
రాంచీ: రాష్ట్రంలోని హజారిబాగ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు భగ్గుమన్నాయి. సరస్వతీ పూజ ఊరేగింపు సందర్భంగా రూపేశ్ కుమార్ పాండే అనే కుర్రవాడిని కొందరు తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక రూపేశ్ మరణించాడు.
రూపేశ్ మృతికి కారకులపై మాబ్ లించింగ్ చట్టం కింద కేసు పెట్టాలని పలువురు నేషనల్ హైవేపై ధర్నా చేశారు. ఈ గొడవలకు పాత కక్షలే కారణమని, మత ఘర్షణలు కాదని పోలీసులు చెప్పారు. ఘటనకు సంబంధించి అస్లాం, ఆనిస్, కైఫ్, గుఫ్రాన్, చాంద్, ఒసామా తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.