చంఢీగడ్: కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ గోగమేడి హత్య కేసును ఎన్‌ఐఏ చేపట్టింది. హత్యలో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ల ప్రమేయం ఉన్నందున హోం మంత్రిత్వ శాఖ ఎన్‌ఐఏకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది.
కర్ణిసేన అధినేతను డిసెంబర్ 5న రాజస్థాన్, జైపూర్‌లోని ఆయన నివాసంలో దుండగులు కాల్చి చంపారు. హత్య జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా హత్యకు బాధ్యత వహించాడు.
ఇద్దరు నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలను డిసెంబర్ 9న చండీగఢ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. గోదారానే తమను సుఖ్‌దేవ్ గోగామేడి హత్యకు ఆదేశించారని పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న షూటర్లు గోదార సన్నిహితులు వీరేంద్ర చాహన్, దనరామ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కొందరు వ్యాపారవేత్తల నుంచి వసూళ్లకు సంబంధించి గోదార, గోగమేడి మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే హత్యకు దారితీసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: 'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్‌పై విపక్ష ఎంపీ మిమిక్రి
Comments
Please login to add a commentAdd a comment