న్యూఢిల్లీ: వివాదాస్పద ‘పద్మావత్’చిత్రం విడుదలైతే థియేటర్లలో ప్రజా కర్ఫ్యూ చేపడతామని రాజ్‌పుత్ కర్ణిసేన బుధవారం మరోసారి హెచ్చరించింది. ఆ చిత్రంపై పూర్తిగా నిషేధం విధించాలని పునరుద్ఘాటించింది. చరిత్రను వక్రీకరించి ఈ సినిమా తీశారని, నిర్మాతలతో తాము రాజీపడబోమని ఆ సంస్థ నాయకుడు లోకేంద్ర సింగ్ కల్వి అన్నారు. ‘పద్మావత్‌ను జనవరి 25న విడుదల చేయబోతున్నట్లు విన్నాం. అదే జరిగితే వీధుల వెంట ఆందోళనలు చేస్తాం. థియేటర్లలో పబ్లిక్ కర్ఫ్యూ నిర్వహించాలని యువతను కోరుతాం’అని కల్వి విలేకర్లతో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment