
నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న కర్ణిసేన కార్యకర్తలు(పాత చిత్రం)
గుర్గావ్: బాలీవుడ్ చిత్రం పద్మావత్‌కు వ్యతిరేకంగా హింసకు పాల్పడిన కేసులో స్థానిక కర్ణిసేన చీఫ్ ఠాకూర్ కుషాల్‌పాల్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గుర్గావ్‌లో విధ్వంసానికి కారణమైన వారిలో ఇప్పటివరకూ 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పద్మావత్ చిత్ర ప్రదర్శనను నిరసిస్తూ ఆందోళనకారులు బుధవారం గుర్గావ్‌లో ఓ పాఠశాల బస్సుపై దాడిచేయడంతో పాటు ప్రభుత్వ బస్సుకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుల్ని అరెస్ట్‌చేసి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీస్ పీఆర్వో రవీందర్ కుమార్ చెప్పారు.