దీపికకు మద్దతుపై క్వీన్‌ నో | Kangana Ranaut refuses to support Deepika Padukone? | Sakshi
Sakshi News home page

దీపికకు మద్దతుపై క్వీన్‌ నో

Published Mon, Dec 4 2017 11:39 AM | Last Updated on Mon, Dec 4 2017 12:52 PM

Kangana Ranaut refuses to support Deepika Padukone? - Sakshi

సాక్షి,ముంబయి: పద్మావతి మూవీ విషయంలో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ, దీపికా పదుకోన్‌కు బాలీవుడ్‌ నటులు బాసటగా నిలిస్తే దీపికకు మద్దతిచ్చేందుకు వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ ముందుకు రాకపోవడం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. పద్మావతి చిత్రం చరిత్రను వక్రీకరిస్తూ రూపొందిందని రాజ్‌పుట్‌లు, హిందూ సంస్ధలు చిత్ర మేకర్లు, నటీనటులపై కత్తులు దూస్తున్న క్రమంలో బాలీవుడ్‌ నటులు చిత్ర బృందానికి మద్దతుగా నిలిచారు. పద్మావతి పాత్ర పోషించిన దీపికా పదుకోన్‌ను హతమారుస్తామని నిరసనకారులు హెచ్చరించిన క్రమంలో దీపికకు భద్రత కల్పించాలని కోరుతూ బాలీవుడ్‌ ప్రముఖుల సంతకాలతో కూడిన పిటిషన్‌ను ప్రధానికి సమర్పించేందుకు షబనా అజ్మీ చొరవ తీసుకున్నారు.

ఈ పిటిషన్‌పై బాలీవుడ్‌ నటులు సంతకాలు చేస్తుండగా, ప్రముఖ నటి కంగనా రనౌత్‌ మాత్రం పిటిషన్‌పై సంతకానికి నో చెప్పినట్టు సమాచారం.దీపికకు భద్రత కల్పించాలని కోరుతూ రూపొందిన పిటిషన్‌పై సంతకం చేసేందుకు కంగనా నిరాకరించడబంతో షబనా అజ్మి విస్తుపోయారని దిక్వింట్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. కంగనా, దీపిక మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న క్రమంలో తాజా ఉదంతంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని చెబుతున్నారు.

హ్యాపీన్యూఇయర్‌ మూవీకి తాను గెలుచుకున్న అవార్డును క్వీన్‌లో కంగనా పెర్‌ఫార్మెన్స్‌కు ముగ్దురాలై ఆమెకు అంకితం చేస్తున్నట్టు దీపిక ప్రకటించడం కంగనా ఆగ్రహానికి కారణమైంది. క్వీన్‌లో తన పెర్‌ఫామెన్స్‌పై తనను నేరుగా ప్రశంసించకుండా ఈ రకంగా బహిరంగంగా దీపిక ప్రకటించడం పట్ల కంగనా అసంతృప్తితో ఉంది.మరోవైపు హృతిక్‌తో తాను న్యాయపోరాటం చేస్తుంటే బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా హృతిక్‌ వైపు ఉండటం పట్ల కూడా కంగనా ఆగ్రహంతో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement