Photo courtesy:NDTV
న్యూఢిల్లీ: కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ గొగామెడిని హత్య వెనుక కీలక సూత్రధారి గ్యాంగ్‌స్టర్ రోహిత్ గొడారా భారత్ నుంచి పారిపోయాడు. అయితే గొడారా డాంకీ ఫ్లైట్ టెక్నిక్ వాడి కెనడాకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ టెక్నిక్‌నే పంజాబ్‌లో డుంకీ అని పిలుస్తారు. ఈ పేరుతోనే త్వరలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ సినిమా రాబోతోంది.
డుంకీ సినిమా థీమ్ కూడా పోలీసుల కళ్లుగప్పి పారిపోవడమేనని తెలుస్తోంది. డుంకీ టెక్నిక్‌లో పోలీసులను తప్పుదారి పట్టించేందుకు వెళ్లాల్సిన చోటికి నేరుగా కాకుండా మధ్యలో వేరు వేరు దేశాల్లో ఆగుతూ చివరకు గమ్యస్థానం చేరుకుంటారు. ఇందుకు ఆయా దేశాల వీసా,ఇమిగ్రేషన్ నిబంధనల్లోని లోపాలను అడ్డుపెట్టుకుంటారు.
ఈ తరహాలోనే గొడారా పలు దేశాల్లో ఆగుతూ తొలుత అమెరికా వెళ్లాడు. అక్కడి నుంచి చివరకు కెనడా పారిపోయాడు. ఈ నెల ఐదవ తేదీన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ గొగామెడిని ఆయన ఇంట్లోనే టీ తాగుతుండగా ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. వీరిలో ఒకరు అక్కడే క్రాస్ ఫైరింగ్‌లో చనిపోగా మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ హత్య తామే చేశామని గ్యాంగ్‌స్టర్ రోహిత్ గొడారా ప్రకటించుకున్నారు. ఇతనిపై దేశంలోని పలు పోలస్‌స్టేషన్‌లలో 32 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment