will give one crore one who chops off Deepika ears and nose - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటికే దాదాపు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తగులబెడుతూ విధ్వంసానికి పాల్పడుతున్న కర్ణిసేన మరింత ఆగ్రహంతో రగిలిపోతోంది. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పద్మావత్‌ చిత్రాన్ని విడుదల చేయాడానికి వీల్లేదంటూ ఆందోళనలు చేస్తున్నా ఆ సినిమా గురువారం విడుదల కావడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్‌ ఈ చిత్రంలో పద్మావత్‌గా నటించిన దీపికా పదుకొనేపై నిప్పులు చెరిగాడు.

'దీపికా పదుకునే చెవులు, ముక్కులు కోసినవారికి క్షత్రియ కమ్యూనిటీ రూ.కోటి బహుమతిగా ఇస్తుంది' అని ఆయన ప్రకటించారు. తన అధికారిక ట్విటర్‌ పేజీలో ఈ మేరకు సంచలన ఆఫర్‌ చేశారు. ఇదిలా ఉండగా, పద్మావత్‌ చిత్రం విడుదల అయినప్పటికీ ఆందోళనలు ఎక్కడా ఆగడం లేదు. పోలీసులు ఎక్కడివారిని అక్కడ నిర్బందంలోకి తీసుకుంటున్నా ఏ మాత్రం వారు వెనక్కి తగ్గడం లేదు. గురువారం దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా జరగుతున్నాయి. మహిళలు కూడా పెద్ద మొత్తంలో ఈ ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. కొంతమంది కత్తులతో రోడ్లపై వీరంగం చేస్తున్నారు. మాల్స్‌పై కూడా దండయాత్రలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement