
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ సినిమా విడుదలైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజ్‌పుత్ గ్రూపులు గురువారం మరోమారు హెచ్చరించాయి. సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే రాజ్‌పుత్ గ్రూపులు ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.
పద్మావత్ విడుదలను నిషేధించాలని, లేకపోతే సినిమా విడుదలయ్యే థియేటర్లకు నిప్పు పెడతామని రాజ్‌పుత్ శ్రేణులు తీవ్ర హెచ్చరిక చేశాయి. ఇదే తమ ఆఖరి హెచ్చరిక అని కూడా చెప్పాయి. రాణి పద్మావతి అభిమానంతో అడుకునే పనులు ఎవరైనా చేస్తే తాము చూస్తూ ఊరుకోమని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment