సాక్షి,న్యూఢిల్లీ: సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక దృశ్య కావ్యం పద్మావతిపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని కోరుతూ శుక్రవారం సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.సినిమా నుంచి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరారు. ఈ అంశాన్ని తాను పరిశీలిస్తానని సుప్రీం కోర్టు బదులిచ్చినట్టు సమాచారం.
కాగా అంతకుముందు పద్మావతి టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్‌కు రాజ్‌పుట్ కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ముంబయి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమె నివాసం, ముంబయి కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
చరిత్రను వక్రీకరించేలా పద్మావతి మూవీని తెరకెక్కించారని రాజ్‌పుట్ సంఘాలు, హిందూ సంస్థలు భారీ ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చే డిసెంబర్ 1న రాజ్‌పుట్ సంఘాలు భారత్ బంద్‌కు పిలుపు ఇవ్వడం ఉత్కంఠ రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment