
సాక్షి, పూణే : సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో.. కర్ణిసేన తన అందోళనలను మరింత ఉధృతం చేసింది. ఇప్పటివరకూ సినిమా విడుదలను చట్టపరంగా ఆపేందుకు ప్రయత్నించిన కర్ణిసేన.. తాజాగా థియేటర్ల యజమానులపై బెదిరింపులకు దిగింది. ‘పద్మావత్’ చిత్రాన్ని ప్రదర్శిస్తే.. థియేటర్లను ధ్వంసం చేస్తామని తాజాగా పూణే కర్ణిసేన అధ్యక్షుడు ఓమ్ సింగ్ భార్తి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ‘పద్మావత్’ చిత్రం ఈ నెల 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర విడుదలను ఎలాగైనా అడ్డుకునేందుకు కర్ణిసేన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇదిలావుండగా.. హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్‌లోని ఓ సినిమా థియేటర్ టిక్కెట్ కౌంటర్‌ను కర్ణిసేనకు చెందిన ఆందోళన కారులు తగులబెట్టారు. కర్ణిసేన బెదిరింపుల నేపథ్యంలో గుజరాత్ సినిమా థియేటర్ల యజమానులు ఈ చిత్రాన్ని విడుదల చేయలేమని చేతులెత్తేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment