బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం 'పద్మావతి' విషయంలో ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటికే ఆందోళనకారులు జైపూర్‌లో 'పద్మావతి' షూటింగ్‌పై దాడి చేసి.. దర్శకుడిని కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహారాష్ట్ర కొల్హాపూర్‌లో 'పద్మావతి' చిత్రం కోసం భారీస్థాయిలో వేసిన సెట్టింగ్స్‌ను తగలబెట్టారు.