
దేశవ్యాప్తంగా అత్యంత తీవ్రస్థాయిలో వివాదాలు రేపుతున్న సంజయ్‌లీలా భన్సాలీ చిత్రం ‘పద్మావతి’పై దీపికా పదుకునే స్పందించారు. ఈ చిత్రం కోసం తన జీవితంలో అత్యంత విలువైన రెండేళ్ల కాలాన్ని కేటాయించానని దీపిక అన్నారు. పద్మావతి చిత్రంపై జరుగుతులన్న అల్లర్లు, వివాదాలు, గొడవల ఆమె తీవ్రంగా ఖండించారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని అమె చెప్పారు. ఒక చిత్రంపై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు.
భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకముందని చెప్పిన దీపిక.. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన ముక్కు కోస్తామనే హెచ్చరికలు, చంపితే రూ. 5కోట్లు ఇస్తామన్న మాటలను దీపిక కొట్టిపారేశారు. పద్మావతి చిత్రంలో నటించినందుకు చాలా గర్వపడుతున్నట్లు దీపిక స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment