
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాలతో నిత్యం వార్తల్లో నలుగుతున్న పద్మావతి తాజా పోస్టర్‌లో దీపికా పదుకునే కట్టిపడేసే రూపంతో ఆకట్టుకుంటోంది. రాజ్‌పుట్ మహిళల నడుమ రాజసం ఒలకబోస్తూ నిలుచున్న దీపికా రాణి పద్మిని పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. గులాబీ చోళీ, ఎరుపు లెహెంగాలో దీపికా పదుకునే పోస్టర్‌లో రాచఠీవీతో దర్శనమిచ్చారు.మరోవైపు పద్మావతి చిత్ర విడుదల నిలిపివేయాలని రాజ్‌పుట్ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి.
విడుదలకు ముందు తమకు చిత్రాన్ని ప్రదర్శించాలని లేకుంటే థియేటర్లను దగ్ధం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. రాణి పద్మిని పాత్రను అవమానకరంగా చిత్రించారని రాజ్‌పుట్‌లు ఆందోళన చేపట్టారు. చరిత్రను వక్రీకరిస్తే చిత్ర యూనిట్‌కు గట్టిగా బుద్ధిచెబుతామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు.
వివాదాల నడుమ పద్మావతి మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment