ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాక వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన ఓ థియేటర్‌పై దాడి చేసింది. కర్ణిసేన కార్యకర్తలు ఆకాశ్ థియేటర్‌పై దాడి చేసి కౌంటర్ అద్దాలను, కిటికిలను ధ్వంసం చేశారు. ఆకాశ్ థియేటర్‌లో తాజాగా ‘పద్మావతి’ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ విషయంలో తెలుసుకున్న రాజ్‌పుత్ వర్గీయులు కర్ణిసేన ఆధ్వర్యంలో థియేటర్‌పై దాడులకు దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా స్పందించారు. ప్రజాస్వామికంగా ఎవరైనా నిరసన తెలుపవచ్చునని, కానీ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే.. చట్టప్రకారం చర్యలు తప్పవని కర్ణిసేనను ఆయన హెచ్చరించారు.