
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పద్మావతి సినిమా వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే పలు సంఘాలు సినిమా విడుదల ఆపాలంటూ ఆందోళనలు చేస్తుండగా.. చిత్రయూనిట్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదలను అడ్డుకుంటాం అంటూ కర్ణిసేన హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో దీపిక సినిమా విడుదలపై స్పందించిన తీరు వివాదాన్ని మరింత పెంచింది.
సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దీపిక, పద్మావతి రిలీజ్ ను ఎవరు ఆపలేరని, తాము కేవలం సెన్సార్ బోర్డ్ కు మాత్రమే జవాబు దారి అనటం నిరసనకారులకు మరింత కోపాన్ని తెప్పించింది. తాజాగా కర్ణిసేన పద్మావతి సినిమాపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 'సినిమా విడుదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం, హిందువుల మనోభావాలను దర్శకుడు బన్సాలీ దెబ్బతీశారు. సినిమా విడుదల చేస్తే థియేటర్లను ధ్వంసం చేస్తాం' అంటూ హెచ్చరికలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment