ప్రభాస్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. కాగా ఈ మూవీ ట్రైలర్‌ని నేడు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, దీపికా పదుకోన్ లుక్‌ను విడుదల చేసింది.
‘ది హోప్ బిగిన్స్ విత్ హర్’ (ఆమెతో నమ్మకం మొదలవుతుంది) అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన దీపిక లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా ‘కల్కి 2898 ఏడీ’ రూపొందింది. మహాభారత పురాణ ఘటనల నుండి మొదలై క్రీస్తు శకం 2898లో పూర్తయ్యే కథ ఇది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన ఆరువేల ఏళ్ల వ్యవధిలో ఈ చిత్రకథ నడుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్.
Comments
Please login to add a commentAdd a comment