దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత)
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మద్దతిచ్చారు. ఓ మతాన్నిగాని, కులాన్నిగానీ కించపరిచే ఏ సినిమాలను కూడా అసలు విడుదల కానివ్వొద్దంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి చిత్రాన్ని అసలు తీయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. పద్మావత్ చిత్రం తమ మనోభావాలను దెబ్బకొట్టిందంటూ గత కొద్ది రోజులుగా శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా వారు హింసాత్మకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో దిగ్విజయ్ వారికి మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశం అయింది. అంతేకాదు.. ఈ ఆందోళన మొత్తానికి కూడా ప్రధాని నరేంద్రమోదీ, ఆయన పార్టీ బీజేపీ అని ఆరోపించారు. గుర్గావ్‌లో పాఠశాల బస్సుపై జరిగిన దాడిని గురించి స్పందన తెలియజేస్తూ 'మొత్తం దేశాన్ని బీజేపీ మంటల్లోకి నెడుతోంది' అంటూ తీవ్రంగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment